16, జులై 2021, శుక్రవారం

వైద్యపదకోశము

వైద్యపదకోశము

                                                              డాక్టరు . గన్నవరపు నరసింహమూర్తి.

 ఆరోగ్యము ; వైద్యము


Anatomy  = దేహనిర్మాణ శాస్త్రము
Bacteria  = సూక్ష్మ జీవులు
Biochemistry = జీవరసాయన శాస్త్రము 
Cancers  = కర్కట వ్రణములు ( గ.న ) ; పుట్టకురుపులు
Congenital diseases = పుట్టువ్యాధులు
Computerized axial tomography = గణనయంత్ర త్రిదిశ చిత్రీకరణము ( గ.న ) / గణనయంత్ర త్రిమితీయ చిత్రీకరణము ( గ.న )
Degenerative diseases = శిథిల వ్యాధులు 
Diabetes = మధుమేహ వ్యాధి 
Electrocardiography = హృదయవిద్యుల్లేఖనము ; విద్యుత్ హృల్లేఖ
Endoscopy = అంతర్దర్శనము ( గ.న )
Fungi = శిలీంధ్రములు
Genetic disorders  = జన్యు సంబంధ వ్యాధులు
Infections = ఆక్రమిత  వ్యాధులు ( గ.న )
life styles  = జీవనరీతులు 
Magnetic resonance imaging = అయస్కాంత ప్రతిధ్వని చిత్రీకరణములు ( గ.న )
Microbiology  = సూక్ష్మజీవుల శాస్త్రము 
Neoplasms = కొత్త పెరుగుదలలు 
Parasites = పరాన్నభుక్తులు
Pathology = వ్యాధివిజ్ఞాన శాస్త్రము
Pharmacology = ఔషధ శాస్త్రము
Physiology = శరీరవ్యాపార శాస్త్రము 
Ultrasonography = శ్రవణాతీత ధ్వని చిత్రీకరణములు (గ.న )
Viruses = విషజీవాంశములు ( గ.న )

మధుమేహ వ్యాధి ( Diabetes mellitus )

Acidosis = ఆమ్లీకృతము
Autoimmune diseases = స్వయంప్రహరణ వ్యాధులు ( గ.న )
Cancers = కర్కట వ్రణములు ( గ.న )
Cerebrovascular accidents = మస్తిష్క విఘాతములు ( గ.న )
Enzymes = జీవోత్ప్రేరకములు ( గ.న )
 Gestational Diabetes = గర్భిణీ మధుమేహము  
Gluconeogenesis = శర్కర నవజాతము (గ.న )
Glycemic Index = (రక్తపు) చక్కెర సూచిక ; శర్కర సూచిక ( గ.న )
Glycogenesis = మధుజని జాతము (గ.న )
Glycogenolysis = మధుజని విచ్ఛిన్నము (గ.న )
Glucose intolerance = శర్కర అసహనము ( గ.న )
Heart attack = హృదయ ఘాతము ( గ.న )
Hypoglycemia = శర్కర హీనత ( గ.న )
Lypolysis = మద విచ్ఛిన్నము ( గ.న )
Metabolism = జీవ వ్యాపార క్రియ ( గ.న )
Monosaccharides = ఏక శర్కరలు ( గ.న )
Oxygenation = ఆమ్లజనీకృతము ( గ.న )
Polysaccharides = బహుళ శర్కరలు ; సంకీర్ణ శర్కరలు ( గ.న )
Reabsorption = పునర్గ్రహణము (గ.న )

అధిక రక్తపీడనము ( Hypertension )

Aorta = బృహద్ధమని
Atrium  = కర్ణిక
Diastolic pressure = వికాస పీడనము ( గ.న )
 Hypertension = అధిక రక్తపీడనము ; అధికరక్తపు పోటు 
Hypertensive crisis = అధిక రక్తపీడన సంక్షోభము ( గ.న )
Inferior venacava = అధో బృహత్సిర
Intravenous drugs = సిరాంతర ఔషధములు ( గ.న )
Pulmonary artery = పుపుస ధమని
Pulmonary vein = పుపుస సిర
Smooth muscle  మృదు కండరము ( గ.న )
Superior venacava = ఊర్ధ్వ బృహత్సిర
Systolic pressure = ముకుళిత పీడనము ( గ.న )
Ventricles = జఠరికలు

కొవ్వులు ; కొలెష్ట్రాలు

Atherosclerosis = ధమనీ కాఠిన్యము
 Dyslipidemias =   వస ( కొవ్వు పదార్థ ) విపరీతములు ( గ.న )
 Fatty acids = వసామ్లములు ; కొవ్వు ఆమ్లములు
Foam cells = ఫేన కణములు (గ.న )
 Hydrophilic = జలాపేక్షక 
 Hydrophobic = జలవికర్షణ 
Intima = రక్తనాళపు లోపొర ( గ.న )
Macrophages = పృథు భక్షక కణములు ( గ.న )
Very low density lipoproteins = అల్పతమ సాంద్ర లైపో ప్రోటీనులు ( గ.న )
 Intermediate density lipoproteins = అల్పతర సాంద్ర లైపో ప్రోటీనులు (గ.న )
 Low density lipoproteins = అల్పసాంద్ర లైపోప్రోటీనులు (గ.న )
 High density lipoproteins = అధిక సాంద్ర లైపోప్రోటీనులు ( గ.న )
 

గళగ్రంథి హీనత ( Hypothyroidism )

Thyroid = గళగ్రంథి
Hypothyroidism = గళగ్రంథి హీనత ( గ.న )
Thyroid Lobes = గళగ్రంథి  కర్ణికలు ( గ.న )
Thyroid Isthmus = గళగ్రంథి కర్ణికా సంధానము ( గ.న )
Basal metabolic rate  =  విరామ జీవవ్యాపార ప్రమాణము ( గ.న ) ; విశ్రాంత జీవవ్యాపార ప్రమాణము (అ.చ )
Pituitary gland = పీనస గ్రంథి
Hormones = నిర్నాళ రసములు ; వినాళ స్రావకములు 
Thyroid stimulating hormone ; Thyrotropin  = గళగ్రంథి ప్రేరేపకము ( గ.న )
Thyrotropin releasing hormone = గళగ్రంథి ప్రేరేపక విమోచిని ( గ.న )
Feed back = ప్రతివర్తమానము ( గ.న )
Metabolism = జీవ వ్యాపారము ( గ.న )
Autoimmune disease = స్వయంప్రహరణ వ్యాధి ( గ.న )
Iatrogenic = చికిత్సా జనితము ( గ.న )
Goitre = గలగండము
Overt hypothyroidism = విదిత గళగ్రంథి హీనత ( గ.న )
Subclinical hypothyroidism = అగోచర గళగ్రంథి హీనత ( గ.న )
TSH Receptors  = గళగ్రంథి ప్రేరేపక గ్రాహకములు ( గ.న )
Ultrasonography = శ్రవణాతీతధ్వని చిత్రీకరణము ( గ.న )
Magnetic resonance imaging = అయస్కాంత ప్రతినాద చిత్రీకరణ ( గ.న )
Autoimmune thyroiditis = స్వయంప్రహరణ గళగ్రంథి తాపము ( గ.న )

                     గళగ్రంథి ఆధిక్యత ( Hyperthyroidism )

Hyperthyroidism =  గళగ్రంథి ఆధిక్యత ( గ.న )
Atrial fibrillation = హృదయ కర్ణికా ప్రకంపనము ( గ.న )
Sympathetic nervous system = సహవేదన నాడీమండలము
Thyroid storm = గళగ్రంథి సంక్షోభము ( గ.న )
Oligomenorrhea  =  మంద ఋతుస్రావము ( గ.న )
Diffuse toxic goiter =  స్రావకోద్రేక సమగళగండము ( గ.న )
Multinodular goiter  = బహుళకిణ గళగండము (గ.న )
Exophthalmos = వెలిగుడ్లు ( గ.న ) 
Radioactive Iodine = రేడియోధార్మిక అయొడిన్ 
Parathyroid glands  = సహగళగ్రంథులు ( గ.న )

పొగాకు ; ధూమపానము :

Alveoli = పుపుస గోళములు ( గ.న )
Atherosclerosis = ధమనీ కాఠిన్యము 
Cancers = పుట్టకురుపులు ; కర్కట వ్రణములు ( గ.న )
Carcinogens = కర్కటవ్రణ జనకములు ( గ.న )
Cerebrovascular accidents = మస్తిష్క (రక్తనాళ ) విఘాతములు ( గ.న )
Chronic obstructive pulmonary disease = దీర్ఘకాలిక శ్వాస అవరోధక వ్యాధి ( గ.న )
Cilia = కదలాడే సూక్ష్మకేశములు  ( గ.న )
Elastic tissue = సాగు కణజాలము ( గ.న )
Emphysema = ఊపిరితిత్తుల వ్యాకోచవ్యాధి ; ఊపిరితిత్తుల ఉబ్బు ( గ.న )
Fibrinogen = తాంతవజని 
Genetic mutation  = జన్యువుల మార్పు ; జన్యుపరివర్తనము ( గ.న )
Heart attack = గుండెపోటు
Lymphatic channels = రసి నాళికలు ( గ.న )
Lymph nodes = రసిగ్రంథులు
Metastasis = అవయవాంతర వ్యాప్తి ( గ.న )
Peripheral arterial  disease = దూరధమనుల వ్యాధి ( గ.న )
Platelets = రక్తఫలకములు ( గ.న )
Pulmonary diseases = శ్వాసకోశ వ్యాధులు 

హృదయ రక్తప్రసరణ లోపము ( Ischemic Heart Disease )

Acute Kidney Injury  = సత్వర మూత్రాంగవిఘాతము ( గ.న )
Anaphylaxis  = రక్షణ వికటత్వము ( గ.న )
Anemia = పాండురోగము 
Anterior inter ventricular sulcus = పూర్వ జఠరికాంతర గర్తము ( గ.న )
Angina pectoris = గుండెనొప్పి
Angioplasty  = ధమనీ వ్యాకోచ చికిత్స ( గ.న )
Aortic stenosis = బృహద్ధమని కవాట సంకుచితము ( గ.న )
Arteriosclerosis = ధమనీ కాఠిన్యత
Bradycardia = హృదయ మాంద్యము ( గ.న )
Catheter = కృత్రిమ నాళము ( గ.న )
Congestive heart failure = హృదయ వైఫల్యము 
Coronary angiography  = హృద్ధమనుల చిత్రీకరణము ( గ.న )
Coronary arteries = హృద్ధమనులు ; హృదయ ధమనులు
Coronary artery bypass grafting = హృద్ధమని అవరోధ అధిగమన శస్త్రచికిత్స  ( గ.న )
Coronary veins = హృత్సిరలు ( గ.న )
Diagonal branches = వక్ర శాఖలు ( గ.న )
Diastole = హృదయ వికాసము ( గ.న )
Disease sensitivity = వ్యాధి గ్రహణత ( గ.న )
Disease Specificity = వ్యాధి నిర్దిష్టత ( గ.న )
Dissecting aortic aneurysms  = విచ్ఛేదన బృహద్ధమని బుద్బుదములు ( గ.న )
Echocardiography = ప్రతిధ్వని హృదయ చిత్రీకరణము ( గ.న )
Elastic tissue = సాగు కణజాలము ( గ.న )
Electrocardiogram = హృదయ విద్యుల్లేఖనము 
End diastolic volume = వికాసాంతర ( రక్త )ప్రమాణము ( గ.న )
Exercise electrocardiography = వ్యాయామ  హృదయవిద్యుల్లేఖనము ( గ.న )
Exercise stress testing  = వ్యాయామపు ఒత్తిడి పరీక్ష గ.న )
False positive results = తప్పుడు అనుకూల ఫలితములు ( గ.న )
Femoral artery = ఊరు ధమని ( గ.న )
Fibrous tissue = పీచుకణజాలము 
Heart attack  ( myocardial infarction ) = గుండెపోటు
High Density Lipoproteins = అధికసాంద్రపు లైపోప్రోటీనులు ( గ.న )
Hyperthyroidism = గళగ్రంథి ఆధిక్యత (గ.న )
Hypertrophic cardiomyopathy  = హృదయకండర అతివృద్ధివ్యాధి  ( గ.న )
Infarction = ప్రసరణరహిత మరణము ( గ.న )
Intermediate artery = మధ్యస్థ ధమని ( గ.న )
Internal mammary artery = అంతరస్తన ధమని ( గ.న )
Inter ventricular septum = జఠరికాంతర కుడ్యము ( గ.న ) జఠరికల నడిమి గోడ ( గ.న )
Ischemia = రక్తప్రసరణ లోపము ( గ.న )
Ischemic heart diseases = హృదయ రక్తప్రసరణ లోప వ్యాధులు ( గ.న )
Left anterior descending artery = వామ పూర్వఅవరోహణ ధమని ( గ.న )
Left circumflex artery = వామ పరిభ్రమణధమని ( గ.న )
Left coronary artery = వామ హృద్ధమని ( గ.న )
Left ventricular ejection fraction = ఎడమ జఠరిక రక్తప్రసరణ శాతము ( గ.న )
Lining cells = పూత కణములు ( గ.న )
Low Density Lipoproteins  = అల్పసాంద్రపు లైపోప్రోటీనులు ( గ.న )
Magnetic resonance perfusion imaging = అయస్కాంత ప్రతిధ్వని హృదయప్రసరణ చిత్రీకరణములు ( గ.న )
Myocardial perfusion defects  = హృదయ కండర రక్తప్రసరణ లోపములు ( గ.న )
Myocardial perfusion imaging = హృదయ ప్రసరణ  చిత్రీకరణము (గ.న )
Plaques  = ఫలకలు
Peripheral Arterial Diseases = దూరధమని వ్యాధులు ( గ.న )
Pneumothorax  = పుపుసవేష్టన వాయువు ( గ.న )
Polycythemia vera  = బహుళ రక్తకణ వ్యాధి ( గ.న )
Posterior descending artery = పర అవరోహణధమని ( గ.న )
Posterior inter ventricular sulcus = పర జఠరికాంతర గర్తము ( గ.న )
Radial artery = ముంజేతి బహిర్ధమని ( గ.న )
Right coronary artery = దక్షిణ హృద్ధమని ( గ.న )
Right marginal artery = కుడి మేర ధమని (గ.న )
Saphenous vein = దృశ్య సిర ( గ.న )
Septal branches = కుడ్య శాఖలు ( గ.న )
Smooth muscles = మృదు కండరములు (గ.న )
Spasm = దుస్సంకోచము 
Stent = వ్యాకోచ సాధనము ( గ.న )
Systolic blood pressure = ముకుళిత రక్తపీడనము ( గ.న )
Thrombolytic therapy = రక్తపు గడ్డల విచ్ఛేదన చికిత్స
Tunica externa or adventitia = రక్తనాళపు గోడలో బయటపొర ( గ.న )
Ventricular fibrillation = జఠరిక ప్రకంపన ( గ.న )
Tunica media =  రక్తనాళపు మధ్యపొర  ( గ.న )


సత్వర హృద్ధమని వ్యాధులు ( Acute Coronary Syndrome )

Acute Coronary Syndrome = సత్వర హృద్ధమని వ్యాధులు ( గ.న )
Angina = గుండెనొప్పి
Angioplasty = ధమనీ వ్యాకోచ చికిత్స ( గ.న )
Atherosclerotic plaques = ధమనీ కాఠిన్య ఫలకలు ( గ.న )
Cerebrovascular accident = మస్తిష్క విఘాతము ( గ.న )
Cardioverter-Defifrillator = హృదయ లయ సవరణి ( గ.న )
Cardiogenic shock = హృదయ జనిత ఘాతము / హృదయ జనిత ఉపద్రవము ( గ.న )
Coronary angiography = హృద్ధమనుల చిత్రీకరణము ( గ.న)
Coronary artery bypass surgery = హృద్ధమని అవరోధ అధిగమన శస్త్రచికిత్స ( గ.న ) 
Femoral artery = ఊరు ధమని ( గ.న )
Ischemia = రక్తప్రసరణ లోపము (గ.న )
Internal mammary artery = అంతర స్తనధమని ( గ.న )
Left ventricular ejection fraction = ఎడమ జఠరిక ప్రసరణశాతము ( గ.న )
Ventricular fibrillation = జఠరికా ప్రకంపనము ( గ.న )
ventricular tachycardia  = జఠరికాతివేగము ( గ.న )
Myocardial infarction = గుండెపోటు
Nausea =  వమన (వాంతి) భావన ( గ.న )
Low Density Lipoproteins = అల్పసాంద్రపు లైపోప్రోటీనులు ( గ.న )
High Density Lipoproteins = , అధికసాంద్రపు లైపోప్రోటీనులు (గ.న )
ischemic heart disease= హృదయ రక్తప్రసరణ లోపవ్యాధి ( గ.న )
Peripheral Arterial Diseases  = దూరధమని వ్యాధులు  ( గ.న )
Saphenous vein = దృశ్యసిర ( గ.న )
Stable angina =  స్థిర హృద్ధమని వ్యాధి ( స్థిరపు గుండెనొప్పి )( గ.న )
Stent = వ్యాకోచ సాధనము ( గ.న )
Thrombi = రక్తపుగడ్డలు ( గ.న )
Thrombolytic therapy = రక్తపు గడ్డల విచ్ఛేదన చికిత్స ( గ.న )
Unstable Angina  = అస్థిర హృద్ధమని వ్యాధి ( అస్థిరపు గుండెనొప్పి )( గ.న )
Infarction  = ప్రసరణరహిత మరణము ( గ.న )
Spasm = దుస్సంకోచము 
Oxygen saturation = ప్రాణవాయువు సంతృప్తత ( గ.న )
Mitral Regurgitation = ద్విపత్రకవాట తిరోగమన రక్తప్రసరణము  ( గ.న )
Ventricular Septal Defect  = జఠరికాంతర కుడ్య రంధ్రము ( గ.న )
             ( జఠరికల నడిమి గోడలో కన్నము ) (గ.న )
Dissecting aortic aneurysm = బృహద్ధమని విదళన బుద్బుదము ( గ.న )
                                                ( బృహద్ధమని గోడలో చీలిక ) ( గ.న )
Pericarditis = హృదయవేష్టన తాపము ( గ.న )
Cardiac markers = హృదయ సూచకములు ( గ.న )
Revascularisation = రక్తప్రసరణ పునరుద్ధరణ ( గ.న )
Echocardiogram = ప్రతిధ్వని హృదయ చిత్రీకరణము ( గ.న )
Myocarditis = హృదయ కండర తాపము ( గ.న )
Aortic stenosis = బృహద్ధమని కవాట సంకీర్ణత ( సంకోచము ) ( గ.న )
Aortic dissection = బృహద్ధమని విదళనము / బృహద్ధమని చీలిక
 (గ.న )

హృదయ వైఫల్యము ( Congestive Heart Failure )

Alveolus  = ఊపిరి బుడగ  ; పుపుస గోళము ( గ.న )
Angiotensin Receptor Blockers = ఏంజియోటెన్సిన్ గ్రాహక అవరోధకములు ( గ.న )
Aorta = బృహద్ధమని
Aortic valve = బృహద్ధమని కవాటము ( గ.న )
Arrhythmias = అసాధారణ లయలు ( గ.న )
Arterial bypass surgery =  ధమనీ అవరోధ అధిగమన శస్త్రచికిత్స ( గ.న )
Arteriovenous fistulas = ధమనీ సిర సంధానములు (గ.న )
Ascites = జలోదరము
Atria = కర్ణికలు 
Atrial fibrillation = కర్ణికా ప్రకంపనము ( గ.న )
Autoimmune diseases = స్వయంప్రహరణ ( ప్రతిరక్షిత ) వ్యాధులు ( గ.న )
Beta receptor blockers = బీటా గ్రాహక అవరోధకములు ( గ.న )
Bicuspid valve = ద్విపత్ర కవాటము 
cardiac arrhythmias = అసాధారణ హృదయ లయలు ( గ.న )
Congestive Heart Failure = హృదయ వైఫల్యము 
Contractility = ముకుళింపు
Coronary artery disease = హృదయ ధమనుల వ్యాధి ; హృద్ధమనుల వ్యాధి 
Defibrillator) = ప్రకంపన నివారణి ( గ.న )
Dialysis = రక్తశుద్ధి 
Diastole = హృదయ వికాసము ( గ.న )
Diuretics = మూత్ర కారకములు 
Echocardiogram = ప్రతిధ్వని హృదయ చిత్రీకరణము ( గ.న )
Ejection fraction = ప్రసరణ శాతము ( గ.న )
Electrolytes = విద్యుద్వాహక లవణములు
Electrocardiogram = హృదయవిద్యుల్లేఖ ; విద్యత్ హృల్లేఖ
Fibrosis = తంతీకరణము 
High output  failure  = అధిక ప్రసరణ వైఫల్యము ( గ.న )
Murmurs = మర్మర శబ్దములు 
Nephrons = మూత్ర నాళికలు ( గ.న )
Neurotransmitters = నాడీ ప్రసరిణులు
Cardiac pacemaker = హృదయ విద్యుత్ప్రేరకము ( గ.న )
Oxygen saturation =  ప్రాణవాయు సంతృప్తత 
Pericardial constriction = హృత్కోశ ఆకుంచనము ( గ.న )
Pericarditis = హృత్కోశ తాపము ( గ.న )
Pericardial effusion = జల హృత్కోశము ( గ.న )
Pulmonary artery = పుపుస ధమని
Pulmonary edema = ఊపిరితిత్తుల నీటి ఉబ్బు  ( గ.న )
Edema = నీటి ఉబ్బు ; నీటి వాపు ( గ.న )
Pulmonary valve = పుపుస కవాటము 
Pulmonary veins = పుపుస సిరలు
Regurgitation = తిరోగమన ప్రసరణ ( గ.న )
Sympathetic nervous system = సహవేదన నాడీమండలము 
Systole = హృదయ ముకుళితము ( గ.న )
Vasodilators = రక్తనాళ వ్యాకోచకములు ( గ.న )
Ventricles = జఠరికలు 
Ventricular assist devices = జఠరిక సహాయ పరికరము ( గ.న )
Ventricular filling pressure = జఠరిక పూరక పీడనము ( గ.న )
Tricuspid valve = త్రిపత్ర కవాటము 

దూరధమని వ్యాధి ( Peripheral arterial disease )

 Peripheral Arterial Disease = దూర ధమని వ్యాధి ( గ.న )
 abdominal aorta = ఉదర బృహద్ధమని ( గ.న )
 ileac arteries = శ్రోణి ధమనులు
 external ileac artery = బాహ్య శ్రోణిధమని 
 internal ileac artery = అంతర శ్రోణి ధమని
 femoral artery =  ఊరు ధమని ( గ.న )(ఊరువు = తొడ )
 Profunda femoris artery = నిమ్నోరు ధమని ( గ.న )
Superficial femoral artery = బాహ్యోరు ధమని ( గ.న )
Polpliteal artery = జాను ధమని ( గ.న )
 anterior tibial artery = పూర్వ జంఘిక ధమని ( గ.న )
 Posterior tibilal artery = పృష్ఠ జంఘిక ధమని ( గ.న )
 Dorsalis pedis artery = ఊర్ధ్వపాద ధమని ( గ.న )
 metatarsal artery ,( or ) arcuate artery = మధ్యపాద ధమని శాఖ ( గ.న )
 dorsal arterial plantar arch = ఊర్ధ్వపాద ధమనీ  చాపము ( గ.న )
 digital arteries  = అంగుళిక ధమనులు ( గ.న )
medial plantar artery = మధ్యస్థ పాదతల ధమని ( గ.న )
 lateral plantar artery = ( గ.న )
 deep plantar artery of dorslis pedis artery = నిమ్నపాద ధమని ( గ.న )
 plantar arterial arch = పాదతల ధమనీ చాపము ( గ.న )
 elastic tissue = సాగుకణజాలము ( గ.న )
 fibrous tissue = పీచుకణజాలము ( గ.న ) , తంతుకణజాలము
 arteriosclerosis = ధమనీ కాఠిన్యత
 intermittent claudication  = సవిరామపు పోటు ( గ.న )
 Ankle Brachial Index ABI index = చీలమండ రక్తపీడనము / బాహు రక్తపీడనము ( గ.న )
    ( చీలమండ బాహు రక్తపీడన సూచిక ) ( గ.న )
 treadmill = నడక యంత్రము (గ.న )
 magnetic resonance Angiography = అయస్కాంత ప్రతిధ్వని ధమనీ చిత్రీకరణము ( గ.న )
 CT Angiogram  = గణనయంత్ర త్రిదిశ ధమనీ చిత్రీకరణము ( గ.న ) / గణనయంత్ర త్రిమితీయ ధమనీ చిత్రీకరణము ( గ.న )
 abdominal aortic aneurysms = . ఉదర బృహద్ధమని బుద్బుదము ( బుడగ ) ( గ.న )
 collateral circulation = ప్రత్యామ్నాయ ప్రసరణ ( గ.న )
 Revascularization procedures = ధమనీ పునరుద్ధరణ చికిత్సలు ( గ.న )
 bypass surgeries = అధిగమన శస్త్రచికిత్సలు ( గ.న )

ఉబ్బు సిరలు ( Varicose veins )

Arteries = ధమనులు
Basement membrane = మూలాధారపు పొర గ.న )
Collagen = పీచుకణజాలము ( గ.న )
Cryoprobes  = శీతల శలాకలు
Deep veins = నిమ్నసిరలు ( గ.న )
Digital vein  = అంగుళికసిర ( గ.న )
Dorsal venous arch of foot = ఊర్ధ్వపాదసిరచాపము ( గ.న )
Elastin = సాగుకణజాలము ( గ.న )
Endovenous ablation  = సిరాంతర విధ్వంసము ( గ.న )
External ileac vein = బాహ్యశ్రోణిసిర (గ.న ) 
Fascia = కండరాచ్ఛాదనము ( గ.న )
Femoral vein  = ఊరుసిర 
Great saphenous vein  = గరిష్ఠ దృశ్యసిర ( గ.న )
Common ileac vein = శ్రోణిసిర ( గ.న )
Inferior venacava = అధోబృహత్సిర
Intermittent pneumatic compression devices = సవిరామ వాయుపీడన సాధనములు ( గ.న )
Internal ileac vein = అంతర శ్రోణిసిర ( గ.న )
Lesser Saphenous vein  = కనిష్ఠ దృశ్యసిర ( గ.న )
Perforator veins = ఛిద్ర సిరలు ( గ.న )
Popliteal vein = జాను సిర ( గ.న )
Saphenous orifice = దృశ్యసిర రంధ్రము ( గ.న )
Sclerosing agents = తంతీకరణ రసాయనకములు ( గ.న )
Stasis dermatitis = నిశ్చలత చర్మతాపము ( గ.న )
Superficial veins  = బాహ్య సిరలు
Superior venacava = ఊర్ధ్వబృహత్సిర 
Varicose veins = ఉబ్బు సిరలు ( గ.న )
Varicose venous ulcers = ఉబ్బుసిర వ్రణములు ( గ.న )
Veins = సిరలు
Capillaries =సూక్ష్మరక్తనాళికలు ; కేశ ( రక్త) నాళికలు

నిమ్నసిర రక్తఘనీభవనము ( Deep vein thrombosis ) ; పుపుసధమని ప్రసరణావరోధకము 
( Pulmonary artery embolism) :

Abscess = చీము తిత్తి ( గ.న )
Alveoli = పుపుస గోళములు ( గ.న )
Aneurysm = ధమని బుడగ ; ధమనీ బుద్బుదము ( గ.న )
Anterior tibial vein = పూర్వజంఘిక సిర ( గ.న )
Arterial blood gas studies = ధమనీరక్త వాయుపరీక్షలు ( గ.న )
Anti inflammatory agents = తాప నివారణులు (గ.న )
Anticoagulants = రక్తఘనీభవన అవరోధకములు ( గ.న )
Auto antibodies = స్వయంప్రహరణ ప్రతిరక్షకములు ( గ.న )
Baker’s cyst of Gastrocnemio- semimebranosus bursa  = జానుభస్త్రిక బుద్బుదము ( గ.న )
Cancers = కర్కట వ్రణములు ( గ.న )
Clotting factors = రక్తఘనీభవన అంశములు ( గ.న )
Common ileac vein  = శ్రోణి సిర ( గ.న )
Computerized Axial Tomography = గణనయంత్ర త్రిదిశ చిత్రీకరణము ( గ.న ) / గణనయంత్ర త్రిమితీయ చిత్రీకరణము ( గ.న )
Coronary artery diseases = హృద్ధమనీ వ్యాధులు 
costochondrtis = పార్శ్వాస్థి - మృదులాస్థి తాపము ( గ.న )
Deep fascia = కండర ఆచ్ఛాదనము ( గ.న )
Deep veins = నిమ్న సిరలు ( గ.న )
Deep vein thrombosis = నిమ్నసిర రక్తఘనీభవనము ( గ.న )
Digital vein  = అంగుళిక సిర ( గ.న )
Dissecting aortic aneurysm = బృహద్ధమని విదళన వ్యాకోచము ( గ.న ) ;   బృహద్ధమని విదళన బుద్బుదము ( గ.న )
Dorsal venous arch of foot = ఊర్ధ్వపాద సిరచాపము  ( గ.న )
Echocardiography = హృదయ ప్రతిధ్వని చిత్రీకరణము ( గ.న )
Emboli = రక్తప్రసరణ అవరోధకములు ( గ.న ) ; ప్రసరణ అవరోధకములు ; ప్రవాహ అవరోధకములు ( గ.న )
External ileac vein = బాహ్య శ్రోణిసిర ( గ.న )
Femoral vein  = ఊరు సిర 
Fibrin = తాంతవము 
Fibrinogen = తాంతవజని 
Great saphenous vein = గరిష్ఠ దృశ్యసిర ( గ.న )
Saphenous vein = దృశ్యసిర ( గ.న )
hematoma = కణజాలములో రక్తపుగడ్డ ( గ.న )
Hemoptysis  =  రక్త కఫము ( గ.న )
Hemostasis = రక్తస్రావ నివారణము ( గ.న ); రక్త స్థిరత్వము ( గ.న )
Hyper coagulability =  అధిక ( శీఘ్ర ) రక్త ఘనీభవన లక్షణము ( గ.న )
Inferior venacava = అధోబృహత్సిర 
Internal ileac vein = అంతర శ్రోణిసిర 
Intima = రక్తనాళపు లోపొర  ( గ.న )
Lesser saphenous vein = కనిష్ఠ దృశ్యసిర ( గ.న )
Magnetic Resonance Imaging = అయస్కాంత ప్రతిధ్వని చిత్రీకరణము ( గ.న )
Medially = మధ్యస్థముగా 
Perfusion defects = ప్రసరణ లోపములు ( గ.న )
Paroxysmal nocturnal hemoglobinuria ( PNH ) = సంవిరామ నిశా రక్త ( వర్ణక ) మూత్రము ( గ.న )
Pericarditis = హృత్కోశ తాపము ( గ.న )
Platelets = రక్త ఫలకములు ( గ.న )
Pleural diseases = పుపుసవేష్టన వ్యాధులు 
Popliteal vein = జాను సిర ( గ.న )
Posterior tibial vein = పృష్ఠజంఘిక సిర ( గ.న )
Primary hemostasis  = ప్రాథమిక రక్త స్థిరత్వము ( గ.న )
Pulmonary arteries = పుపుస ధమనులు
Pulmonary arterial embolism = పుపుసధమని  ( రక్తప్రసరణ ) అవరోధకము ( గ.న )
Saphenous orifice  = దృశ్యసిర రంధ్రము ( గ.న )
Secondary hemostasis  = ద్వితీయ రక్త స్థిరత్వము ( గ.న )
Superficial thrombophlebitis  = బాహ్యసిరతాప రక్తఘనీభవనము ( గ.న )
Superficial veins = బాహ్య సిరలు ( గ.న )
Thrombolytic therapy = రక్తపుగడ్డల విచ్ఛేదన చికిత్స ( గ.న )
Ultrasonography = శ్రవణాతీత ధ్వని పరీక్ష ( గ.న )
ventilation defects = శ్వాస లోపములు ( గ.న )

ఉబ్బస ( Bronchial asthma )

Alveoli = పుపుస గోళములు ( గ.న ) ; వాయు గోళములు 
Alveolar ducts = పుపుస గోళనాళికలు ( గ.న )
Smooth muscle = మృదు కండరము (గ.న )
 Allergens = అసహన పదార్థములు ( గ.న )
 receptor blockers = గ్రాహక అవరోధకములు ( గ.న )
 anti inflammatory agents = తాపక నివారణులు ( గ.న )
 Peak flow = గరిష్ఠ వాయు ప్రవాహము (గ.న )
 forced inspiration = సుదీర్ఘ సంపూర్ణ ఉచ్ఛ్వాసము ( గ.న )
forced expiration = సత్వర సుదీర్ఘ నిశ్వాసము (గ.న )
Obstructive lung diseases = అవరోధక పుపుస వ్యాధులు ( గ.న )
Restrictive lung diseases = నిర్బంధ పుపుస వ్యాధులు ( గ.న )
 Forced Expiratory Volume- 1= బలనిశ్వాస వాయుపరిమాణము-1 ( మొదటి సెకండులో బలముగా వదల గలిగే గాలి పరిమాణము - గ.న )
 Peak flow meter = గరిష్ఠ ( శ్వాస ) ప్రవాహ మానిక ( గ.న )
 Inhaler = పీల్పువు ( గ.న )
  Obstructive sleep apnea = నిద్ర అవరోధక శ్వాసభంగము ( గ.న )

దీర్ఘకాలిక శ్వాసావరోధ వ్యాధి ( Chronic Obstructive Pulmonary Disease )    

Chronic obstructive pulmonary disease = దీర్ఘకాలిక శ్వాసావరోధ వ్యాధి ( గ.న ) 
Alveolus = పుపుస గోళము
Alveolar ducts = పుపుస గోళనాళికలు
Trachea = శ్వాస నాళము
Bronchi  = పుపుస నాళములు ( గ.న )
Bronchiole = పుపుస నాళిక
Bronchitis =  శ్వాసనాళికల తాపము 
Emphysema = ఊపిరితిత్తుల ఉబ్బు ( గ.న ) ; ఊపిరితిత్తుల వ్యాకోచము ( గ.న )
Proteinases = మాంసకృత్తు విచ్ఛేదనములు ( గ.న )
Apoptosis =  కణజాల సహజమృతి ( గ.న )
viruses = విషజీవాంశములు ( గ.న )
Pulmonary function tests = శ్వాస వ్యాపార పరీక్షలు (గ.న )
Spirometer = శ్వాస మాపకము ( గ.న )
Forced Vital Capacity = ( సంపూర్ణ ) శ్వాస ప్రమాణము ( గ.న )
Restrictive lung disease = నిర్బంధ పుపుస వ్యాధి ( గ.న )
bronchodilator treatment  = శ్వాస నాళికా వ్యాకోచ చికిత్స ( గ.న )
bronchodilators = శ్వాస నాళికా వ్యాకోచకములు ( గ.న )
Respiratory failure = శ్వాస వైఫల్యము ( గ.న )
Arterial Blood Gases = ధమనీ రక్తవాయువులు ( గ.న )
nebulizer = శీకర యంత్రము ( గ.న )
oxygen saturation = ప్రాణవాయువు సంపృక్తత ( గ.న )
Pulmonary Fibrosis  = పుపుస తంతీకరణము (గ.న )


జీర్ణ వ్రణములు ( Peptic ulcers )

Pylorus = జఠర అధో ద్వారము
 Duodenum = ప్రథమాంత్రము 
 Jejunum = మధ్యాంత్రము 
 Ileum = శేషాంత్రము 
 Hydrolysis =  జల విచ్ఛేదన 
 Antrum = అంతిమ కుహరము 
  Mucosa = శ్లేష్మపు పొర 
 Hydrochloric acid = ఉదజ హరికామ్లము 
 Peptic ulcers = జీర్ణ వ్రణములు ( గ.న )
 Anastomotic ulcers = సంధాన వ్రణములు ( గ.న )
Cancers = కర్కట వ్రణములు ( గ.న )
 Pyloric stenosis = జఠర నిర్గమ బంధము ( గ.న )
 Esophagogastroduodenoscopy = జఠరాంత్రదర్శనము ( గ.న )
 Antacids = ఆమ్ల హరములు 
 proton pump inhibitors = ప్రోటాను యంత్ర అవరోధకములు ( గ.న ) ; ఆమ్లయంత్ర నిరోధకములు ( గ.న )
 Histamine -2 receptor blockers = హిస్టమిన్ - 2 గ్రాహక అవరోధకములు ( గ.న )
Gastro-Jejunostomy = జఠరాంత్ర సంధానము ( గ.న )
 Partial gastrectomy = పాక్షిక జఠర విచ్ఛేదన ( గ.న )
 electric cauterization = విద్యుద్దహనీకరణము ( గ.న )
Antibiotics = సూక్ష్మజీవ నాశకములు ( గ.న )

నారంగ కాలేయ వ్యాధి ( Cirrhosis of Liver )

abdominal cavity = ఉదరకుహరము 
antibodies = ప్రతిరక్షకములు
antigens = ప్రతిజనకములు 
Ascites = జలోదరము 
autoimmune disease = స్వయంప్రహరణ వ్యాధి ( గ.న )
cancers = కర్కట వ్రణములు ( గ.న )
Caput medusa = ఉదరకుడ్యములో ఉబ్బు సిరలు ( గ.న )
cirrhosis = నారంగ కాలేయవ్యాధి ( గ.న )
clotting factors  = రక్త ఘనీభవన అంశములు ( గ.న )
clubbing of fingers = డోలుకఱ్ఱల వేళ్ళు  ( గ.న )
echogenesis = ప్రతిధ్వనిత్వముు ( గ.న )
enzyme = జీవోత్ప్రేరకము ( గ.న )
esophageal varices = అన్నవాహికలో ( అన్ననాళములో ) ఉబ్బుసిరలు ( గ.న )
Esophago gastroduodenoscopy = జఠరాంత్ర దర్శనము ( గ.న )
fibroblasts = తంతుకణములు ; పీచుకణములు ( గ.న )
fibrosis = తంతీకరణము
hematemesis = రక్తవమనము 
Hemochromatosis =  అయ ( ఇనుము ) వర్ణకవ్యాధి ( గ.న )
Hepatic elastography = కాలేయ స్థితిస్థాపకత చిత్రీకరణ ( గ.న )
hepatic encephalopathy = కాలేయ మతిభ్రంశము ( గ.న )
hepatic vein = కాలేయసిర 
hepatitis = కాలేయ తాపము ( గ.న )
Hepatorenal syndrome  = కాలేయ మూత్రాంగవైఫల్యము ( గ.న )
hypersplenism  = ప్లీహ ఉద్రేకము ( ప్లీహోద్రేకము ) ; ప్లీహాతిశయము ( గ.న )
Indian childhood cirrhosis = భారతీయశిశు నారంగ కాలేయవ్యాధి ( గ.న )
Influenza = వ్యాపక జ్వరము ( గ.న )
laparoscopy = ఉదర దర్శనము ( గ.న )
Liver transplantation = పరకాలేయ దానము ( గ.న )
melena = నల్ల విరేచనములు ( జీర్ణమండలములో రక్తస్రావము జరిగి రక్తము నల్లరంగుని పొందుట వలన కలుగుతాయి ) ( గ.న )
nonalcoholic steatohepatitis = మద్యేతర వస కాలేయతాపము ( గ. న )
palmar aponeurosis ( fascia ) = అరచేతి  కండర ఆచ్ఛాదనము ( గ.న )
parotid salivary gland = శ్రవణమూల లాలాజలగ్రంథి ( గ.న )
Peritonitis = ఉదర ( ఆంత్ర ) వేష్టన తాపము  ( గ.న )
platelets = రక్తఫలకములు ( గ.న )
pneumonitis = శ్వాసకోశ తాపము ( గ.న )
Primary biliary cirrhosis = ప్రాథమిక పైత్య నారంగవ్యాధి ( గ.న )
portal vein = ద్వారసిర ( గ.న )
Porto hepatic shunt =   ద్వారసిర - కాలేయసిరల సంధానము ( గ.న )
sclerosant agents = తంతీకరణ రసాయనములను 
splenomegaly = ఉరుప్లీహము ( గ.న )
steatohepatitis = వస తాపము ( గ.న )
liver transplantation = పరకాలేయ దానము ( గ.న )
ultrasonography = శ్రవణాతీతధ్వని చిత్రీకరణము ( గ.న )
Viruses = విషజీవాంశములు ( గ.న )
Wilson’s disease ( of liver )= తామ్ర కాలేయవ్యాధి ( గ.న )

                      పచ్చ కామెరలు ( Jaundice )

Antibodies = ప్రతిరక్షకములు
Autoimmune diseases = స్వయంప్రహరణ వ్యాధులు ( గ.న )
Bile = పైత్య రసము
Bile ducts = పైత్య నాళములు
Biopsies = కణ పరీక్షలు ( గ.న )
Blood transfusion = పర రక్తదానము ( గ.న )
Bone marrow  = ఎముకల మజ్జ
Cancers = కర్కట వ్రణములు ( గ.న )
Cirrhosis of liver = నారంగ కాలేయ వ్యాధి ( గ.న )
Conjugated Bilirubin = సంయోగపు బిలిరుబిన్ ( గ.న )
Direct Bilirubin = పత్యక్ష  బిలిరుబిన్ ( గ.న )
Endoscopic examinations = అంతర్దర్శన పరీక్షలు ( గ.న )
Fecal-oral route = పురీష వదన మార్గము ( గ.న )
Liver enzymes = కాలేయ జీవోత్ప్రేరకములు ( గ.న )
Hemolytic /Prehepatic jaundice = రక్తకణ విచ్ఛేదనపు / కాలేయ పూర్వపు కామెరలు ( గ.న )
Hepatic / Hepatocellular jaundice = కాలేయపు కామెరలు ( గ.న )
Hepatitis = కాలేయ తాపము ( గ.న )
Hereditary Spherocytosis = వంశపారంపర్య గోళాకార కణవ్యాధి (గ.న )
Indirect Bilirubin = పరోక్ష బిలిరుబిన్  ( గ.న )
Immunological system = శరీర రక్షణ వ్యవస్థ ( గ.న )
Jaundice = పచ్చకామెర్లు , కామెర్లు , పసరికలు  
Liver = కాలేయము 
Obstructive jaundice / Post hepatic Jaundice = అవరోధపు కామెరలు / కాలేయానంతరపు కామెరలు ( గ.న )
Oxidation = ఆమ్లజనీకరణము
Parasites = పరాన్నభుక్తులు
Parenteral routes = ఆంత్రేతర మార్గములు ( గ.న )
Phagocytes = భక్షక కణములు
Sclera = శ్వేతపటలము 
Sickle cell anemia = లవిత్రకణ వ్యాధి ( గ.న )
Spleen = ప్లీహము
Supportive treatment = ఆలంబన చికిత్స ( గ.న )
Ultrasonogram = శ్రవణాతీత శబ్ద చిత్రీకరణ ( గ.న ) ; శ్రవణాతీత ధ్వని చిత్రీకరణము ( గ.న )
Viruses = విషజీవాంశములు ( గ.న )
Water solubility = జల ద్రావణీయత ( గ.న )

మద్యపాన వ్యసనము

Yeast = మధు శిలీంధ్రము
Distillation = బట్టీపట్టుట
Alcoholic Steatosis = సుర కాలేయ వసవ్యాధి ( గ.న )
Fatty acids = వసామ్లములు
Alcoholic hepatitis = సుర కాలేయ తాపము ( గ.న )
Cirrhosis of liver = నారంగ కాలేయ వ్యాధి ( గ.న )
Fibrosis = తంతీకరణము
Ascites =  జలోదరము
Gastritis = జఠర తాపము , జీర్ణాశయ తాపము (గ.న )
Peptic ulcer = జీర్ణ వ్రణము ( గ.న )
Pancreatitis = క్లోమ తాపము ( గ.న )
Atherosclerosis =  ధమనీ కాఠిన్యత
Coronary arteries = హృద్ధమనులు
Ataxia = అస్థిర గమనము 
Mental Depression =   మానసికపు క్రుంగు ; మానసికపు కుంగు ( గ.న )
Delirium = స్మృతిభ్రంశము
Alcohol withdrawal = మద్య పరిత్యజనము ; మద్య వర్జనము ( గ.న )
Detoxification = విషహరణము
Cognitive behavioral therapy = స్మృతివర్తన చికిత్స ( గ.న )
Enzyme = జీవోత్ప్రేరకము  ( గ.న )

మూత్రాంగములు ( Kidneys )

Kidneys = మూత్రాంగములు   ( గ.న )
Nephrons = మూత్రాంకములు  ( గ.న )
Renal Corpuscles = మూత్ర ముకుళములు ( గ.న )
Renal Tubules = మూత్ర నాళికలు  ( గ.న )
Collecting ducts = సమీకరణ నాళములు  ( గ.న ) 
Renal Pelvis = మూత్ర కుండిక ( గ.న ); మూత్ర పాళియ   ( గ.న ) 
Ureters = మూత్ర నాళములు 
Urinary bladder = మూత్రాశయము 
Urethra = మూత్ర ద్వారము 
Sphincter = నియంత్రణ కండరము ( గ.న )
Renal arteries = మూత్రాంగ ధమనులు   ( గ.న )
Renal veins = మూత్రాంగ సిరలు Renal veins ( గ.న )
Afferent arteriole = ప్రవేశ ధమని  ( గ.న )
Efferent arteriole = నిష్క్రమణ ధమని  ( గ.న )
Cortex = బాహ్య భాగము  ( గ.న )
Medulla = అంతర్భాగము  గ.న )
Descending loop = దిగు మెలిక (  గ.న )
Ascending loop =ఎగు మెలిక (గ.న )
Vasa recta = సరళ ధమని ( గ.న )

     సత్వర మూత్రాంగ విఘాతము

Acute Kidney Injury = సత్వర మూత్రాంగ విఘాతము 
Cirrhosis of Liver = నారంగ కాలేయవ్యాధి ( గ.న )
Sepsis = సూక్ష్మజీవ విషమయము ( గ.న )
Nephrotoxins  = మూత్రాంగ విషములు ( గ.న )
Atheromas = ధమనీ ఫలకములు ( గ.న )
Rhabdomyolysis = అస్థి కండరకణ విచ్ఛేదనము ( గ.న )
Nephrons = మూత్రాంకములు ( గ.న )
Dehydration = ఆర్ద్ర క్షీణత ( గ.న )
Rashe = విస్ఫోటనము
Casts = మూసలు
Electrolytes = విద్యుద్వాహక లవణములు 
Hydronephrosis = జల మూత్రాంగము ( గ.న )
Anti inflammatory agents = తాప హరములు ( గ.న )
Hypovolemia = ద్రవపరిమాణ హీనత ( గ.న )
Fluid overload = ద్రవ భారము ( గ.న )
Diuretics = మూత్ర ప్రేరకములు ( గ.న )

దీర్ఘకాల మూత్రాంగవ్యాధి ( Chronic Kidney Disease )

 Anti Inflammatory Drugs =  తాప హరణములు ( గ.న )
 Beta adrenergic receptor agonists = బీటా ఎడ్రినెర్జిక్ గ్రాహక ఉత్తేజకములు ( గ.న )
 Cation echange resins = ఋణపరమాణు వినిమయ ఔషధములు ( గ.న )
 Diuretics  = మూత్ర ప్రేరకములు ( గ.న ) ; మూత్రకారకములు
 Echogenicity = ప్రతిధ్వనిత్వము ( గ.న )
 Hemodialysis = రక్తశుద్ధి
 Hydronephrosis = జల మూత్రాంగము ( గ.న )
 Hypovolemia =రక్తప్రమాణ హీనత ( గ.న )
Glomerular diseases =  ( మూత్రాంగ ) కేశనాళికా గుచ్ఛవ్యాధులు ( గ.న )
Glomerular filtration rate =  కేశనాళికా గుచ్ఛముల వడపోత ప్రమాణము ( గ.న )
Metabolic acidosis = జీవ వ్యాపార ఆమ్లీకృతము ( గ.న )
Osteitis fibrosa cystica = తంతుకణజాల బుద్బుద అస్థి వ్యాధి ( గ.న )
 Peritoneal dialysis = ఉదర వేష్టన రక్తశుద్ధి ( గ.న )
Polycystic kidney disease = బహుళ బుద్బుద మూత్రాంగ వ్యాధి ( గ.న )
Renal replacement therapy = మూత్రాంగ ప్రత్యామ్నాయ చికిత్స ( గ.న )
Renal transplantation = పర మూత్రాంగ దానము ( గ.న )
Respiratory acidosis = శ్వాస వ్యాపార ఆమ్లీకృతము ( గ.న )
Ultrasonography = శ్రవణాతీత ధ్వనిచిత్రీకరణ ( గ.న )
Ureteric calculi = మూత్రనాళ శిలలు ( గ.న )
Urinary bladder stones = మూత్రాశయ శిలలు ( గ.న )
Renal Calculus = మూత్రాంగ శిల ( గ.న )

మస్తిష్క రక్తనాళ విఘాతములు ( Cerebro vascular accidents  )

Aneurysms = ధమనులలో బుడగలు ; ధమనీ బుద్బుదములు ( గ.న )
Anterior cerebral artery = పురోమస్తిష్క ధమని ( గ.న )
Anterior communicating artery = పురో సంధాన ధమని (గ.న )
Anticoagulants = రక్తఘనీభవన అవరోధకములు ( గ.న )
Aphasia = మాట పోవుట  ; వాజ్ఞ్నష్టము ; ( గ.న ) వాగ్నష్టము ( గ.న )
Arterial malformations = ధమనీ వైకల్యములు ( గ.న )
Ataxia = దేహ అస్థిరత ( గ.న )
Atherosclerosis = ధమనీ కాఠిన్యము 
Atrial fibrillation = కర్ణికా ప్రకంపనము ( గ.న )
Axons = అక్షతంతులు 
Auditory cortex = శ్రవణ వల్కలము ( గ.న )
Brain stem = మస్తిష్కమూలము
Carotid artery stenosis = కంఠ ధమని సంకుచితము ( గ.న )
Catheter = కృత్రిమ నాళము ( శరీరములోనికి దూర్చు నాళము )
Central nervous system = కేంద్ర నాడీమండలము 
Central sulcus = మధ్య గర్తము ( గ.న )
Cerebellum  = చిన్నమెదడు 
Cerebrovascular accidents = మస్తిష్క ( రక్తనాళ ) విఘాతములు ( గ.న )
Cerebral angiogram = మస్తిష్క ధమనీ చిత్రీకరణ ( గ.న )
Cerebrum  = పెద్దమెదడు  
Computerized Axial Tomography = గణనయంత్ర త్రిదిశ ( త్రిమితీయ ) చిత్రీకరణము ( గ.న )
Cranial nerves  = కపాల నాడులు 
Diastolic pressure = వికాస పీడనము ( గ.న )
Diplopia = ద్విదృష్టి ( గ.న )
Dysarthria = పలుకు తొట్రుపాటు ( గ.న )
Echocardiogram = హృదయ  ప్రతిధ్వని చిత్రీకరణము ( గ.న )
Electrocardiograph = విద్యుత్ హృల్లేఖ 
Endocarditis  = హృదయాంతర తాపము ( గ.న )
External carotid artery = బాహ్య కంఠ ధమని ( గ.న )
Frontal lobe = ( మస్తిష్క ) లలాట భాగము ( గ.న )
Internal capsule = ఆంతర గుళిక ( గ.న )
Internal carotid artery = అంతర కంఠ ధమని (గ.న )
Intracranial pressure = కపాలాంతర పీడనము ( గ.న )
Intraparenchymal hemorrhage = ( మస్తిష్క ) కణజాలాంతర రక్తస్రావము  ( గ.న )
Hemianopsia = అర్ధాంధత్వము ( గ.న )
Hemorrhage = రక్తస్రావము 
Hydrocephalus = జలశీర్షము , జలశిరస్సు ( గ.న )
Lateral sulcus = పార్శ్వగర్తము ( గ.న )
Lower motor neurons   = అధశ్చలన నాడీకణములు ( గ.న )
Magnetic Resonance Imaging  = అయస్కాంత ప్రతిధ్వని చిత్రీకరణము ( గ.న )
Magnetic Resonance Angiogram = అయస్కాంత ప్రతిధ్వని రక్తనాళ చిత్రీకరణము ( గ.న )
Murmurs = మర్మర శబ్దములు ( గ.న )
Nasogastric tube = నాసికా జఠర నాళము ( గ.న )
Nervous system = నాడీమండలము
Neurons = నాడీ కణములు
Middle cerebral artery = మధ్య మస్తిష్క ధమని ( గ.న )
Motor cortex = చలన వల్కలము ( గ.న )
Occipital lobe = ( మస్తిష్క ) పృష్ఠ భాగము ( గ.న )
Occupational therapy = వృత్తి చికిత్స  
Oxygen saturation = ప్రాణవాయువు సంతృప్తత ( గ.న )
Papilloedema  = కనుబింబపు పొంగు ( గ.న )
Paralysis = పక్షవాతము
Parietal lobe = ( మస్తిష్క ) పార్శ్వభాగము ( గ.న )
ParaSympathetic nervous system = పరానుభూత నాడీ వ్యవస్థ
Peripheral nervous system = వికేంద్ర నాడీమండలము 
Physical therapy = వ్యాయామ చికిత్స ( గ.న )
Pons =  మస్తిష్క వారధి ( గ.న )
Posterior cerebral artery = పృష్ఠ మస్తిష్క ధమని ( గ.న )
Posterior communicating artery = పృష్ఠ సంధాన ధమని ( గ.న )
Platelets = రక్తఫలకములు ( గ.న )
Sensory cortex = జ్ఞాన వల్కలము ( గ.న )
Sensory loss = స్పర్శ నష్టము  ( గ.న )
Septal defects = విభాజక లోపములు ( గ.న )
Spinal cord = వెన్నుపాము 
Spinal nerves = వెన్ను నాడులు    
Speech therapy =  వాగ్చికిత్స ( గ.న ) వాజ్ఞ్చికిత్స ( గ.న ) మాట కఱపు ( గ.న )
Sympathetic nervous system = సహవేదన నాడీవ్యవస్థ 
Systolic pressure = ముకుళిత పీడనము ( గ.న )
Temporal lobe = ( మస్తిష్క ) కర్ణ భాగము ( గ.న )
Thrombolytics = రక్తఖండ విచ్ఛేదనములు ( గ.న )
Valvular stenosis = కవాట సంకోచము ( గ.న )
Vertebral arteries = వెన్ను ధమనులు ( గ.న )
Visual cortex = దృష్టి వల్కలము ( గ.న )
Voluntary muscles = ఇచ్ఛా కండరములు
Upper motor neurons = ఊర్ధ్వ చలన నాడీకణములు ( గ.న )

ముఖ పక్షవాతము  ( Facial nerve palsy  )

Facial Paralysis = ముఖ పక్షవాతము ( గ.న )
Facial muscles = ముఖ కండరములు
Facial nerve = ముఖ నాడి
Pons = నాడీసేతువు ( గ.న ) నాడీ వారధి ( గ.న )
Internal auditory meatus =  అంతర శ్రవణరంధ్రము ( గ.న )
Facial ( nerve ) canal = ముఖనాడి అస్థినాళము ( గ.న )
Parotid salivary gland = శ్రవణమూల లాలాజలగ్రంధి ( గ.న )
Occipito-frontalis muscle = పృష్టశిర లలాట కండరము ( గ.న )
Orbicularis Oculi = నేత్రమండలిక కండరములు (గ.న )
Corrugator Supecilli = భృకుటి కండరము ( గ.న )
Deprressor anguli  Oris = వక్త్రకోణ నిమ్న కండరము ( గ.న )
Levator Labii Superioris = అధర ఉద్ధరణ కండరము ; ఊర్ధ్వ అధరోద్ధరణ కండరము ( గ.న )
Buccinator = బుగ్గ కండరము ; కపోలిక ( గ.న )
Mentalis = చిబుక కండరము ( గ.న )
Neuromuscular junction. = నాడీతంతు కండర సంధానము ( గ..న )
meningitis = నాడీమండల ( మస్తిష్క )  వేష్టన తాపవ్యాధి (గ.న )
Cerebro vascular accidents  = మస్తిష్క రక్తనాళ విఘాతములు ( గ.న )
motor cortex  =. చలన వల్కలము ( గ.న )
Upper motor neuron paralysis = ఊర్ధ్వ చలననాడీ పక్షవాతము ( గ.న )
Lower motor neuron paralysis = అధశ్చలన నాడీ పక్షవాతము ( గ.న )
Herpes Zoster = మేఖల విసర్పణిక (గ.న )
Nasolabial fold = నాసికాధర వళి ( గ.న )
Electromyography = విద్యుత్ కండరలేఖనము ( గ.న )
Computerised Axial Tomography = గణనయంత్ర త్రిదిశ చిత్రీకరణము ( గ.న )/ గణనయంత్ర త్రిమితీయ చిత్రీకరణము ( గ.న )
Magnetic Resonance Imaging = అయస్కాంత ప్రతిధ్వని చిత్రీకరణము ( గ.న )
Eye patch = కనుకప్పు ( గ.న )
Superior Salivary gland nucleus = ఊర్ధ్వ లాలాజల కేంద్రము ( గ.న )
Viruses = విషజీవాంశములు ( గ.న )

మానసికస్థితి వైపరీత్యములు 

Bipolar disorder = ద్విధ్రువ వ్యాధి ( గ.న )
Cognitive behavioral therapy = స్మృతివర్తన చికిత్స ( గ.న )
Depression = మానసికపు దిగులు
Electro convulsive therapy = విద్యుత్ ప్రేరణ మూర్ఛ చికిత్స ( గ.న )
Major depression = పెను దిగులు ( గ.న )
Minor depression = చిన్న కుంగు ; చిన్న దిగులు ( గ.న )
Mania = ఉన్మాదపు పొంగు ( గ.న )
Mood disorders = మానసికస్థితి వైపరీత్యములు ( గ.న )
Paranoid behavior = సంశయ ప్రవర్తన ( గ.న )
psychomotor retardation =  మానసిక చలన మాంద్యము ( గ.న )

కర్కట వ్రణములు ( Cancers )

Biopsy  = కణ పరీక్ష ( గ.న )
Cancers = కర్కట వ్రణములు ( గ.న )
Carcinogens = కర్కట వ్రణ జనకములు ( గ.న)
Chemotherapy = రసాయన ( ఔషధ ) చికిత్స
Colonoscopy = బృహదాంత్ర ( పెద్దప్రేవుల ) అంతర్దర్శనము (గ.న )
Electro cauterization = విద్యుద్దహన చికిత్స ( గ.న )
Genes = జన్యువులు 
Genetic mutations = జన్యువుల మార్పులు 
Immunotherapy = ప్రతిరక్షిత చికిత్స ( గ.న )
Mammogram = స్తన చిత్రీకరణము ( గ.న )
Palliative care = ఉపశమన చికిత్స
Radiation therapy  =  వికిరణ చికిత్స ( గ.న )
Screening tests = శోధన పరీక్షలు ( గ.న )

పాండు రోగము ( Anemia )

Blood transfusion = పర రక్తదానము ( గ.న )
 Platelets  = ( రక్త ) సూక్ష్మఫలకములు   ( గ.న )
 Hormones = వినాళ గ్రంథుల రసములు 
 Oxygen carrying capacity = ప్రాణవాయువు వాహక సామర్థ్యత ( గ.న )
 Reticulocytes = జాలిక కణములు ( గ.న )
Macrocytes = పృథుకణములు
Macrocytosis = పృథు కణత్వము ( గ.న )
Microcyte = లఘుకణము
 Microcytosis = లఘు కణత్వము ( గ.న )
 Normocytosis = సామాన్య కణత్వము ( గ.న )
Centrifuge = వికేంద్రీకర యంత్రము ( గ.న )
 Plasma = రక్తద్రవము ( గ.న )
 Hematocrit =  రక్త (కణ ) సాంద్రత ( గ.న )
Erythropoietin = రక్తోత్పాదిని ( గ.న )
 Hemolysis = రక్తకణ విచ్ఛేదనము ( గ.న )
 Esophageal varices = అన్నవాహిక ఉబ్బుసిరలు ( గ.న )
Varicose veins = ఉబ్బు సిరలు ( గ.న )
 Gastroscopy = జఠరాంతర దర్శనము, ( గ.న )
 Gastroscope = జఠరాంతర దర్శిని ( గ.న )
 Colonoscopy = ఆంత్రాంతర దర్శనము ( గ.న )
 Colonoscope = ఆంత్రాంతర దర్శిని ( గ.న )
 Pernicious anaemia = ప్రమాదకర రక్తహీనత ( గ.న )
 Extrinsic factor = బాహ్యాంశము ( విటమిన్ B12 ) గ.న 
 Intrinsic factor = అంతరాంశము ( గ.న )
 Gastric atrophy = జఠర క్షయము ( గ.న )
 Autoimmune disorder = స్వయంప్రహరణ ( పరిరక్షణ ) వ్యాధి ( గ.న )
Peripheral neuritis = దూరనాడుల తాపము ( గ.న )
 Hemolytic anaemias = రక్తవిచ్ఛేదన రక్తహీనము ( గ.న )
 Sickle cell anemia = లవిత్రకణ రక్తహీనత ( గ.న )
 Sickle cell disease = లవిత్రకణ వ్యాధి ( గ.న )
 Hereditary Spherocytosis = వంశపారంపర్య గోళకణ వ్యాధి ( గ.న ) ; వంశపారంపర్య గోళాకార కణ వ్యాధి ( గ.న )

గుల్ల ఎముకల వ్యాధి ( అస్థిసాంద్ర క్షీణత ; Osteoporosis )

 Antacids = ఆమ్ల విరోధములు ; ఆమ్ల హరములు
Anticonvulsants = మూర్ఛ నివారిణులు ( గ.న )
Bone formation  = ఎముకల నిర్మాణ ప్రక్రియ ( గ.న )
Bone Mineral Densitometry = అస్థిసాంద్రత చిత్రీకరణము ( గ.న )
Bone resorption = ఎముకల శిథిలత ( గ.న )
Cancers = కర్కట వ్రణములు ( గ.న )
Chronic renal failure = దీర్ఘకాల మూత్రాంగ వైఫల్యము ( గ.న )
Compression fractures = సంపీడన అస్థి భంగములు ( గ.న )
Connective tissue disorders = సంధాన కణజాల వ్యాధులు ( గ.న )
Connective tissue protein = సంధానపు మాంసకృత్తి ( గ.న )
Electrolytes = విద్యుద్వాహక లవణములు
Endocrine disorders = వినాళగ్రంథి వ్యాధులు 
Esophagitis  = అన్నవాహిక తాపము ( గ.న )
Fractures of bones = అస్థి భంగములు 
Gastrectomy = జఠర ఖండనము ( గ.న )
Gastrointestinal disorders = జీర్ణమండల వ్యాధులు 
Growth hormone  = ప్రవర్ధన స్రావకము ( గ.న )
Genetic disorders = జన్యు వ్యాధులు 
Hips = తుంటి ఎముకలు
Kyphosis = గూని 
Hematopoietic disorders = రక్తోత్పాదన వ్యాధులు ( గ.న )
Hyperparathyroidism = సహగళగ్రంథి ఆధిక్యత ( గ.న )
Hyperthyroidism = గళగ్రంథి ఆధిక్యత 
Hypogonadism = బీజగ్రంథుల హీనత 
Liver function tests = కాలేయవ్యాపార పరీక్షలు
Matrix = మాతృక 
Monoclonal antibody = ఏకరూపక ప్రతిరక్షకము ( గ.న )
Osteoblasts  = అస్థినిర్మాణ కణములు ( గ.న )
Osteoclasts = అస్థిశిథిల కణములు ( గ.న )
Osteopenia  = ఎముకల బలహీనత (గ.న )
Osteoporosis = గుల్ల ఎముకలవ్యాధి ; అస్థి సాంద్ర క్షీణత ( గ.న )
Parathyroid glands  = సహగళ గ్రంథులు ( గ.న )
Parathyroid hormone = సహగళగ్రంథి స్రావకము ( గ.న )
Peak bone mass = గరిష్ఠ అస్థిరాశి ( గ.న )
Proton pump inhibitors = ప్రోటాను యంత్ర అవరోధకములు ( గ.న ) ; ఆమ్లయంత్ర అవరోధకములు ( గ.న )
Renal disorders = మూత్రాంగ వ్యాధులు ( గ.న )
Standard deviation = ప్రమాణ వ్యత్యాసము (గ.న )
Sickle cell disease = లవిత్రకణ వ్యాధి ( గ.న )
Scoliosis = పక్క వంకరలు 
Spine = వెన్నెముక 
Thyroid function tests = గళగ్రంథి వ్యాపార పరీక్షలు ( గ.న )

ఉష్ణసంబంధ రుగ్మతలు  (Heat related illnesses )

Ataxia = శరీర అస్థిరత ( గ.న )
Cardiac output = హృదయ ప్రసరణ ( రక్త ) ప్రమాణము ( గ.న )
Circulating blood volume = దేహ ప్రసరణ రక్తప్రమాణము (గ.న )
Conduction = వహనము 
Contractility = సంకోచము 
Convection = సంవహనము
Core body temperature = శరీరాంతర ఉష్ణోగ్రత ( గ.న )
Dehydration = శోషణము
Diuretics = మూత్రకారకములు
Disseminated intravascular coagulation = విస్తృత రక్తనాళాంతర రక్తఘనీభవనము ( గ.న )
Endotoxins = అంతర జీవవిషములు ( గ.న )
Enzymes = జీవోత్ప్రేరకములు ( గ.న )
Heat edema = వడ పొంగు ( గ.న )
Heat exhaustion = వడ బడలిక ( గ.న )
Heat rash = చెమట కాయలు ; చెమట పొక్కులు ; ఉష్ణ విస్ఫోటనము ( గ.న )
Hyperthermia = తీవ్ర జ్వరము ( గ.న )
Heat stroke = ఉష్ణ ఘాతము ( గ.న ) ; వడదెబ్బ
Heat syncope =  వడ సొమ్మ ( గ.న )
Hypovolemia = రక్తప్రమాణ హీనత 
Metabolism = శరీర వ్యాపకము ; జీవ వ్యాపారము ( గ.న )
Peripheral vasodilation = దూర రక్తనాళ వ్యాకోచము ( గ.న )
Postural hypotension = స్థితి సంబంధ అల్ప ( రక్త )పీడనము ; స్థితి జనిత అల్పరక్తపీడనము ( గ.న )
Radiation = వికిరణము 
Rhabdomyolysis = అస్థికండర కణ విధ్వంసము ( గ.న )
Viscera = ఉదరాంతర అవయవములు ( గ.న )

ఎక్కువ బరువు ; స్థూలకాయము ( Overweight ; Obesity )

Acid Reflux = ఆమ్ల తిరోగమనము ( గ.న )
Body Mass Index  BMI = భార సూచిక ( గ.న )
Cancers = కర్కట వ్రణములు ( గ.న )
Cerebro vascular accidents = మస్తిష్క విఘాతములు ( గ.న )
Coronary artery disease = హృద్ధమనుల వ్యాధులు 
Endoscope = అంతర్దర్శిని ( గ.న )
Energy rich foods = శక్తిసాంద్ర ఆహారములు ( గ.న )
Fatty Liver disease = కాలేయపు కొవ్వు ( వస ) వ్యాధి ( గ.న )
Gastric Balloon = కడుపు బుడగ ( గ.న ) ; జఠర బుద్బుదము ( గ.న )
Gastric Banding = జఠర బంధన చికిత్స  ( గ.న )
Gastric Resection = జఠర ఛేదనము ( గ.న )
Gastro jejunal anastomoses = జఠరాంత్ర సంధానము ( గ.న )
High density lipoproteins = అధికసాంద్రపు కొలెష్టరాలు  ( గ.న )
Laparoscopy = ఉదరాంతర దర్శనము ( గ.న )
Low density lipoproteins = అల్పసాంద్రపు కొలెష్టరాలు ( గ.న )
Metabolism = జీవవ్యాపారము 
Obesity = స్థూలకాయము
Obstructive Sleep Apnea = నిద్రావరోధ శ్వాసభంగములు ( గ.న )
Over weight = అధిక భారము ( గ.న )
Under weight = భార హీనత ( గ.న )

దేహరక్షణ వ్యవస్థ  ( Immune system )

Immune system =  దేహ రక్షణ వ్యవస్థ ( గ.న )
Viruses =  విషజీవాంశములు ( గ.న )
Toxins =  జీవ విషములు 
Glycoproteins =  శర్కర మాంసకృత్తులు ( గ.న )
Mucosa =  శ్లేష్మపు పొర
Pathogens =  వ్యాధి కారకములు , రోగ జనకములు ; వ్యాధి జనకములు ( గ.న )
Enzymes =  జీవోత్ప్రేరకములు ( గ.న )  ( జీవ + ఉత్ప్రేరకము ( Catalyst ) ( గ.న )
Pluripotent stem cells = బహుళ సామర్థ్య మూలకణములు ( గ.న )
Stem cells = మూల కణములు ( గ.న )
Thyroid = గళగ్రంథి 
Auto immune diseases = స్వయంప్రహరణ వ్యాధులు ( గ.న )
Antigen = ప్రతిజనకము
Antibody = ప్రతిరక్షకము
Lymphocytes = రసి కణములు ( గ.న )
Platelets = రక్త ఫలకములు ( గ.న )
Plasma= రక్త ద్రవము ( గ.న )
Plasma cells = స్రావక కణములు ( గ.న )
Granulocytes = కణికల కణములు ( గ.న )
Non granulocytes = కణికరహిత కణములు ( గ.న )
Acidophils , Eosinophils = ఆమ్లాకర్షణ కణములు ( గ.న )
Basophils = క్షారాకర్షణ కణములు ( గ.న )
Neutrophils = తటస్థ కణములు ( గ.న )
Monocytes = ఏక కణములు ( గ.న )
Allergy = అసహనము ( గ.న )
Phagocytes = భక్షక కణములు
Mast cells , mastocytes = స్తంభ కణములు ( గ.న )
Macrophages = పృధుభక్షక కణములు (గ.న )
Humoral immunity = స్రావక రక్షణ ( గ.న )
Memory cells = జ్ఞాపక కణములు ( గ.న )
Recall immunity = స్ఫురణ రక్షణ ( గ.న )
Complement = సంపూరకము
Membrane attack complexes (MACs) = కణవేష్టన ఆక్రమణ వ్యవస్థలు ( గ.న )

అసహన నాసికాతాపము ( Allergic Rhinitis )

Paranasal sinuses = నాసికా కుహరములు ( గ.న )
Seasonal allergy  = ఋతు అసహనములు ( గ.న )
Nasal turbinates ; Nasai Conchae = నాసికా శుక్తులు ( గ.న )
Anaphylaxis = రక్షణ వికటత్వము ( గ.న )
Air- conditioner = వాయు నియంత్రణులు (గ.న ) 
Humidifier = ఆర్ద్ర సాధనము ( గ.న )
Receptor agonists = గ్రాహక ఉత్తేజకములు (గ.న )
Receptor blockers = గ్రాహక అవరోధకములు గ.న )

రక్షణ వికటత్వము ( Anaphylaxis )

Allergies = అసహనములు 
Anaphylaxis = రక్షణ వికటత్వము ( గ.న )
Antibodies = ప్రతిరక్షకములు  
antigens = ప్రతిజనకములు 
Anti inflammatory agents = తాప నిరోధకములు ( గ.న )
Antihistamines = హిష్టమిన్ అవరోధకములు ; హిష్టమిన్ గ్రాహక అవరోధకములు ( గ.న )
Bacteria = సూక్ష్మజీవులు 
Basophils = క్షారాకర్షణ కణములు ( గ.న )
Beta adrenergic receptor agonists = బీటా ఎడ్రినెర్జిక్ గ్రాహక ఉత్తేజకములు (గ.న )
Beta adrenergic receptor blockers = బీటాగ్రాహక అవరోధకములు ( గ.న )
Central veins = కేంద్ర సిరలు ( గ.న )
Contrast materials =  వ్యత్యాస పదార్థములు 
Connective tissue = సంధాన కణజాలము 
Endotracheal tube = శ్వాసనాళాంతర ( కృత్రిమ ) నాళము ( గ.న )
Glycoproteins = శర్కర మాంసకృత్తులు ( గ.న )
Granules =  కణికలు
Immunoglobulins = రక్షక మాంసకృత్తులు ( గ.న )
Laryngeal edema = స్వరపేటికలో పొంగు ( గ.న )
Lymph glands = రసి గ్రంథులు 
Laryngeal spasm = స్వరపేటిక బిగుతు ( గ.న )
Mast cells = స్తంభ కణములు ( గ.న )
Mastocytosis = స్తంభకణ వ్యాధి ( గ.న )
Muscle relaxants = కండర విశ్రామకములు ( గ.న )
Nausea = వమన భావన ( గ.న ) ; డోకు
Oxygen saturation= ప్రాణవాయు సంపృక్తత ( గ.న )
Parasites  = పరాన్నభుక్తులు 
Rash = విస్ఫోటము
Respiratory failure = శ్వాస వైఫల్యము ( గ.న )
Sepsis  = సూక్షజీవ విషమయము ( గ.న )
Shock = అఘాతము 
Spleen = ప్లీహము
Suppressive immunotherapies = అసహనములను అణచు రక్షణచికిత్సలు ( గ.న )
Urticaria = దద్దుర్లు 
Viruses  = విషజీవాంశములు ( గ.న )
Vital signs  = జీవ లక్షణములు ( గ.న )

ఆటాలమ్మ ( Chickenpox ) ; మేఖలవిసర్పణి , ఒడ్డాణపు చప్పి , అగ్గిచప్పి ( Herpes Zoster )

Antibodies =  ప్రతిరక్షకములు
Anterior nerve root = పూర్వ నాడీమూలము ( గ.న )
Antiviral medicines = విషజీవాంశ నాశకములు (గ.న )
Chicken pox, Varicella = ఆటాలమ్మ 
Congenital diseases = జన్మ వ్యాధులు (గ.న )
Dermatome = నాడీపాలిత చర్మవిభాగము ( గ.న )
Incubation Period = అంతర్గతస్థితి కాలము
Keratitis = స్వచ్ఛపటల తాపము ( గ.న )
Malaise = నలత  ( గ.న )
Mandibular nerve = అధోహనువు నాడి (గ.న )
Maxillary nerve = హనువు నాడి ( గ.న )
Nausea = వమన భావన ( గ.న ) , డోకు
Neuralgia = నాడీ వ్యథ ( గ.న )
Opthalmic nerve = నేత్రకుహర నాడి ( గ.న )
Osteonecrosis = అస్థి నిర్జీవత ( గ.న )
Papules = గట్టి పొక్కులు ( గ.న ) ( వీటిలో ద్రవము ఉండదు )
Pneumonitis = ఊపిరితిత్తుల తాపము ( గ.న )
Pustules = చీము పొక్కులు ( గ.న )
Rash = విస్ఫోటము
Shingles , Herpes Zoster = అగ్గిచప్పి ; మేఖల విసర్పిణి ( గ.న ) ; ఒడ్డాణపు చప్పి ( గ.న )
Trigeminal nerve = త్రిశాఖ నాడి
Uveitis = కృష్ణపటల తాపము  ( గ.న )
Vesicles = నీటి పొక్కులు 
Viruses = విషజీవాంశములు ( గ.న )

జలుబు ( Common cold )

Nasal sinuses = నాసికా కుహరములు ( గ.న )
Otitis media = మధ్య తాపము ( గ.న ) మధ్య కర్ణ తాపము ( గ.న )
Icosahedron = వింశతిఫలకము
Nasal decongestants = నాసికా నిస్సాంద్రకములు ( గ.న )
Histamine receptor blockers = హిష్టమిన్ గ్రాహక అవరోధకములు ( గ.న )

              వ్యాపక జ్వరము ( Influenza )

Antibiotics = సూక్ష్మాంగజీవ నాశకములు ; సూక్ష్మజీవ నాశకములు ( గ.న )
Antigens  = ప్రతి ( రక్షక ) జనకములు
Bacteria = సూక్షాంగజీవులు ; సూక్ష్మజీవులు 
Enzyme = జీవోత్ప్రేరకము (గ.న )
Epidemic = బహుళ వ్యాపక వ్యాధి
Genome = జన్యు పదార్థము ( గ.న )
Influenzas  = వ్యాపక జ్వరములు ( గ.న )
Masks = కప్పులు ; ఆచ్ఛాదనములు
Pandemics = విశ్వవ్యాపక వ్యాధులు ( గ.న )
Pneumonitis  = ఊపిరితిత్తుల తాపము ; పుపుస తాపము ( గ.న )
Viruses = విషజీవాంశములు ( గ.న )

సూక్ష్మాంగజీవుల వలన కలుగు చర్మవ్యాధులు ( Bacterial skin diseases )

Antibiotics = సూక్ష్మజీవ నాశకములు 
Atopic dermatitis =  అసహనత చర్మతాపము ( గ.న )
Bacteria  = సూక్ష్మాంగజీవులు
Bullae = బొబ్బలు 
Carbuncle = రాచకురుపు
Cell membrane = కణ వేష్టనము ( గ.న ) ; కణ పటలము
Cell wall = కణ కవచము 
Chronic carriers = దీర్ఘకాల వాహకులు ( గ.న )
Ecthyma  = కోప వ్రణములు ( గ.న )
Furuncle = సెగగడ్డ
Glomerulonephritis = కేశనాళికా గుచ్ఛతాపము ( గ.న )
Hair follicles = రోమ కూపములు
Impetigo = అంటు పెచ్చులు ( గ.న )
Moisturizers = ఆర్ద్ర ఔషధములు ( గ.న )
Para nasal sinuses = నాసికా కుహరములు ( గ.న )
Pustules = చీము పొక్కులు ( గ.న )
Subcutaneous tissue = చర్మాంతర కణజాలము ; అధశ్చర్మ కణజాలము ( గ.న )
Vesicles = నీటి పొక్కులు 
Xerosis = శుష్క వ్యాధి ( గ.న ) 

కణ తాపము ( Cellulitis )

Abscesses = చీము తిత్తులు ( గ.న )
Antibiotics = సూక్ష్మజీవ నాశకములు ( గ.న )
Bacteria = సూక్ష్మాంగజీవులు ; సూక్ష్మజీవులు 
Bacterial cultures = సూక్ష్మజీవుల పెంపకము ( గ.న )
Bulla = బొబ్బ ( గ.న ) 
Cellulitis = కణ తాపము (గ.న )
Cell walls = కణ కుడ్యములు ( గ.న )
Cocci  = గోళ సూక్ష్మజీవులు ( గ.న )
Delerium = మతిభ్రంశము 
Enzymes  = జీవోత్ప్రేరకములు ( గ.న )
Fungal infections = శిలీంధ్ర వ్యాధులు 
Hypotension = రక్తపీడన హీనత ( గ.న ) ; అల్పరక్తపీడనము ( గ.న )
Induration = గట్టితనము 
Infection = సూక్ష్మజీవుల  ఆక్రమణ ( దాడి ) ( గ.న )
Leukocytes = తెల్ల కణములు 
Phagocytes = భక్షక కణములు 
Peau d’ orange = నారంగ చర్మము ( గ.న )
Pustules = చీము పొక్కులు ( గ.న )
Rods = కోలలు 
Sepsis = సూక్ష్మజీవ విషమయము ( గ.న )
Signs of inflammation = తాప లక్షణములు ( గ.న )
Subcutaneous tissue = చర్మాంతర కణజాలము ( గ.న ) ; అధశ్చర్మ కణజాలము ( గ.న )
Spirals  = సర్పిలములు 
Toxins = జీవవిషములు 
Ultrasonography = శ్రవణాతీత ధ్వనిచిత్రీకరణము ( గ.న )
Vesicles = నీటిపొక్కులు 

శిలీంధ్ర చర్మవ్యాధులు :

Abscesses  = చీము తిత్తులు ( గ.న )
Alopecia = బట్టతల మచ్చలు ( గ.న )
Antibiotics = సూక్ష్మజీవ సంహారకములు ( గ.న )
Antifungals = శిలీంధ్ర నాశకములు ( గ.న )
Biopsies = కణ పరీక్షలు ( గ.న )
Bullae = బొబ్బలు ( గ.న )
Cellulitis = కణ తాపము ( గ.న )
Dermatophytes = చర్మాంకురములు ( గ.న )
Dimorphic  = ద్విరూపి 
Enzyme = జీవోత్ప్రేరకము ( గ.న )
Hyphae = శిలీంధ్రపు పోగులు 
Hypopigmentation = వర్ణ హీనత ( గ.న )
Intertriginous tinea pedis = అంగుళాంతర వ్యాధి ( గ.న )
Fungal Spores = శిలీంధ్ర బీజములు
Fungi = శిలీంధ్రములు 
Furuncles = సెగగడ్డ
Kerions =  శిలీంధ్ర రోమకూప వ్రణములు ( గ.న )
Nail bed = నఖ క్షేత్రము ( గ.న )
Nodules = కణుతులు 
Pustules = చీము పొక్కులు ( గ.న )
Peripheral arterial disease  = దూరధమని వ్యాధి
Pulse therapy = విరామ చికిత్స ( గ.న )
Scales = పొలుసులు
Tinea barbae  = గడ్డపు తామర ( గ.న )
Tinea capitis = తల తామర ; శిరస్సు శిలీంధ్ర వ్యాధి ( గ.న )
Tinea carporis = ఒంటి తామర ( గ.న )
Tinea cruris = తొడమూలపు తామర ( గ.న )
Tinea Pedis = పాదశిలీంధ్ర వ్యాధి ( గ.న )
Tinea unguium ; Onychomycosis = గోటి తామర ; నఖ శిలీంధ్రవ్యాధి ( గ.న )
Tinea versicolor = సోబి ; సుబ్బెము ( Pityriasis versicolor )
 Ultraviolet light = అతినీలలోహిత దీపము ( గ.న )
Ultraviolet rays = అతినీలలోహిత కిరణములు ( గ.న )
Vesicles = నీటి పొక్కులు
Yeast ; Candida = మధు శిలీంద్రము 

అంటురోగముల నివారణ
Antibiotics = సూక్ష్మజీవ నాశకములు ( గ.న ) ; 
Aiirborne = వాయు వాహనులు ( గ.న )
Antiseptics = సూక్ష్మజీవి సంహారకములు
Antivirals  =  విషజీవాంశ నాశకములు ( గ.న )
Cell membrane = కణ వేష్టనము
Disinfectants = వ్యాధిజనక విధ్వంసకములు ( గ.న )
Fungi = శిలీంధ్రములు
Gloves = చేదొడుగులు
Influenza = వ్యాపకజ్వరము ( గ.న )
invasive procedures = ఆక్రమణ ప్రక్రియలు ( గ.న )
Masks = కప్పులు ; ఆచ్ఛాదనములు  
Parasites = పరాన్నభుక్తులు 
Pathogens= వ్యాధి జనకములు ( గ.న )
Sanitizer = శుద్ధి పదార్థములు 
Sinusitis = నాసికాకుహర తాపము ( గ.న )
Sterile = వ్యాధిజనక రహితము ( గ.న )
Surgical gowns = నిలువుటంగీలు
Viruses = విషజీవాంశములు ( గ.న )
Zoonosis = జంతువులనుంచి సంక్రమించు వ్యాధులు ; జంతు జనిత వ్యాధులు ( గ.న )


   
















30, ఏప్రిల్ 2021, శుక్రవారం

త్రొక్కిసలాట మరణాలు ( Stampede deaths )

                    త్రొక్కిసలాట మరణాలు

                                  ( Stampede deaths )


                                                                                    డాక్టరు. గన్నవరపు నరసింహమూర్తి.


   త్రొక్కిసలాట మరణాలు ప్రపంచపు నలుమూలలా జరుగుతూ ఉన్నా అవి ఎక్కువగా మూడవ ప్రపంచపు దేశాలలోనే జరుగుతాయి. అధిక జనాభా, ఎక్కువ మంది గుమికూడుట , ప్రభుత్వాధికారులకు గుంపుల నిర్వహణలలో తగిన శిక్షణ లేకపోవుట ( అందుచే వారికి ఏర్పడే అశక్తత, ఉదాసీనత ), ముందుగా త్రొక్కిసలాటలను నిరోధించుటకు ప్రణాళికలు, ముందు జాగ్రత్తలు లేకపోవుట , ప్రజలలో క్రమశిక్షణారాహిత్యము దీనికి కారణాలు కావచ్చును.

   21 వ శతాబ్దములో  జరిగిన ప్రసిద్ధ త్రొక్కిసలాటల మరణాలు ; 

(1) ఏప్రిల్ 12 2004 లో లక్నో నగరములో ఉచిత చీరల పంపిణీలో 21 మంది స్త్రీలు  మరణించారు.

(2) జనవరి 2005 లో మహారాష్ట్రలో ఒకగుడి వద్ద త్రొక్కిసలాటలో 265 మంది హిందూ యాత్రికులు మరణించారు.

(3) డిసెంబరు 2005 లో 42 మంది వఱద బాధితులు వస్తువుల పంపిణి సందర్భములో దక్షిణ భారతములో మరణించారు.

(4) అక్టోబర్ 3 2007 న ఉత్తర భారతములో 14 మంది స్త్రీలు ఒక రైల్వే స్టేషనులో మరణించారు.

(5) మార్చి 27  2008 న ఒక గుడిలో 8 మంది మరణించారు.

(6) ఆగష్టు 3 2008లో హిమాచల్ ప్రదేశ్ లో నైనాదేవి గుడి వద్ద 162 మంది భక్తులు మరణించారు .

(7) సెప్టెంబరు 30 2008  న జోధ్ పూరులో చాముండేశ్వరి దేవి గుడి వద్ద 224 మంది భక్తులు మరణించారు. ప్రజలు బాంబు ఉందనే పుకారు విని పరుగులు పెట్టడము వలన యీ ప్రమాదము జరిగింది.

(8) మార్చి 4 2010 న రాం- జానకి గుడి వద్ద కుందా లో 71 మంది మరణించారు.

(9) జనవరి 15 2011 న శబరిమల గుడి వద్ద 102 మంది భక్తులు మరణించారు.

(10) నవంబరు 8 , 2011 న హరిద్వార్ లో గంగానదీ తీరములో 16 గురు మరణించారు.

(11) ఫిబ్రవరి 10 ,2013లో అలహాబాద్ లో కుంభమేళా ఉత్సవాలలో 36 మంది మరణించారు

(12) అక్టోబర్ 13 2013 న నవరాత్రి ఉత్సవాలలో రత్నాఘర్ మాత గుడి ,మధ్యప్రదేశ్ లో 115 మంది మరణించారు.

(13) అక్టోబర్ 3 2014 న పాట్నా గాంధీ మైదానములో దశరా ఉత్సవాలలో 32 మంది మరణించారు.

(14) జూలై 14 2015 న గోదావరి పుష్కరాల ప్రారంభ దినమునాడు రాజమండ్రిలో 27 మంది యాత్రికులు మరణించారు. 

(15 ) ఆగష్టు 10, 2015 ఝార్ఖండ్ రాష్త్రము దియోగఢ్ లో దుర్గామాత ఆలయములో  తొక్కిసలాటలో     11 మంది మృత్యువాత పడ్డారు.

(16 ) సెప్టెంబరు 24 2015 నాడు   మక్కాలో 769 మంది హాజ్ యాత్రికులు త్రొక్కిసలాటలో మరణించారు. 2006 తర్వాత హాజ్ యాత్రలో మరల అధిక సంఖ్యలో యింతమంది యాత్రికులు మరణించడము అనేకులు గాయపడడము జరిగింది. యాత్రికులను గుంపులుగా విభజించి, జనసందోహమును నియంత్రిచడములో సౌదీ రక్షకభటులు, కార్యకర్తలు వైఫల్యము చెందారు. 

( 17 ) సెప్టెంబరు 29, 2017 నాడు ముంబాయి ఎల్ఫిన్ స్టోన్ ట్రైన్ స్టేషన్ వద్ద కాలివంతెనపై జరిగిన త్రొక్కిసలాటలో 22 మంది మరణించారు. వంతెన కూలిపోతుందేమో అనే భయముతో ప్రజలు తోపులాట ప్రారంభించారు.

( 18 ) జనవరి 7 , 2020 నాడు ఇరాన్ లో ఖాసిం సోలైమని అంత్యక్రియల ఊరేగింపు త్రొక్కిసలాటలో 56 మరణించారు. 200 మందికి పైగా గాయపడ్డారు.

( 19 ) ఆగష్టు 22 , 2020 నాడు లాస్ ఒలివోస్ , లిమా , పెరూ లో చట్ట వ్యతిరేకముగా జనులు గుమికూడిన నైట్ క్లబ్ పై పోలీసులు దాడి చేసినపుడు త్రొక్కిసలాటలో 13 గురు చనిపోయారు. కోవిడ్ ను నియంత్రించుటకు జనులు గుమికూడుటను అచటి ప్రభుత్వము నిషేధించింది.

( 20) ఏప్రిల్ 30, 2021 న , మౌంట్ మేరన్ , ఇజ్రాయిల్ లో మత సంబంధ ఉత్సవములో జరిగిన త్రొక్కిసలాటలో 45 మరణించారు, 150 మంది గాయపడ్డారు.

( 21) నవంబరు 5 , 2021 న ఉత్తర అమెరికా దేశము హ్యూష్టన్ నగరములో ‘ ఆష్ట్రో వరల్డ్ ‘ గాన కచేరీ సభలో జరిగిన త్రొక్కిసలాటలో 9 మంది మరణించారు , 300 మంది గాయపడ్డారు. 

22) అక్టోబరు 29, 2022 న దక్షిణ కొరియా, సియోల్ లో హేలొవిన్ ఉత్సవ వేడుకల సందర్భముగా జరిగిన త్రొక్కిసలాటలో 151 మంది మృతిచెందారు. ఒక సినిమానటి వచ్చారనే వార్తతో ఆమెను చూడటానికి ప్రజలు తోసుకొని ముందుకు వెళ్ళాలని ప్రయత్నించడము వలన ఈ ప్రమాదము జరిగింది.

23). డిసెంబరు 28, 2022 న భారతదేశము ఆంధ్రప్రదేశ్ నెల్లూరుజిల్లా కందుకూరులో ఒక రాజకీయపక్ష సభలో తొక్కిసలాట వలన కొందఱు కాలువలో పడగా ఎనమండుగురు మృతిచెందారు. మరికొందఱు గాయపడ్డారు.

24). జనవరి 1, 2023 న ఆంధ్రప్రదేశ్, గుంటూరులో ఒక రాజకీయపక్ష సభలో చీరలు, వస్తువులు కానుకలు పంపిణీ సందర్భములో జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మహిళలు మృతిచెందారు.

25). ఫిబ్రవరి 4 వ తారీఖున చెన్నై తిరుపత్తూరు జిల్లాలో వాణియంబాడి ప్రాంతములో మురుగన్ తైపూసం   ఉత్సవాల సందర్భములో ఒక ప్రైవేటు సంస్థ తలపెట్టిన ఉచిత చీరలు ధోవతీల పంపిణి కార్యక్రమములో జరిగిన తొక్కిసలాటలో నలుగురు మహిళలు మరణించారు. పదిమంది గాయపడ్డారు.

         వెనుక నుంచి ఆత్రుత పడే జనులకు ముందు వారి అవస్థ తెలియదు. సరియైన శిక్షణ, ముందుచూపు, ప్రణాళికా లోపించడము వలన యీ ప్రమాదాలు జరుగుతాయి. ఈ ప్రమాదాలు నివారించ దగినవే ! ఈ ప్రమాదాలలో యాత్రికులను, ప్రజలను నిందించుట పొరబాటు.

      ఇలాంటి ప్రమాదాలలో కొన్ని అనివార్యమైనా , చాలా త్రొక్కిసలాటలను ముందు జాగ్రత్త చర్యలతో నివారించ వచ్చును .

 1. అధికారులకు , స్వయంసేవకులకు ముందుగానే జనసందోహాలను గౌరవపూర్వకముగా నియంత్రించడములో తగిన శిక్షణలు ఇచ్చి వారిని గుంపులను నియంత్రించుటకు నియోగించాలి.

2. అట్టి శిక్షణ గల అధికారులను, స్వయంసేవకులను, నిర్వాహకులను  ప్రజలు గుమికూడే సందర్భాలలో తప్పక వినియోగించుకోవాలి.

3. జనసందోహములను నిర్ణీత సమయయములలోను, నిర్ణీత స్థలములలోను గుంపులుగా విభజించి ఒక క్రమ పద్ధతిలో ముందుకి నడిపించాలి. 

4. యాత్రికులు వారంతట వారొక చోటికి చేరుకోలేరు కాబట్టి అదుపులో ఉంచగలిగిన అంత మందినే నిర్వాహకుకులు ఆ యా స్థలములకు  నిర్ణీత సమయాలలో విభజించి చేర్చాలి.

5. తగిన ఉక్కు అడ్డుకట్టలు , త్రాళ్ళుతో , గుంపులను నియంత్రించాలి. 

6. విపరీతమైన ఎండ , చలి వంటి వాతావరణ పరిస్థితుల నుంచి కొంత రక్షణ కలిపించాలి.

ప్రజలు అసహనానికి లోనవకుండా చూసుకోవాలి. 

7. వరుసలలో నిలబడుట ఇష్టము లేనివారు బయట పడడానికి అవకాశాలు కల్పించాలి.

 8. పిల్లా పాప ఉన్నవారిని , వృద్థులను, వికలాంగులను గౌరవముతో పరిరక్షించుకోవాలని ప్రజలకు హెచ్చరికలు చేస్తూ  ఉండాలి. స్వయంసేవకులు గాని , రక్షకభటులు గాని వారి రక్షణకు పూనుకోవాలి.

9. సభలు జరిపేటప్పుడు, జనసందోహమును సమీకరించేటప్పుడు విశాలమైన ప్రదేశాలను ఎన్నుకొని జన సాంద్రతను నివారించాలి.

10). జనసందోహములను అదుపులో పెట్టు బాధ్యత తీసుకొన్న పిదపనే జనసమీకరణలకు అనుమతులు ఇవ్వాలి.

     ఈ ప్రమాదాలు జరిగినపుడు  రాజకీయాలు , పరస్పర నిందలు చేస్తే సాధించేది లేదు.

ఈ ప్రమాదాలను అరికట్టే సత్తా నిర్వాహకులకు, ప్రభుత్వ యంత్రాంగాలకే ఉంటుంది కాబట్టి, ప్రజలకు క్రమశిక్షణ లేదని నిందిస్తే ప్రయోజనము లేదు. వ్యక్తిగతముగా బాధ్యతాపరులైనా, గుంపులో ఉన్న జనులకు క్రమశిక్షణ ఉండదు, వ్యక్తులకు గుంపులపై ఆధీనము ఉండదు . ఆ భావనతోనే అధికారులు ముందు జాగ్రత్తలు తీసుకోవాలి.

      ఈ త్రొక్కిసలాటలను కావాలని ఎవరూ ప్రారంభించరు. ముందుకు పోదామని వెనుక ఉన్నవారు తొందఱపడుతారు. మనుజుల వత్తిడితో ముందున్నవారు ఉక్కిరి బిక్కిరయి  ఊపిరి ఆడక ( Compressive Asphyxiation ) మరణించడమో , సొమ్మసిల్లడమో జరుగుతుంది. మనుష్యులపై మనుష్యులు పడినప్పుడు కూడా క్రిందవారికి ఊపిరి ఆడదు. పడిపోవుట వలన గాయాలు తగులుతాయి.

      ముందున్నవారి పరిస్థితి వెనుక ఉన్నవారికి తెలియదు. వెనుక ఉన్నవారికి ముందున్న వారి పరిస్థితిని తెలియ పఱచి తోపులాటలు అరికట్టాలి. ముఖ్యముగా ప్రజలను చిన్న చిన్న గుంపులుగా విభజించాలి.

విషయసూచిక

  1. ఆరోగ్యము ; వైద్యము https://gvnmurty.blogspot.com/2019/06/blog-post_2.html 2. మధుమేహవ్యాధి ( Diabetes mellitus ) https://gvnmurty.blogsp...