తెలుగు లిపిలో ముద్రణ
డాక్టరు. గన్నవరపు నరసింహమూర్తి .
తెలుగు భాషను సరళీకృతము చేసుకోవాలనే వాదన తరతరాలుగా ఉంది. భాషకు లిపి, పదజాలము, వ్యాకరణము ఉండి వాటిపై వాడుక ,సాహిత్యము ఆధారపడుతాయి.
లిపికి అక్షరాలు కావాలి. తెలుగు లిపిలో
అచ్చులు
అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఌ ౡ ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అః
హల్లులు
క ఖ గ ఘ ఙ్
చ ఛ జ ఝ ఞ
ట ఠ డ ఢ ణ
త థ ద ధ న
ప ఫ బ భ మ
య ర ల వ స శ ష హ ళ క్ష ఱ
గుణింత చిహ్నాలు ;
ా ి ీ ు ూ ృ ౄ ె ే ై ొ ో ౌ ం ః
వీనిలో ఌ ౡ లో వాడుకలో లేక ఇప్పటికే తొలగించబడి పుస్తకాలలో భద్రాక్షరాలుగా ఉన్నాయి.
ఇపుడు కొందఱు ఋ బదులు రు ని ఱ బదులు ర ను వాడుకుంటే రెండక్షరాలు తగ్గుతాయంటారు.
ౠ ౠ లు అచ్చులు. ఱ ద్రావిడ భాషా పదాల ప్రత్యేకతను సూచిస్తుంది. ర , ఱ ఉచ్చారణలు వేఱు. అందుచే వాటిని తొలగించకపోవుటే మేలు.
( సంపూర్ణ అక్షరమాలను ఆడుతూ , పాడుతూ నేర్చుకొనుటకు చిన్నతనములో నాకు నెల దినములు కంటె తక్కువే పట్టింది. మా పిల్లలకు వారాంతములలో నేర్పడానికి ఆరు వారాలు పట్టింది. అందువలన అది శ్రమగా పరిగణించను.
అచ్చులు
అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఌ ౡ ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అః
హల్లులు
క ఖ గ ఘ ఙ్
చ ఛ జ ఝ ఞ
ట ఠ డ ఢ ణ
త థ ద ధ న
ప ఫ బ భ మ
య ర ల వ స శ ష హ ళ క్ష ఱ
గుణింత చిహ్నాలు ;
ా ి ీ ు ూ ృ ౄ ె ే ై ొ ో ౌ ం ః
వీనిలో ఌ ౡ లో వాడుకలో లేక ఇప్పటికే తొలగించబడి పుస్తకాలలో భద్రాక్షరాలుగా ఉన్నాయి.
ఇపుడు కొందఱు ఋ బదులు రు ని ఱ బదులు ర ను వాడుకుంటే రెండక్షరాలు తగ్గుతాయంటారు.
ౠ ౠ లు అచ్చులు. ఱ ద్రావిడ భాషా పదాల ప్రత్యేకతను సూచిస్తుంది. ర , ఱ ఉచ్చారణలు వేఱు. అందుచే వాటిని తొలగించకపోవుటే మేలు.
( సంపూర్ణ అక్షరమాలను ఆడుతూ , పాడుతూ నేర్చుకొనుటకు చిన్నతనములో నాకు నెల దినములు కంటె తక్కువే పట్టింది. మా పిల్లలకు వారాంతములలో నేర్పడానికి ఆరు వారాలు పట్టింది. అందువలన అది శ్రమగా పరిగణించను.
అక్షరాలు ఒకసారి నేర్చుకొన్నాక తెలుగులో వ్రాసుకొందుకు స్పెల్లింగుల బాధ ఉండదు. )
అక్షరాలు నిజంగా తగ్గించుకొందామనుకుంటే నా సూచనలు.
1). హల్లులకు గుణింతాల వలె ’ అ ‘ కు గుణింతపు సంజ్ఞలు
అక్షరాలు నిజంగా తగ్గించుకొందామనుకుంటే నా సూచనలు.
1). హల్లులకు గుణింతాల వలె ’ అ ‘ కు గుణింతపు సంజ్ఞలు
ా, ి, ీ, ు, ూ, ృ, ౄ, ె, ే, ై, ొ, ో, ౌ లను
చేర్చుకుంటే ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఎ ఏ ఐ ఒ ఓ ఔ 13 అక్షరాలు తగ్గుతాయి.
2) క గ జ ట త లకు ఛ ఢ ధ ఫ భ ల వలె వత్తులు గాని క్రింద చుక్కలు గాని తగిలించుకుంటే
వత్తు అక్షరాలు ఖ ఘ ఝ ఠ థ లు 5 అక్షరాలు తగ్గిపోతాయి.
పైగా, క ఖ లకు, గఘ లకు, జఝ లకు, టఠ లకు, తథ లకు సారూప్యము లేదు.
పై సూచనల వలన 18 అక్షరములు తగ్గుతాయి. కాని పాత అక్షరమాలలో మార్పులు చాలా మందికి ఆమోదయోగ్యము కాకపోవచ్చును.
ఱ శ లు తొలగించుట అందఱికీ ఆమోదము కాదు.
ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఎ ఏ ఐ ఒ ఓ ఔ లను
అా అి అీ అు అూ అృ అె అే అై అొ అో అౌ లుగా చదువుకొనుటకు అందఱూ ఇష్టపడక పోవచ్చును.
కాని సాంకేతికాభివృద్ధి వలన పుస్తకాల ముద్రణ ఎలక్ట్రానిక్ గాను, గణన యంత్రముల ద్వారా జరుగుతుండడము వలన ముద్రణలోను , తప్పులు సవరించడములోను చాలా సౌకర్యాలు ఏర్పడినాయి.
అక్షరాలు తగ్గించడములో నా సూచనలను ముద్రణ మీటలకే పరిమితము చేసుకొని ముద్రించిన లిపిలో మార్పు లేకుండా చేసుకోవచ్చును.
అ కు గుణింతపు సంజ్ఞలు
ా, ి, ీ, ు, ూ, ృ, ౄ , ె, ే, ై, ొ, ో, ౌ లను చేర్చి
ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఎ ఏ ఐ ఒ ఓ ఔ లు ముద్రణ జరుగునట్లు సాంకేతిక మార్పులు చేసుకుంటే
ముద్రణ లిపి మారకుండానే 13 మీటల తావులు ( స్థలాలు ) కలసివస్తాయి.
వత్తు సంజ్ఞకు (హ్) మార్పు మీట- ( modifier key ) సమకూర్చుకొని, క గ చ జ ట డ త ద ప బ అక్షరములకు ( హ్) మార్పు మీటను జతపఱచుకొని ఖ ఘ ఛ ఝ ఠ ఢ థ ధ ఫ భ లు ముద్రణ అయే సౌకర్యమును సమకూర్చుకుంటే (హ్) మార్పు మీట పోను 9 మీటల తావులు ( spaces ) కలసి వస్తాయి.
ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఎ ఏ ఐ ఒ ఓ ఔ లు ముద్రణ జరుగునట్లు సాంకేతిక మార్పులు చేసుకుంటే
ముద్రణ లిపి మారకుండానే 13 మీటల తావులు ( స్థలాలు ) కలసివస్తాయి.
వత్తు సంజ్ఞకు (హ్) మార్పు మీట- ( modifier key ) సమకూర్చుకొని, క గ చ జ ట డ త ద ప బ అక్షరములకు ( హ్) మార్పు మీటను జతపఱచుకొని ఖ ఘ ఛ ఝ ఠ ఢ థ ధ ఫ భ లు ముద్రణ అయే సౌకర్యమును సమకూర్చుకుంటే (హ్) మార్పు మీట పోను 9 మీటల తావులు ( spaces ) కలసి వస్తాయి.
ఇప్పుడు గణనయంత్రాలలో ద్విత్వాక్షరాలను, సంయుక్తాక్షరాలను హల్లుకు పొల్లు మీట ్ ను జతపఱచుకొని ఆపై క్రింద వ్రాయవలసిన అక్షరమును చేర్చుతున్నాము. గణనయంత్రాలలో సంయుక్తాక్షరముల చిహ్నాలకు మీటలు లేవు. ఖ ఘ ఛ ఝ థ ధ ఫ భ మ అక్షరాలకు కూడా అటువంటి సౌఖ్యమును ఏర్పఱచుకోవచ్చును.
న మీటకు మార్పు మీటను ( modifier key ) జత పఱచుకొని ణ ను
ర మీటకు మార్పు మీట జతపఱచుకొని ఱ ను ,
ల మీటకు మార్పు మీట జతపఱచి ళ ను
స మీటకు మార్పు మీట జతపఱచి ష ను ముద్రించుకుంటే మరో 4 మీటల తావులు కలసి వస్తాయి.
ం కు మార్పు మీట కలిపి ః ను ముద్రించుకుంటే మరో మీట తగ్గుతుంది.
పై సూచనల వలన తెలుగులిపి ముద్రణలో 27 మీటల తావులు ( spaces ) తగ్గించుకుంటూనే
ముద్రించిన లిపిని యథాతథముగా ఉంచుకొనే అవకాశ మున్నది.
దేవనాగర (హిందీ) లిపిలో అ గుణింతముతో అచ్చులన్నీ వ్రాసుకొనే వెసులుబాటు కల్పించుకుంటే
अ। आ अि ( इ ) अी ( ई ) अु ( उ ) अू ( ऊ) अृ ( ऋ ) अे (ए ) अै ( ऐ ) अो औ
అచ్చులలో 7 మీటల తావులు కలసివస్తాయి.
మార్పు అక్షర మీట ( ह्) జతపఱచి क ग च ज ट ड त द प ब स न లను
ख घ छ झ ठ ढ थ ध फ भ श ण లుగా ముద్రించుకొనే
వెసులుబాటు కల్పించుకుంటే మార్పు మీట పోతే 11 మీటల తావులు మిగులుతాయి.
क + ष। = क्ष చేసుకుంటే మరో మీట మిగులుతుంది
మొత్తము 19 మీటల తావులను మిగుల్చుకొనవచ్చును.
కన్నడభాషలో తెలుగు సూచనలనే అనుసరించు కొనవచ్చును. మిగిలిన భారతీయ భాషల లిపులలో కూడా యీ సూచనలను అనుసరించుకొని ముద్రణ మీటలను తగ్గించుకొనవచ్చును.
కన్నడ తెలుగు లిపులను కలుపుకొని రెండుభాషలకు సామాన్యలిపిని సమకూర్చుకొనాలనే ఆలోచన తరతరాలుగా ఉన్నది
భారతీయ భాషలన్నిటికీ దేవనాగరలిపిని వాడుకుంటే దేశమంతటా ఒకే లిపి ఉంటుంది. కాని యీ సూచన దక్షిణరాష్ట్ర ప్రజలకు , ఆయా భాషాభిమానులకు ఆమోదయోగ్యము కాకపోవచ్చును. అలా అయే పక్షములో తరతరాల క్రితమే భారతీయభాష లన్నిటికీ ఒకే ఒక లిపి ఉండి ఉండేది. సాంకేతికాభివృద్ధి వలన లిప్యంతరి వంటి ఉపయుక్తములు అందుబాటులో ఉండడము వలన లిపులను వేఱు భాషలలోనికి మార్చుకొనుట , అనువాదములు చేసుకొనుట సులభతరము అయ్యాయి.
తెలుగుభాషకు రోమన్ లిపిని కొందఱు పెద్దలు సూచించారు. శ్రీ శ్రీ కూడా సూచించారు. నా ఉద్దేశములో అది అనువు కాదు. ట ఠ త థ డ ఢ ద ధ ప ఫ వంటి అక్షరాలకు ఇబ్బంది. తెంగ్లీషు చదవడానికి చాలా యిబ్బందిగా ఉంటుంది. దీర్ఘాక్షరాలు , హ్రస్వాక్షరాలు గుర్తించడములో చాలామందికి యిబ్బంది ఉంది.
పదజాలము :
ఏ భాషైనా మార్పులు చెందుతూ కొత్త పదాలు చేరుతాయి. మాండలిక వైవిధ్యము వలన చాలా పదాలు ఉంటాయి. పాత సాహిత్యములోనున్న పదాలు అంత త్వరగా పోవు. పోవలసిన అవసరము లేదు. నిత్యము వాడని పదాలకు నిఘంటువుల సాయము సాంకేతిక అభివృద్ధి వలన సులువుగా లభ్యమయింది.కఠినపదాలు కఠినసాహిత్యములు ఎవరి పైనా ఎవరూ బలవంతముగా రుద్దలేరు. ఇష్టపడిన వారే చదువుకుంటారు.
మాండలికాలు అన్యభాషాపదాలు కూడా అంతే. పదజాలమును ఎవరూ నియంత్రించ లేరు.
వ్యాకరణము :
వ్యావహారిక భాషకైనా వ్రాత భాషకు కనీసపు వ్యాకరణము అవసరమే. కర్త , కర్మ , క్రియలు, లింగ, వచన, కాల, భేదములు, పదాలను సరిగ్గా వ్రాయడము, రాని సంధులను చేర్చకపోవడము వంటి కనీసపు నియమాలను పాటించాలి.
కాని శిష్టవ్యావహారికపు భాషలో సంధులు వాడకపోవడము మంచిది. సంధులు వాడితే తెలియని పదములకు నిఘంటువులలో అర్థాలు చూసుకోవడము కష్టము. తెలుగుభాషను కొత్తగా నేర్చుకునేవారికి, సాంకేతికంగా అనువాదాలు చేసే గూగుల్ వంటి సంస్థలకు సంధులు ఇబ్బంది కలిగిస్తాయి. సంధులు చేయకపోతే వచ్చే నష్టం లేదు.
మఱి గ్రాంథిక భాష , ఛందోబద్ధకవిత్వము ఉండకూడదనే అభిప్రాయము కూడదు. ఏ భాషైనా వేఱు వేఱు అంతస్థులలో ఉంటుంది. ఆంగ్లభాషా నైపుణ్యము కూడా అందఱికీ ఒకేలా ఉండదు. నాకు తెలియని పదాలెవరైనా వాడితే కావాలంటే నిఘంటువు చూసుకుంటా. లేకపోతే నా కెందుకులే అని పట్టించుకోను. మాండలికాలు, జానపదాలు వలె భాషకు వైవిధ్యముండుట తప్పు కాదు. భాషను నియంత్రించే హక్కు ఎవఱికీ లేదు. కుదఱదు
గ్రాంథికభాషపై అభిలాష ఉన్నవారికి సంధులు, సమాసాల పరిజ్ఞానము అవసరమే, కాని అభిలాష ఉన్నవారు నేర్చుకోవచ్చును. పాఠశాలలలో కొంత పరిచయము చేస్తే సరిపోతుంది.