23, ఆగస్టు 2021, సోమవారం

జఠర అన్ననాళ ఆమ్ల తిరోగమన వ్యాధి ( Gastro esophageal reflux disease )



( తెలుగు తల్లి కెనడా వారి సౌజన్యముతో )









        ఆమ్ల తిరోగమనము ( జఠర - అన్ననాళ ఆమ్ల తిరోగమనము )

                      ( Gastro Esophageal Reflux Disease )


                                                              డాక్టరు. గన్నవరపు నరసింహమూర్తి

    కడుపులో నుంచి ఆమ్ల పదార్థములు అన్ననాళము లోనికి  వెనుకకు మఱలిరావడము వలన ఛాతిలో మంట కలుగడము  తఱచు వైద్యులు చూస్తారు. సుమారు 20 శాతము మంది వయోజనులు ఈ ఆమ్ల తిరోగమనమునకు ( Acid reflux ) గుఱి అవుతారు. ఆమ్ల తిరోగమనము వలన కొన్ని ఉపద్రవములు కూడా కలుగ వచ్చు.

అన్ననాళము 


    అన్న నాళము ( అన్న వాహిక / oesophagus ) ఆహార పానీయాలను గొంతు నుంచి కడుపునకు చేర్చే ఒక ఒక కండర నాళము. ఇది కంఠము మధ్య భాగములో మొదలిడి ఛాతి నడిమిలో క్రిందకు దిగి ఉదరవితానములో ( విభాజకము / diaphragm ) అన్నవాహిక రంధ్రము ( esophageal hiatus ) ద్వారా ఉదర కుహరము ( abdomen ) లోనికి ప్రవేశించి జఠరము ( stomach ) లోనికి అంతము అవుతుంది. 

    ఉదరవితానము ఉరఃపంజరము ( chest ), ఉదర కుహరములను ( Abdomen ) విభజించే ఒక కండర పటకము .

     అన్ననాళము వయోజనులలో సుమారు తొమ్మిది అంగుళముల ( 28 సెం.మీ ) పొడవు కలిగి ఉంటుంది. లోపల శ్లేష్మపు పొరతో ( mucous membrane ) కప్పబడి ఉంటుంది. ఈ శ్లేష్మపు పొరలో మూడు వరుసల పొలుసుల కణములు ( squamous cells ) దొంతరలుగా ఉంటాయి. 
        జఠర శ్లేష్మపు పొరలో ఒక వరుస స్తంభాకార కణములు ( columnar cells ) ఉంటాయి. అన్న నాళ జఠర సంధాన రేఖ వంకర టింకరగా ఉంటుంది.
   
    అన్ననాళపు శ్లేష్మపు పొరలో నిలువుగా ముడతలు ఉంటాయి. అన్న కబళముతో గాని గాలితో కాని విచ్చుకొని సాగినపుడు ఆ  ముడుతలు పోతాయి. శ్లేష్మపు పొర క్రింద వదులుగా సంధాన కణజాలము ( alveolar connective  tissue ) ఉంటుంది. శ్లేష్మపు పొర, సంధాన కణజాలముల మధ్య నిలువుగా కండర తంతులు ఉండి శ్లేష్మ కండరము ( muscularis mucosa ) ఏర్పరుస్తాయి. శ్లేష్మపు పొర క్రింద అన్ననాళ గ్రంథులు ఉంటాయి. ఈ గ్రంథుల నాళికలు అన్ననాళము లోనికి తెఱుచుకొని శ్లేష్మ స్రావకములను ( mucous secretions ) విడుదల చేస్తాయి. ఈ స్రావకములు మృదు క్షారగుణము కలిగి ఉంటాయి. జఠరము నుంచి తిరోగమనము అయే ఆమ్లమును తటస్థీకరించుటకు ఇవి తోడ్పడుతాయి. అన్నవాహిక గోడలో బయట నిలువు పోగులతో ఒక కండరము ( longitudinal muscle ), దానికి లోపల గుండ్రని పోగులతో మరొక కండరము ( circular muscle ) ఉంటాయి. ఈ కండరముల చలనము ( peristalsis ) వలన ఆహారము ముందుకు నెట్టబడుతుంది. 

    అన్న నాళము పై భాగములోను, క్రింది భాగములోను నియంత్రణ కండరములు ( sphincters ) ఉంటాయి. గొంతులోని పదార్థములను మ్రింగునపుడు పై నియంత్రణ కండరము బిగుతు తగ్గి పదార్థములను అన్ననాళము లోనికి ప్రవేశింప జేస్తుంది. ఆ పదార్థములు కండర చలనముతో ( peristalsis ) క్రిందకు చేరాక, క్రింది నియంత్రణ కండరపు బిగుతు తగ్గి  పదార్థములు జఠరములోనికి ప్రవేశించుటకు అనుకూలిస్తుంది. 

    అన్ననాళము క్రింది నియంత్రణ కండరపు బిగుతు వలన, ఉదరవితానము అన్ననాళమును నొక్కి ఉంచుట వలన, అన్ననాళము జఠరముల మధ్య కోణము లఘుకోణము ( acute angle ) అగుట వలన జఠరములోని పదార్థములు అన్ననాళము లోనికి సాధారణముగా ప్రవేశించవు. ఆమ్ల పదార్థములు అన్ననాళము లోనికి ఎప్పుడైనా ప్రవేశిస్తే క్షారగుణము కల అన్ననాళ స్రావములు, నోటి నుంచి వచ్చే లాలాజలము ఆ ఆమ్లమును తటస్థీకరింపజేస్తాయి. అన్ననాళ కండరముల సంకోచ వికాసములతో ఆ పదార్థములు తిరిగి కడుపు లోనికి నెట్టబడుతాయి.

    జఠరములో స్రవించు  ఉదజ హరికామ్లము ( hydrochloric acid ) జఠర రసమునకు ఆమ్ల గుణము ఇస్తుంది.  ఈ ఆమ్లము అన్నవాహిక లోనికి తఱచు, ఎక్కువ కాలము తిరోగమనము చెందుతే అన్నవాహికలో తాపము ( inflammation ), ఒరపిడులు ( erosions ), వ్రణములు ( ulcers ) కలుగ గలవు .

 ఆమ్ల తిరోగమనమునకు కారణములు

     కడుపులోని పదార్థములు  అన్ననాళము లోనికి చాలా కారణముల వలన తిరోగమించగలవు. 

 రంధ్ర గళనము ( Hiatal hernia) :



    అన్ననాళ రంధ్రము ( Oesophageal hiatus ) ద్వారా జఠరపు మీది భాగము ఛాతిలోనికి జాఱుట వలన ఆమ్లము అన్నవాహిక లోనికి తిరోగమించ గలదు. కొందఱిలో జఠరపు పై భాగము అన్ననాళముతో మీదకు ( sliding hernia ) భ్రంశము చెందితే, కొద్ది మందిలో అన్ననాళమునకు ప్రక్కగా మీదకు భ్రంశము ( para esophageal  hernia ) చెందుతుంది.
                                
    అన్ననాళపు క్రింది నియంత్రణ కండరపు బిగుతు అనుచితముగా తగ్గుట వలన కొందఱిలో ఆమ్ల తిరోగమనము జరుగుతుంది. బరువు ఎక్కువయిన వారిలోను, గర్భిణీ స్త్రీలలోను, పొగత్రాగేవారిలోను ఆమ్ల తిరోగమనము కలిగే అవకాశములు హెచ్చు. 

    స్క్లీరోడెర్మా ( Scleroderma ) వ్యాధిగ్రస్థులలోను, అన్నవాహిక చలనములో ఇతర దోషములు కలవారిలోను అన్ననాళము లోనికి మఱలే ఆమ్లము త్వరగా జీర్ణాశయము లోనికి తిరిగి మళ్ళించబడదు. వీరిలో ఆమ్ల తిరోగమన వ్యాధి లక్షణములు ఎక్కువగా చూస్తాము. 

       కాఫీ, టీ, చాకొలేట్లు, మద్యపానముల వలన, కొన్ని ఔషధముల {   బైఫాస్ఫొనేట్లు ( biphophonates ) కాల్సియమ్ మార్గ అవరోధకములు ( Calcium channel blockers ), ట్రైసైక్లిక్ క్రుంగుదల నివారణ మందులు, బెంజోడయజిపామ్స్  } వలన ఆమ్ల తిరోగమన లక్షణములు కలుగవచ్చును.

 ఆమ్ల తిరోగమన వ్యాధి లక్షణములు :


      కడుపులో పదార్థములు నోటిలోనికి వచ్చుట, ఛాతిలో మంట తఱచు కలిగే లక్షణాలు. దగ్గు, గొంతునొప్పి, గొంతు బొంగురు పోవుట, ఆయాసము, ఛాతిలో పిల్లికూతలు, దంతములలో ఎనామిల్ నష్టము ఆమ్ల తిరోగమనము వలన కలిగే ఇతర లక్షణములు. కొందఱిలో గుండెనొప్పిలా ఈ వ్యాధి కనిపించవచ్చును. వారిలో హృద్ధమని వ్యాధులకు తొలిగా శోధించాలి. 

 ఆమ్ల తిరోగమనమును పోలెడి ఇతర వ్యాధులు :


ఆమ్లాకర్షణ కణ అన్ననాళ తాపము ( Eosinophilic esophagitis) :


     ఈ వ్యాధిలో అన్నవాహిక శ్లేష్మపు పొరలో ఆమ్లాకర్షణ కణములు కూడుకుంటాయి. ఈ వ్యాధిగ్రస్థులలో అసహన చర్మతాపము ( atopy ), అసహన నాసికా తాపము ( allergic rhinitis ), ఉబ్బస ( Asthma ) వంటి వ్యాధులు సామాన్యము. కొన్ని ఆహార పదార్థములకు అసహనము యీ వ్యాధికి కారణము కావచ్చును. వీరిలో మింగుటకు కష్టము ( కష్ట కబళనము /  dysphagia ), ఆహార పదార్థములు అన్ననాళములో ఇరుక్కుపోవుట ( food impaction ), ఛాతిలో మంట, వంటి లక్షణములు కలుగవచ్చు. అంతర్దర్శినితో పరీక్షించినపుడు అన్ననాళము కుచించుకు పోవుట, లోపొరలో బొఱియలు ( furrows ), పగుళ్ళు, కాలువల వంటి పల్లములు ( corrugations ), తెల్లని ఫలకలు ( plaques ) కనిపించ వచ్చును. చిన్న తునుక తీసుకొని కణపరీక్ష చేస్తే ఆమ్లాకర్షణ కణాలు ( eosinophils ) 15 / HPF మించి ఉంటాయి. రెండు నెలల ఆమ్లయంత్ర నిరోధక ఔషధములు ( proton pump inhibitors ) వాడి అంతర్దర్శినితో ( endoscopy ) పరీక్షించి సత్ఫలితములు రాని వారిలో స్థానికముగా పనిచేసే కార్టికోష్టీరాయిడులు ఫ్లుటికసోన్ ( fluticasone ), కాని బ్యుడినొసైడ్ ( budenoside ) కాని వాడవచ్చును. కొందఱిలో నోటి ద్వారా ప్రెడ్నిసోన్ అవసరమవవచ్చును. అసహనములుగా ఋజువయిన  ఆహారపదార్థములు  మానివేయాలి.

 ఆక్రమణ వ్యాధులు (Infectious diseases) :


     వ్యాధి నిరోధకశక్తి తగ్గిన వారిలోను ( హెచ్.ఐ.వి వ్యాధిగ్రస్థులు, పర అవయవ దానములు ( organ transplantation ) కలవారు, కర్కణవ్రణ వ్యాధిగ్రస్థులు, మధుమేహ వ్యాధిగ్రస్థులు ), సూక్ష్మజీవ నాశకములు ( antibiotics ), కార్టికోష్టీరాయిడులు వాడే వారిలోను,స్క్లీరోడెర్మా ( scleroderma ), అన్ననాళపు క్రింది నియంత్రణ కండరపు బిగింపు ( achalasia cardia ) వంటి అన్ననాళ కండర చలన దోషములు కలవారిలోను, మధుశిలీంధ్రములు ( Candida ), హెర్పీస్ సింప్లెక్స్ విషజీవాంశములు ( HSV ), సైటోమెగాలో వైరస్లు ( Cytomegalovirus - CMV ), అన్నవాహిక శ్లేష్మపు పొరను ఆక్రమించి అన్నవాహికలో తాపము కలిగించ గలవు. వీరిలో మింగుడు కష్టమగుట ( dysphagia ), మింగునపుడు నొప్పి ( odynophagia ) వంటి లక్షణములు కనిపిస్తాయి. అంతర్దర్శినితో అన్ననాళమును పరీక్షించుట వలన, తునకలను తీసుకొని కణపరీక్షలు చేయుట వలన వ్యాధులను నిర్ధారించవచ్చును. ఆపై ఆ వ్యాధులకు చికిత్స చెయ్యాలి.

  రసాయన పదార్థములు కలిగించు అన్ననాళ తాపములు (Chemical oesophagitis) :


    తీవ్ర క్షారములు, ఆమ్లములు మింగుట వలన, పొటాసియమ్, డాక్సీసైక్లిన్, క్వినిడిన్, ఏస్పిరిన్, తాప హరములు ( anti inflammatory agents ) వంటి ఔషధములు మింగుట వలన అన్ననాళములో కణవిధ్వంసము, ఒరపిడులు ( erosions ), తాపములు కలిగి మింగుట ఇబ్బంది కావచ్చును.


 పరీక్షలు :


    గుండెమంట, ఆమ్ల పదార్థములు తఱచు నోటిలోనికి వచ్చేవారికి ఆమ్లయంత్ర నిరోధక ఔషధములు ( proton pump inhibitors ) రెండు నెలలు వాడి వారి వ్యాధి లక్షణములు నివారించబడితే వారికి వేఱే పరీక్షల అవసరము లేదు.

     అప్రయత్నముగా బరువు తగ్గుట, పాండురోగము ( anemia ), ఆహారము మ్రింగుట కష్టమగుట, మ్రింగునపుడు నొప్పి కలుగుట, రక్తస్రావము వంటి ఆందోళనకర లక్షణములు కలవారిని ఇతర వ్యాధులకై అంతర్దర్శినితో ( endoscopy ) అన్ననాళ, జఠర, ఆంత్రములను శోధించి ( Esophago Gastro Duodenoscopy ) చిన్న శకలములను గ్రహించి కణ పరీక్షలకు పంపాలి. అన్ననాళములో అప్రమాదకరమైన సంకోచములు ఉంటే బుడగ సాధనములతో వైద్యులు సంకోచములను వ్యాకోచింప జేయగలరు. వీరిలో రక్తగణ పరీక్షలు, రక్తద్రవ రసాయన పరీక్షలు కూడా అవసరమే. 

    మధుశిలీంధ్ర అన్ననాళ తాపము ( Candidial esophagitis ), విషజీవాంశ తాపములు, సంకోచములు ( strictures ), కండర చలన దోషములు, జీర్ణ వ్రణములు ( peptic ulcers ), కర్కట వ్రణములు ( cancers ) వంటి ప్రమాదకర వ్యాధులను ఆలస్యము కాకుండా కనుగొనుటకు అంతర్దర్శన పరీక్షలు ఉపయోగపడుతాయి.

  పి హెచ్ పర్యవేక్షణ :


   శలాక (probe) సాధనముతో అన్ననాళములోని పి.హెచ్ ను ( ఆమ్ల, క్షార పరిమాణము తెలుపు సూచిక ) నిరంతరము ఒక దినము పర్యవేక్షించి అన్ననాళములో ఆమ్ల తిరోగమనములను, వాటి తీవ్రతను నిర్ధారించవచ్చును. ఆమ్లనిరోధకములు వాడినా వ్యాధి లక్షణాలు తగ్గని వారిలో ఈ పరీక్ష ప్రయోజనకారి. 

అన్ననాళ  పీడన పర్యవేక్షణ ( esophageal manometry ) కండర చలన దోషములు కనుగొనుటకు ఉపయోగపడుతుంది.

 చికిత్స :


జీవనశైలి మార్పులు :


     శరీరపు బరువు ఎక్కువైన వారు ఆహారములో కేలరీలు తగ్గించుకొని, వ్యాయామము చేస్తూ బరువు తగ్గే ప్రయత్నాలు చెయ్యాలి. భోజనము తర్వాత రెండు గంటల వఱకు నడ్డి వాల్చకూడదు. పడుక్కొనేటప్పుడు తల పక్క ఎత్తుగా పెట్టుకోవాలి. నిదురించేటపుడు ఎడమవైపుకు తిరిగి ఉండుటకు యత్నించాలి. కాఫీ, టీ, చాకొలేట్, మద్యములను మితపరచుకోవాలి. ధూమపానము మానివేయాలి. ఈ సూచనలు అనుసరిస్తూ తగిన మందులు కూడా అవసరమయితే వాడుకోవాలి.

 ఆమ్ల తిరోగమనము లక్షణములు తఱచు కలిగే వారికి ఔషధములు అవసరము . 

 ఆమ్లహరములు ( Antacids):


    మృదు క్షారములు అల్యూమినియమ్ హైడ్రాక్సైడ్, మెగ్నీషియమ్ హైడ్రాక్సైడు, మెగ్నీషియమ్ కార్బొనేట్ లను ఒక్కక్కటిగా గాని, మిశ్రమములుగా గాని జఠరామ్లమును తటస్థీకరించుటకు అవసమయినపుడు లేక భోజనమునకు గంటన్నర, రెండుగంటల తర్వాత నిర్ణీత సమయాలలో గాని వాడవచ్చు. ఆమ్ల తిరోగమనము తీవ్రము కాని వారిలోను, అప్పుడప్పుడు కలిగే వారిలోను, తాత్కాలిక ఉపశమనమునకు మృదుక్షారములు ఉపయోగకరము. మూత్రాంగ వైఫల్యము ఉన్నవారిలో మెగ్నీషియమ్ లవణముల వాడుకలో చాలా జాగ్రత్త అవసరము. వీరు అల్యూమినియమ్ హైడ్రాక్సైడు వాడుకొనుట మేలు.


   హిష్టమిన్ -2 గ్రాహక అవరోధకములు (Histamine-2-receptor blockers) :


    ఇవి జఠర కణములపై హిస్టమిన్ ప్రభావమును అరికట్టి ఉదజ హరికామ్ల స్రావమును అణచివేస్తాయి. సైమెటిడిన్ ( Cimetidine), రెనెటిడిన్ ( Ranitidine ) ఫెమొటిడిన్ ( Famotidine ), నైజటిడిన్ ( Nizatidine ) హిస్టమిన్ -2 అవరోధకములకు ఉదహరణలు. హిష్టమిన్ గ్రాహక అవరోధకములు ఏబది శాతము మందిలో ఆమ్ల తిరోగమన లక్షణాలను అరికడతాయి. వీటిని దినమునకు ఒకసారి గాని రెండు సారులు గాని భోజనములకు ముందు వాడుకోవాలి. 

  ప్రోటాను (ఆమ్ల) యంత్ర అవరోధకములు ( Proton pump inhibitors) :


     ఇపుడు ప్రోటాను యంత్ర అవరోధకములు ( proton pump inhibitors) విరివిగా ప్రాచుర్యములో ఉన్నాయి. ఇవి ఉదజని ( ఆమ్ల ) స్రావమును అణచివేస్తాయి. 
    ఒమిప్రజోల్ ( Omeprazole ), ఎసొమిప్రజోల్ ( Esomeprazole ), లాన్సప్రజోల్ ( Lansoprazole ), పాన్టొప్రజోల్ ( Pantoprazole ) ప్రోటాను యంత్ర అవరోధకములకు ఉదహరణములు. జఠర ఉదజ హరికామ్ల స్రావమును అరికట్టుటలో ఇవి మిక్కిలి సమర్థవంతమైనవి. దినమునకు ఒకసారి గాని, రెండు సారులు గాని తగిన మోతాదులలో వాడుకోవాలి. ముందు హెచ్చు మోతాదులలో వాడినా రెండు, మూడు మాసముల పిమ్మట అవసరమైన మోతాదులకు పరిమితము చేసుకోవాలి. దీర్ఘకాలము వీటిని వాడుకొనే వారిలో అస్థి సాంద్రత ( bone mineral density ) తగ్గుటకు, విటమిన్ బి -12 పరిమాణములు తగ్గుటకు, సూక్ష్మజీవులు వలన ఊపిరితిత్తుల తాపములు ( pneumonias ) కలుగుటకు అవకాశము కలదు. కాని వీటి వలన చేకూరే ప్రయోజనమే హాని కంటె అధికము. 

 నియంత్రణ కండరపు బిగువు పెంచు మందులు :


    బెక్లొఫెన్ ( Baclofen ) అనే మందు అన్ననాళపు దిగువ నియంత్రణ కండరము వదులు కాకుండా చేసి ఆమ్లము వెనుకకు అన్ననాళములోనికి పోవుటను అరికడుతుంది. కాని దీని వలన అవాంఛిత ఫలితములు కలుగుతాయి కనుక ఎక్కువగా వాడరు. 

    మెటోక్లోప్రమైడ్ ( Metoclopramide  ) అన్ననాళము, జఠరములలో  కండర చలనమును ఉత్తేజపరచి ఆమ్ల తిరోగమనమును అరికడుతుంది. దీనిని దీర్ఘకాలము వాడేవారిలో తల, చేతులలో వణకు వంటి అసాధారణ చలనములు కలుగగలవు. అందుచే దీనిని ఎక్కువగా వాడరు.

 శస్త్ర చికిత్స :


    ఔషధములకు లొంగక ఆమ్ల తిరోగమనము ఎక్కువగా ఉన్నవారు, ఔషధములను సహించని వారు జీర్ణాశయపు పై భాగమును అన్న నాళము చుట్టూ చుట్టబెట్టి నిలిపే శస్త్రచికిత్స ( Nissan’s fundo plication ) గుఱించి యోచించాలి. ఈ శస్త్రచికిత్స వలన వెంటనే ఫలితములు ఉన్నా, దీర్ఘకాలములో మింగుట కష్టమగుట, తేన్పులు కష్టమగుట, కడుపు ఉబ్బరము, మొదలైన అవాంఛిత ఫలితములు కలుగవచ్చును. మందులతో ఉపశమనము పొందేవారు శస్త్రచికిత్స జోలికి వెళ్ళకపోవుట మంచిది. 

 ఉపద్రవములు (Complications) :


  అన్ననాళములో ఒరపిడులు, వ్రణములు ( Erosions, Ulcers) :


  ఇవి ఎక్కువగా అన్నవాహిక దిగువ భాగములో జీర్ణాశయమునకు దగ్గఱలో కలుగుతాయి. అరుదుగా వీటి వలన రక్తస్రావము, రక్తనష్టము, పాండురోగము కలుగగలవు. అంతర్దర్శినితో ( Endoscopy ) వీటిని వైద్యులు కనుగొనగలరు.


  అన్ననాళములో ఇరకటములు / సంకోచములు ( Esophageal strictures) :

     

     వ్రణములు , ఒరపిడులు పదే పదే కలిగి తంతీకరణముతో ( fibrosis  ) మానుట వలన అన్ననాళములో ఇరకటములు ( సంకోచములు / strictures ) ఏర్పడుతాయి. ఈ ఇరకటములు సన్నబడినప్పుడు ఘనపదార్థములు మ్రింగుట ఇబ్బందికరము అవుతుంది. అంతర్దర్శినితో కనుగొని బుడగ సాధనములతో వీటిని వ్యాకోచింప జేయవచ్చును. వీరు ఆమ్లయంత్ర అవరోధక ఔషధములను ( Proton pump inhibitors ) నిరంతరముగా వాడుకోవాలి.

బేరట్స్ అన్ననాళము (Barret’s Esophagus) :


    ఆమ్ల తిరోగమన వ్యాధిగ్రస్థులలో అన్ననాళ శ్లేష్మపు పొరలో ఆంత్ర పరిణామములు  ( intestinal metaplasia ) కలుగవచ్చును. వీరిలో లేత గులాబి వర్ణము బదులు ఆ భాగములు ముదురు ఎఱుపు గోధుమ వర్ణములలో ఉంటాయి. వీరిలో కర్కట వ్రణములు (cancers) కలిగే అవకాశములు పెరుగుతాయి. దీర్ఘకాలము ఆమ్ల తిరోగమన వ్యాధి కలవారిలో 50 సంవత్సరములు పైదాటిన వారిని అంతర్దర్శినితో పరీక్షించి అసాధారణ భాగముల నుంచి తునుకలు గ్రహించి కణ పరీక్షలు చెయ్యాలి. ప్రమాదకర కణ పరిణామములు ( dysplasia ) ఉంటే ఆ ఆంత్ర పరిణామ  ( intestinal metaplasia ) భాగములను వివిధ ప్రక్రియలలో ఒక దానిని ఎన్నుకొని ( radio frequency ablation, laser ablation, or photo ablation ) విధ్వంసము చెయ్యాలి. అన్ననాళములో ఆంత్ర పరిణామములు ( intestinal metaplasia ) ఉన్నవారికి మూడు సంవత్సరములకు ఒక సారైనా అంతర్దర్శిని పరీక్షలు, కణ పరీక్షలు ( biopsies ) చెయ్యాలి. అన్ననాళ కర్కట వ్రణములకు శస్త్రచికిత్సలు అవసరము. బేరట్స్ అన్ననాళ లక్షణములు ఉన్నవారికి ఆమ్లయంత్ర నిరోధకములతో ( proton pump inhibitors ) చికిత్స నిరంతరముగా కొనసాగించాలి.


(వైద్యవిషయములు నా శక్తిమేఱకు తెలుగులో చెప్పుట నా వ్యాసముల లక్ష్యము. వ్యాధిగ్రస్థులు తమ తమ వైద్యులను సంప్రదించాలి. ఉపయుక్తము అనుకొంటే పంచుకొనవచ్చును.)












5, ఆగస్టు 2021, గురువారం

వైద్యపదకోశము ( Alphabetically )

 


 


Abdominal Aorta = ఉదర బృహద్ధమని ( గ.న )

Abdominal Aortic Aneurysm = . ఉదర బృహద్ధమని బుద్బుదము ( బుడగ ) ( గ.న )

Abdominal Cavity = ఉదరకుహరము 

Abscess = చీముతిత్తి ( గ.న )

Acid Reflux = ఆమ్ల తిరోగమనము ( గ.న )

Acidophil , Eosinophil = ఆమ్లాకర్షణ కణము ( గ.న )

Acidosis = ఆమ్లీకృతము

Active immunity = చైతన్య రక్షణ ( గ.న )

Acute Coronary Syndrome = సత్వర హృద్ధమని వ్యాధులు ( గ.న )

Acute Kidney Injury  = సత్వర మూత్రాంగ విఘాతము ( గ.న )

Afferent Arteriole = ప్రవేశ ధమనిక  ( గ.న )

Airborne = వాయు వాహనులు ( గ.న )

Air- Conditioner = వాయు నియంత్రణి (గ.న ) 

Alcohol Withdrawal = మద్య పరిత్యజనము ; మద్య వర్జనము ( గ.న )

Alcoholic Hepatitis = సుర కాలేయ తాపము ( గ.న )

Alcoholic Steatosis = సుర కాలేయ వసవ్యాధి ( గ.న )

Allergen = అసహన పదార్థము ( గ.న )

Allergy = అసహనవ్యాధి ( గ.న )

Alopecia = బట్టతల మచ్చలు ( గ.న )

Alveolar Duct = పుపుసగోళ నాళిక ( గ.న ), వాయుగోళ నాళిక (గ.న)

Alveolus  = ఊపిరి బుడగ ( గ.న ) ; పుపుసగోళము ( గ.న ) ; వాయుగోళము

Anaphylaxis  = రక్షణ వికటత్వము ( గ.న )

Anastomotic Ulcer = సంధాన వ్రణము ( గ.న )

Anatomy  = దేహనిర్మాణ శాస్త్రము

Anemia = పాండురోగము 

Aneurysm = ధమని బుడగ ; ధమనీ బుద్బుదము ( గ.న )

Angina Pectoris = గుండెనొప్పి

Angiogram = ధమనీ చిత్రీకరణము (గ.న)

Angioplasty  = ధమనీవ్యాకోచ చికిత్స ( గ.న )

Angiotensin Receptor Blockers = ఏంజియోటెన్సిన్ గ్రాహక అవరోధకములు ( గ.న )

Ankle Brachial Index AbI = చీలమండ రక్తపీడనము / బాహు రక్తపీడనము ( గ.న ), చీలమండ, బాహు రక్తపీడనముల నిష్పత్తి (గ.న)

Antacid = ఆమ్ల విరోధము ; ఆమ్ల హరము

Anterior Cerebral Artery = పురోమస్తిష్క ధమని ( గ.న )

Anterior Communicating Artery = పురో సంధానధమని (గ.న )

Anterior Inter Ventricular Sulcus = పూర్వ జఠరికాంతర గర్తము ( గ.న )

Anterior nares = ముక్కుపుటాలు;  పూర్వ నాసికారంధ్రములు ( గ.న )

Anterior Nerve Root = పూర్వ నాడీమూలము ( గ.న )

Anterior Tibial Artery = పూర్వ జంఘిక ధమని ( గ.న )

Anterior Tibial Vein = పూర్వజంఘిక సిర ( గ.న )

Anti Inflammatory Agent = తాపక నివారణి ( గ.న ); తాప హర (ణ )ము (గ.న )

Antibiotic = సూక్ష్మజీవ సంహారకము  /  సూక్ష్మజీవ నాశకము

Antibody = ప్రతిరక్షకము

Anticoagulant = రక్తఘనీభవన అవరోధకము ( గ.న )

Anticonvulsant = మూర్ఛ నివారిణి ( గ.న )

Antifungal = శిలీంధ్ర నాశకము ( గ.న )

Antigen  = ప్రతి ( రక్షక ) జనకము

Antihistamine = హిష్టమిన్ అవరోధకము ; హిష్టమిన్ గ్రాహక అవరోధకము ( గ.న )

Antiseptic = సూక్ష్మజీవి సంహారకము

Antiviral  =  విషజీవాంశ నాశకము ( గ.న )

Antrum = అంతిమ కుహరము 

Aorta = బృహద్ధమని

Aortic Dissection = బృహద్ధమని విదళనము / బృహద్ధమని చీలిక (గ.న)

Aortic Stenosis = బృహద్ధమని కవాట సంకీర్ణత ( సంకోచము ) ( గ.న )

Aortic Valve = బృహద్ధమని కవాటము ( గ.న )

Aphasia = మాట పోవుట  ; వాఙ్నష్టము ; ( గ.న ) వాగ్నష్టము ( గ.న )

Apoptosis =  నిర్ణీత కణమృతి ( గ.న )

Arrhythmia = అసాధారణ లయ ( గ.న )

Arterial Blood Gas Studies = ధమనీరక్త వాయుపరీక్షలు ( గ.న )

Arterial Blood Gases = ధమనీ రక్త వాయువులు ( గ.న )

Arterial Bypass Surgery =  ధమనీ అవరోధ అధిగమన శస్త్రచికిత్స ( గ.న )

Arterial circle of Willis = మస్తిష్క ధమనీ చక్రము ( గ.న )

Arterial Malformation = ధమనీ వైకల్యము ( గ.న )

Artery = ధమని

Arteriosclerosis = ధమనీ కాఠిన్యము

Arteriovenous Fistula = ధమనీ సిర సంధానము (గ.న )

Ascending Loop =ఎగు మెలిక (గ.న )

Ascites = జలోదరము 

Ataxia = శరీరపు అస్థిరత ; దేహపు అస్థిరత ( గ.న ) ;  అస్థిర గమనము ( గ.న )

Atheroma = ధమనీ ఫలకము ( గ.న )

Atherosclerosis = ధమనీ కాఠిన్యము

Atherosclerotic Plaques = ధమనీ కాఠిన్య ఫలకలు ( గ.న )

Atopic Dermatitis =  అసహన చర్మతాపము ( గ.న )

Atria = కర్ణికలు

Atrial Fibrillation = ( హృదయ ) కర్ణికా ప్రకంపనము ( గ.న )

Atrium  = కర్ణిక

Attenuated = దుర్బలపఱచిన , నీరసింపబడిన ( గ.న )

Auditory Cortex = శ్రవణ వల్కలము ( గ.న )

Auto Antibodies = స్వయంప్రహరణ ప్రతిరక్షకములు ( గ.న )

Autoimmune Disease = స్వయంప్రహరణ (ప్రతిరక్షిత) వ్యాధి ( గ.న )

Autoimmune Disorder = స్వయంప్రహరణ (పరిరక్షణ) వ్యాధి ( గ.న )

Autoimmune Thyroiditis = స్వయంప్రహరణ గళగ్రంథి తాపము ( గ.న )

Axon = అక్షతంతువు

Bacteria = సూక్షాంగజీవులు ; సూక్ష్మజీవులు 

Bacterial Cultures = సూక్ష్మజీవుల పెంపకము ( గ.న )

Baker’S Cyst Of Gastrocnemio- Semimebranosus Bursa  = జానుభస్త్రిక బుద్బుదము ( గ.న )

Basal Metabolic Rate  =  విరామ జీవవ్యాపార ప్రమాణము ( గ.న ) ; 

విశ్రాంత జీవవ్యాపార ప్రమాణము ( డా. అడుసుమిల్లి చంద్రప్రసాద్ గారి సూచన )

Basement Membrane = మూలాధారపు పొర ( గ.న )

Basophil = క్షారాకర్షణ కణము ( గ.న )

Benign tumor = బోళాగడ్డ (గ.న); బేలగడ్డ (గ.న)

Beta Adrenergic Receptor Agonist = బీటా ఎడ్రినెర్జిక్ గ్రాహక ఉత్తేజకము ( గ.న )

Beta Adrenergic Receptor Blocker = బీటా ( ఎడ్రినెర్జిక్ ) గ్రాహక అవరోధకము ( గ.న )

Bicuspid Valve = ద్విపత్ర కవాటము 

Bile = పైత్య రసము

Bile Duct = పైత్య నాళము

Biochemistry = జీవరసాయన శాస్త్రము 

Biopsy  = కణ పరీక్ష ( గ.న )

Bipolar Disorder = ద్విధ్రువ వ్యాధి ( గ.న )

Blood Transfusion = పర రక్తదానము ( గ.న )

Body Mass Index  Bmi = భార సూచిక ( గ.న )

Bone Formation  = ఎముకల నిర్మాణ ప్రక్రియ ( గ.న )

Bone Marrow  = ఎముకల మజ్జ

Bone Mineral Densitometry = అస్థిసాంద్రత చిత్రీకరణము ( గ.న )

Bone Resorption = ఎముకల శిథిలత ( గ.న )

Bradycardia = హృదయ మాంద్యము ( గ.న )

Brain Stem = మస్తిష్క మూలము

Bronchus = పుపుసనాళము

Bronchi  = పుపుసనాళములు ( గ.న )

Bronchiole = పుపుస నాళిక (గ.న); శ్వాసనాళిక

Bronchitis =  శ్వాసనాళికల తాపము 

Bronchodilator Treatment  = శ్వాసనాళికా వ్యాకోచ చికిత్స ( గ.న )

Bronchodilator = శ్వాసనాళికా వ్యాకోచకము ( గ.న )

Brush cells = తూలిక కణములు (గ.న)

Buccinator = బుగ్గ కండరము ; కపోలిక ( గ.న )

Bulla = బొబ్బ ( గ.న ) 

Bypass Surgery = అధిగమన శస్త్రచికిత్స ( గ.న )

Cancer = పుట్టకురుపు ; కర్కట వ్రణము ( గ.న )

Capillary =సూక్ష్మరక్తనాళిక ; కేశ ( రక్త) నాళిక

Caput Medusa = ఉదరకుడ్యములో ఉబ్బు సిరలు ( గ.న )

Carbuncle = రాచకురుపు

Carcinogen = కర్కటవ్రణ జనకము ( గ.న)

Cardiac Arrhythmias = అసాధారణ హృదయ లయలు ( గ.న )

Cardiac Markers = హృదయ సూచకములు ( గ.న )

Cardiac Output = హృదయ ప్రసరణ (రక్త) ప్రమాణము ( గ.న )

Cardiac Pacemaker = హృదయ విద్యుత్ప్రేరకము, హృత్ప్రేరకము  ( గ.న )

Cardiogenic Shock = హృదయ జనిత ఘాతము / హృదయ జనిత ఉపద్రవము ( గ.న )

Cardioverter-Defifrillator = హృదయలయ సవరణి ( గ.న )

Carotid Artery Stenosis = కంఠధమని సంకుచితము ( గ.న )

Casts = మూసలు

Catheter = కృత్రిమ నాళము ( గ.న )( శరీరములోనికి దూర్చు నాళము )

Cation Exchange Resins = ఋణపరమాణు వినిమయ ఔషధములు ( గ.న )

Cell Membrane = కణ వేష్టనము ( గ.న ) ; కణ పటలము

Cell Wall = కణ కవచము ; కణ కుడ్యము ( గ.న )

Cellulitis = కణ తాపము ( గ.న )

Central Nervous System = కేంద్ర నాడీమండలము 

Central Sulcus = మధ్య గర్తము ( గ.న )

Central Veins = కేంద్ర సిరలు ( గ.న )

Centrifuge = వికేంద్రీకర యంత్రము ( గ.న )

Cerebellum  = చిన్నమెదడు 

Cerebral Angiogram = మస్తిష్క ధమనీ చిత్రీకరణ ( గ.న )

Cerebro Vascular Accidents  = మస్తిష్క  (రక్తనాళ ) విఘాతములు ( గ.న )

Cerebrum  = పెద్దమెదడు  

Chemotherapy = రసాయన ( ఔషధ ) చికిత్స

Chicken Pox, Varicella = ఆటాలమ్మ 

Chronic Carriers = దీర్ఘకాల వాహకులు ( గ.న )

Chronic Obstructive Pulmonary Disease = దీర్ఘకాల శ్వాస అవరోధక వ్యాధి ( గ.న )

Chronic Renal Failure = దీర్ఘకాల మూత్రాంగ వైఫల్యము ( గ.న )

Cilia = కదలాడే సూక్ష్మకేశములు  ( గ.న )

Circulating Blood Volume = దేహప్రసరణ రక్తప్రమాణము (గ.న )

Cirrhosis = నారంగ కాలేయవ్యాధి ( గ.న )

Cirrhosis Of Liver = నారంగ కాలేయవ్యాధి ( గ.న )

Clotting Factors  = రక్త ఘనీభవన అంశములు ( గ.న )

Clubbing Of Fingers = డోలుకఱ్ఱల వేళ్ళు  ( గ.న )

Cocci  = గోళ సూక్ష్మజీవులు ( గ.న )

Cognitive Behavioral Therapy = స్మృతివర్తన చికిత్స ( గ.న )

Collagen = పీచుకణజాలము ( గ.న )

Collateral Circulation = ప్రత్యామ్నాయ ప్రసరణ ( గ.న )

Collecting Ducts = సమీకరణ నాళములు  ( గ.న ) 

Colonoscope =  బృహదాంత్ర దర్శిని (గ.న)

Colonoscopy =  బృహదాంత్ర ( పెద్దప్రేవుల ) దర్శనము (గ.న )

Common Ileac Vein  = శ్రోణి సిర ( గ.న )

Complement = సంపూరకము

Compression Fracture = సంపీడన అస్థిభంగము ( గ.న )

Computerized Axial Tomography = గణనయంత్ర త్రిదిశ చిత్రీకరణము ( గ.న ) / గణనయంత్ర త్రిమితీయ చిత్రీకరణము ( గ.న )

Conduction = వహనము 

Congenital Disease = జన్మ వ్యాధి (గ.న ) ; పుట్టు వ్యాధి

Congestive Heart Failure = హృదయ వైఫల్యము 

Conjugated Bilirubin = సంయోగపు బిలిరుబిన్ ( గ.న )

Connective Tissue = సంధాన కణజాలము 

Connective Tissue Disorder = సంధాన కణజాల వ్యాధి ( గ.న )

Connective Tissue Protein = సంధానపు మాంసకృత్తి ( గ.న )

Contractility = ముకుళింపు ; సంకోచము

Contrast Material =  వ్యత్యాస పదార్థము

Convection = సంవహనము

Core Body Temperature = శరీరాంతర ఉష్ణోగ్రత ( గ.న )

Coronary Angiography  = హృద్ధమనుల చిత్రీకరణము ( గ.న )

Coronary Arterie = హృద్ధమని ; హృదయ ధమని

Coronary Artery Bypass Surgery = హృద్ధమని అవరోధ అధిగమన శస్త్రచికిత్స ( గ.న ) 

Coronary Artery Disease = హృద్ధమనుల వ్యాధి ; హృద్ధమనీ వ్యాధి

Coronary Vein = హృత్సిర ( గ.న )

Corrugator Supecilli = భృకుటి కండరము ( గ.న )

Cortex = బాహ్య భాగము  ( గ.న )

Costochondrtis = పార్శ్వాస్థి - మృదులాస్థి తాపము ( గ.న )

Cranial Nerve  = కపాల నాడి

Cricoid cartilage = అంగుళీయకాస్థి , ముద్రికా మృదులాస్థి ( గ.న )

Crico pharyngeal sphincter = ముద్రికా గళ నియంత్రణ కండరము ( గ.న )

Cryoprobe  = శీతల శలాక

C T Angiogram  = గణనయంత్ర త్రిదిశ ధమనీ చిత్రీకరణము ( గ.న ) / గణనయంత్ర త్రిమితీయ ధమనీ చిత్రీకరణము ( గ.న )

Deep Fascia = కండర ఆచ్ఛాదనము ( గ.న )

Deep Plantar Artery Of Dorslis Pedis Artery = నిమ్నపాద ధమని ( గ.న )

Deep Vein Thrombosis = నిమ్నసిర రక్తఘనీభవనము ( గ.న )

Deep Vein = నిమ్న సిర ( గ.న )

Defibrillator = ప్రకంపన నివారణి ( గ.న )

Degenerative Disease = శిథిల వ్యాధి

Dehydration = ఆర్ద్ర క్షీణత ( గ.న ) / శోషణము

Delerium = సన్నిపాతం, సంధి, మతిభ్రంశము ; స్మృతిభ్రంశము 

Delusion = అపస్మృతి (వ్యాధిగ్రస్థులు ఉన్నవిషయములను వేఱుగా కనుట,వినుట,ఊహించుట,తలచుట)

Depression = మానసికపు దిగులు

Deprressor Anguli  Oris = వక్త్రకోణ నిమ్న కండరము ( గ.న )

Dermatome = నాడీపాలిత చర్మవిభాగము ( గ.న )

Dermatophyte = చర్మాంకురము ( గ.న )

Descending Loop = దిగు మెలిక (  గ.న )

Detoxification = విషహరణము

Diabetes = మధుమేహ వ్యాధి 

Diagonal Branches = వక్ర శాఖలు ( గ.న )

Dialysis = రక్తశుద్ధి 

Diastole = హృదయ వికాసము ( గ.న )

Diastolic Pressure = వికాస పీడనము ( గ.న )

Diffuse Toxic Goiter =  స్రావకోద్రేక సమగళగండము ( గ.న )

Digital Artery  = అంగుళిక ధమని ( గ.న )

Digital Vein  = అంగుళిక సిర ( గ.న )

Dimorphic  = ద్విరూపి 

Diplopia = ద్విదృష్టి ( గ.న )

Direct Bilirubin = పత్యక్ష  బిలిరుబిన్ ( గ.న )

Direct Fluorescent Antibody test = ప్రత్యక్ష ప్రతిదీప్త ప్రతిరక్షక పరీక్ష ( గ.న )

Disease Sensitivity = వ్యాధి గ్రహణత ( గ.న )

Disease Specificity = వ్యాధి నిర్దిష్టత ( గ.న )

Disinfectants = వ్యాధిజనక విధ్వంసకములు ( గ.న )

Dissecting Aortic Aneurysm = బృహద్ధమని విదళన బుద్బుదము ( గ.న )

Dissecting Aortic Aneurysm = బృహద్ధమని విదళన వ్యాకోచము ( గ.న ) ;   బృహద్ధమని విదళన బుద్బుదము ( గ.న ) 

Disseminated Intravascular Coagulation = విస్తృత రక్తనాళాంతర రక్తఘనీభవనము ( గ.న )

Distillation = బట్టీపట్టుట

Diuretic  = మూత్ర ప్రేరకము ( గ.న ) ; మూత్రకారకము

Dorsal Arterial Plantar Arch = ఊర్ధ్వపాద ధమనీ చాపము ( గ.న )

Dorsal Venous Arch Of Foot = ఊర్ధ్వపాద సిరచాపము  ( గ.న )

Dorsalis Pedis Artery = ఊర్ధ్వపాద ధమని ( గ.న )

Duodenum = ప్రథమాంత్రము 

Dysarthria = పలుకు తొట్రుపాటు (గ.న), తొట్రుపలుకు (గ.న)

Dyslipidemias =   వస ( కొవ్వు పదార్థ ) విపరీతములు ( గ.న )

Dysphagia = కష్ట కబళనము ( గ.న )

Dysplasia = ప్రమాదకర కణ పరిణామము  / ప్రమాదకర కణవృద్ధి ( గ.న )

Echocardiography = హృదయ ప్రతిధ్వని చిత్రీకరణము ( గ.న )

Echogenicity = ప్రతిధ్వనిత్వము ( గ.న )

Ecthyma  = కోప వ్రణములు ( గ.న ); ఎఱ్ఱపుళ్ళు (గ.న)

Ectopic = స్థానభ్రష్టమైన, పరస్థానపు (గ.న)

Edema = నీటి ఉబ్బు (గ.న); నీటి వాపు ( గ.న )

Efferent Arteriole = నిష్క్రమణ ధమనిక  ( గ.న )

Ejection Fraction = ప్రసరణ శాతము ( గ.న )

Elastic Tissue = సాగు కణజాలము ( గ.న )

Electro Cauterization = విద్యుద్దహన చికిత్స ( గ.న )

Electro Convulsive Therapy = విద్యుత్ ప్రేరణ మూర్ఛ చికిత్స ( గ.న )

Electrocardiography = హృదయ విద్యుల్లేఖనము ; విద్యుత్ హృల్లేఖ

Electroencephalogram = మస్తిష్క విద్యల్లేఖనము ; విద్యుత్ మస్తిష్కలేఖనము ( గ.న )

Electrolytes = విద్యుద్వాహక లవణములు

Electromyography = విద్యుత్ కండరలేఖనము ( గ.న )

Emboli = రక్తప్రసరణ అవరోధకములు ( గ.న ) ; ప్రసరణ అవరోధకములు ; ప్రవాహ అవరోధకములు ( గ.న )

Embolus = ప్రసరణ అవరోధకము (గ.న); రక్తప్రసరణ అవరోధకము (గ.న)

Emphysema = ఊపిరితిత్తుల వ్యాకోచ వ్యాధి ; ఊపిరితిత్తుల ఉబ్బు ( గ.న )

Encephalitis = మెదడువాపు

End Diastolic Volume = వికాసాంతర ( రక్త ) ప్రమాణము ( గ.న )

Endocarditis  = హృదయాంతర తాపము ( గ.న )

Endocrine Disorders = వినాళగ్రంథి వ్యాధులు 

Endoscope = అంతర్దర్శిని ( గ.న )

Endoscopic Examination = అంతర్దర్శన పరీక్ష ( గ.న )

Endoscopy = అంతర్దర్శనము ( గ.న )

Endotoxin = అంతర జీవవిషము ( గ.న )

Endotracheal Tube = శ్వాసనాళాంతర ( కృత్రిమ ) నాళము ( గ.న ); ఊపిరిగొట్టము (గ.న)

Endovenous Ablation  = సిరాంతర విధ్వంసము ( గ.న )

Energy Rich Foods = శక్తిసాంద్ర ఆహారములు ( గ.న )

Envelope = కోశము

Enzyme =  జీవోత్ప్రేరకము ( గ.న )  ( జీవ + ఉత్ప్రేరకము ( Catalyst ) ( గ.న )

Eosinophilic esophagitis = ఆమ్లాకర్షణ కణ అన్ననాళ తాపము ( గ.న )

Eosinophil= ఆమ్లాకర్షణ కణము ( గ.న )

Epidemic = బహుళ వ్యాపక వ్యాధి

Epiglottis = స్వరపేటిక మూత ( గ.న )

Erythropoietin = రక్తోత్పాదిని ( గ.న )

Esophageal hiatus = అన్ననాళ రంధ్రము ( ఉదారవితానములో ) ( గ.న )

Esophageal Varices = అన్నవాహిక ఉబ్బుసిరలు ( గ.న ) ; అన్ననాళపు ఉబ్బుసిరలు ( గ.న )

Esophagitis  = అన్నవాహిక తాపము ( గ.న )

Esophago Gastroduodenoscopy =  అన్ననాళ జఠరాంత్ర దర్శనము ( గ.న )

Ethmoidal sinuses = చాలన కుహరములు (గ.న ) ; జల్లెడ గుహలు ( గ.న )

Eustachian tube = శ్రవణగళ నాళిక ( గ.న )

Exercise Electrocardiography = వ్యాయామ  హృదయ విద్యుల్లేఖనము ( గ.న )

Exercise Stress Testing  = వ్యాయామపు ఒత్తిడి పరీక్ష గ.న )

Exophthalmos = వెలిగుడ్లు ( గ.న ) 

External Carotid Artery = బాహ్య కంఠ ధమని ( గ.న )

External Ileac Artery = బాహ్య శ్రోణిధమని 

External Ileac Vein = బాహ్య శ్రోణిసిర ( గ.న )

Extrinsic Factor = బాహ్యాంశము ( విటమిన్ B12 ) ( గ.న )

Eye Patch = కనుకప్పు ( గ.న )

Facial ( Nerve ) Canal = ముఖనాడి అస్థినాళము ( గ.న )

Facial Muscles = ముఖ కండరములు

Facial Nerve = ముఖనాడి

Facial Paralysis = ముఖ పక్షవాతము ( గ.న )

False Positive Results = తప్పుడు అనుకూల ఫలితములు ( గ.న )

Fascia = కండరాచ్ఛాదనము ( గ.న )

Fatty Acid = వసామ్లము; కొవ్వు ఆమ్లము

Fatty Liver Disease = కాలేయపు కొవ్వు ( వస ) వ్యాధి ( గ.న )

Fecal-Oral Route = పురీష వదన మార్గము ( గ.న )

Feed Back = ప్రతివర్తమానము ( గ.న )

Femoral Artery =  ఊరు ధమని ( గ.న )(ఊరువు = తొడ )

Femoral Vein  = ఊరు సిర 

Fibrin = తాంతవము 

Fibrinogen = తాంతవజని 

Fibroblasts = తంతుకణము ; పీచుకణము ( గ.న )

Fibrosis = తంతీకరణము

Fibrous Tissue = పీచుకణజాలము ( గ.న ) , తంతుకణజాలము

Fistula = వ్రణ నాళము , కుహరాంతర నాళము ( గ.న ), సంధి నాళము ( గ.న)

Flexible endoscope = నమన అంతర్దర్శిని (గ.న)

Fluid Overload = ద్రవ భారము ( గ.న )

Foam Cell = ఫేన కణము (గ.న )

Forced Expiration = సత్వర సుదీర్ఘ నిశ్వాసము (గ.న )

Forced Expiratory Volume- 1= బలనిశ్వాస వాయుపరిమాణము-1 ( మొదటి సెకండులో బలముగా వదల గలిగే గాలి పరిమాణము - గ.న )

Forced Inspiration = సుదీర్ఘ సంపూర్ణ ఉచ్ఛ్వాసము ( గ.న )

Forced Vital Capacity = ( సంపూర్ణ ) శ్వాస ప్రమాణము ( గ.న )

Fractures Of Bone = అస్థి భంగము, ఎముక విఱుగుడు

Frontal Lobe = ( మస్తిష్క ) లలాట భాగము ( గ.న )

Frontal sinuses = లలాట కుహరములు ( గ.న )

Fungal Infection = శిలీంధ్ర వ్యాధి

Fungal Spore = శిలీంధ్ర బీజము

Fungus = శిలీంధ్రము

Furuncle = సెగగడ్డ

Gastrectomy = జఠర ఖండనము ( గ.న )

Gastric Atrophy = జఠర క్షయము ( గ.న )

Gastric Balloon = కడుపు బుడగ ( గ.న ) ; జఠర బుద్బుదము ( గ.న )

Gastric Banding = జఠర బంధన చికిత్స  ( గ.న )

Gastric Resection = జఠర ఛేదనము ( గ.న )

Gastritis = జఠర తాపము , జీర్ణాశయ తాపము (గ.న )

Gastro Jejunal Anastomoses / Gastro-Jejunostomy = జఠరాంత్ర సంధానము ( గ.న )

Gastrointestinal Disorders = జీర్ణమండల వ్యాధులు 

Gastroscope = జఠరాంతర దర్శిని ( గ.న )

Gastroscopy = జఠరాంతర దర్శనము, ( గ.న )

Gene = జన్యువు

Genetic Disorder  = జన్యు సంబంధ వ్యాధి

Genetic Mutation  = జన్యువుల మార్పు ; జన్యు పరివర్తనము ( గ.న )

Genome = జన్యు పదార్థము ( గ.న )

Gestational Diabetes = గర్భిణీ మధుమేహము  

Glomerular Disease =  ( మూత్రాంగ ) కేశనాళికా గుచ్ఛవ్యాధి ( గ.న )

Glomerular Filtration Rate =  కేశనాళికా గుచ్ఛముల వడపోత ప్రమాణము ( గ.న )

Glomerulonephritis = కేశనాళికా గుచ్ఛతాపము ( గ.న )

Glomerulus =  మూత్రాంక కేశనాళికా గుచ్ఛము ( గ.న )

Gloves = చేదొడుగులు

Gluconeogenesis = శర్కర నవజాతము (గ.న )

Glucose Intolerance = శర్కర అసహనము ( గ.న )

Glycemic Index = (రక్తపు) చక్కెర సూచిక ; శర్కర సూచిక ( గ.న )

Glycogenesis = మధుజని జాతము (గ.న )

Glycogenolysis = మధుజని విచ్ఛిన్నము (గ.న )

Glycoprotein = శర్కర మాంసకృత్తి ( గ.న )

Goblet cells = చషక కణాలు (గ.న) ; గిన్నెకణాలు (గ.న)

Goitre = గలగండము

Granules =  కణిక ; రేణువు

Granulocyte = కణికల కణము ( గ.న ) ; రేణుకణము ( గ.న )

Granulocytic leukemia = రేణుశ్వేతకణ బాహుళ్యవ్యాధి ( గ.న )- ( సత్వర ( acute ) & దీర్ఘకాలిక ( chronic )

Great Saphenous Vein  = గరిష్ఠ దృశ్యసిర ( గ.న )

Growth Hormone  = ప్రవర్ధన స్రావకము ( గ.న )

Hair Follicle = రోమ కూపము

Hallucinations = మానసిక విభ్రాంతి (వ్యాధిగ్రస్థులలో లేనివి కనిపించుట, లేని ధ్వనులు వినిపించుట, లేని విషయములు స్ఫురించుట)

Heart Attack  ( Myocardial Infarction ) =  హృదయ ఘాతము ( గ.న ) ;  గుండెపోటు

Heat Edema = వడపొంగు ( గ.న )

Heat Exhaustion = వడ బడలిక ( గ.న )

Heat Rash = చెమట కాయలు ; చెమట పొక్కులు ; ఉష్ణ విస్ఫోటనము ( గ.న )

Heat Stroke = ఉష్ణఘాతము ( గ.న ) ; వడదెబ్బ

Heat Syncope =  వడసొమ్మ ( గ.న )

Hematemesis = రక్త వమనము 

Hematocrit =  రక్త (కణ ) సాంద్రత ( గ.న )

Hematoma = కణజాలపు నెత్తురుగడ్డ ( గ.న )

Hematopoietic Disorders = రక్తోత్పాదన వ్యాధులు ( గ.న )

Hemianopsia = అర్ధాంధత్వము ( గ.న ) ; సగం చూపు ; సగం చీఁకు ( గ.న )

Hemochromatosis =  అయ ( ఇనుము ) వర్ణకవ్యాధి ( గ.న )

Hemodialysis = రక్తశుద్ధి

Hemolysis = రక్తకణ విచ్ఛేదనము ( గ.న )

Hemolytic /Prehepatic Jaundice = రక్తకణ విచ్ఛేదనపు / కాలేయ పూర్వపు కామెరలు ( గ.న )

Hemolytic Anaemias = రక్తవిచ్ఛేదన రక్తహీనము ( గ.న )

Hemoptysis  = రక్తశ్లేష్మము (గ.న);  రక్త కఫము ( గ.న )

Hemorrhage = రక్తస్రావము 

Hemostasis = రక్తస్రావ నివారణము ( గ.న ) ; రక్త స్థిరత్వము ( గ.న )

Hepatic / Hepatocellular Jaundice = కాలేయపు కామెరలు ( గ.న )

Hepatic Elastography = కాలేయ స్థితిస్థాపకత చిత్రీకరణ ( గ.న )

Hepatic Encephalopathy = కాలేయ మతిభ్రంశము ( గ.న )

Hepatic Vein = కాలేయ సిర 

Hepatitis = కాలేయ తాపము ( గ.న )

Hepatorenal Syndrome  = కాలేయ మూత్రాంగవైఫల్యము ( గ.న )

Hereditary Spherocytosis = వంశపారంపర్య గోళకణ వ్యాధి ( గ.న ) ; వంశపారంపర్య గోళాకార కణ వ్యాధి ( గ.న )

Hernia = అవయవ భ్రంశము ; అవయవ గళనము ( గ.న )

Herpes Zoster = అగ్గిచప్పి / అగ్నిసర్పి / ఒడ్డాణపు చప్పి ( గ.న ) / మేఖల విసర్పణి (గ.న ) 

Hiatal hernia = రంధ్ర ( అవయవ ) గళనము ( గ.న )

High Density Lipoproteins = అధికసాంద్రపు లైపోప్రోటీనులు ( గ.న )

High Output  Failure  = అధిక ప్రసరణ వైఫల్యము ( గ.న )

Hip = తుంటి ఎముక

Histamine -2 Receptor Blockers = హిస్టమిన్ - 2 గ్రాహక అవరోధకములు ( గ.న ) /  హిష్టమిన్ గ్రాహక అవరోధకములు ( గ.న )

Hormones = నిర్నాళ రసములు ; వినాళ స్రావకములు 

Humidifier = ఆర్ద్ర సాధనము ( గ.న )

Humoral Immunity = స్రావక రక్షణ ( గ.న )

Hydrocephalus = జలశీర్షము , జలశిరస్సు ( గ.న )

Hydrochloric Acid = ఉదజహరికామ్లము 

Hydrolysis =  జల విచ్ఛేదన 

Hydronephrosis = జల మూత్రాంగము ( గ.న )

Hydrophilic = జలాపేక్షక 

Hydrophobia = జలభయము ; కుక్కకాటు వెఱ్ఱి

Hydrophobic = జలవికర్షణ 

Hyoid bone = కంఠికాస్థి

Hyper Coagulability =  అధిక ( శీఘ్ర ) రక్త ఘనీభవన లక్షణము ( గ.న )

Hyperparathyroidism = సహగళగ్రంథి ఆధిక్యత ( గ.న )

Hypersplenism  = ప్లీహ ఉద్రేకము ( ప్లీహోద్రేకము ) ; ప్లీహాతిశయము ( గ.న )

Hypertension = అధిక రక్తపీడనము ; అధిక రక్తపు పోటు 

Hypertensive Crisis = అధిక రక్తపీడన సంక్షోభము ( గ.న )

Hyperthermia = తీవ్ర జ్వరము ( గ.న )

Hyperthyroidism = గళగ్రంథి ఆధిక్యత ( గ.న )

Hypertrophic Cardiomyopathy  = హృదయకండర అతివృద్ధివ్యాధి  ( గ.న )

Hyperventilation = అధిక శ్వాసలు (గ.న)

Hyphae = శిలీంధ్రపు పోగులు (గ.న)

Hypoglycemia = శర్కర హీనత ( గ.న )

Hypogonadism = బీజగ్రంథుల హీనత 

Hypopharynx = అధోగళము ( గ.న )

Hypopigmentation = వర్ణ హీనత ( గ.న )

Hypotension = రక్తపీడన హీనత ( గ.న ) ; అల్ప రక్తపీడనము ( గ.న )

Hypothyroidism = గళగ్రంథి హీనత ( గ.న )

Hypovolemia = ద్రవపరిమాణ హీనత ( గ.న ) /  రక్తప్రమాణ హీనత ( గ.న )

Hypoxia = ప్రాణవాయువు హీనత; ఆమ్లజని హీనత (గ.న)

Iatrogenic = చికిత్సా జనితము ( గ.న )

Icosahedron = వింశతిఫలకము

Ileac Artery = శ్రోణి ధమని

Ileum = శేషాంత్రము 

Illusion = మిథ్యాస్మృతి (ఉన్నవి, జరుతున్న విషయములు అందఱికీ కూడా వేఱొక విధముగా స్ఫురించుట. ఉదా: ఎండమావులు, సూర్యుడు భూమి చుట్టూ తిరుగునట్లు తోచుట, వాహనములో పోవునపుడు బయట వస్తువులు చలించునట్లు కనిపించుట, మాంత్రిక విద్యలు.

Immune System =  దేహ రక్షణవ్యవస్థ ( గ.న )

Immunoglobulin = రక్షక మాంసకృత్తి ( గ.న )

Immunological System = శరీర రక్షణవ్యవస్థ ( గ.న )

Immunotherapy = ప్రతిరక్షిత చికిత్స ( గ.న )

Impetigo = అంటు పెచ్చులు ( గ.న )

Incubation Period = అంతర్గతస్థితి కాలము, అగోచరస్థితి,  మఱుగుపాటు కాలము ( గ.న )

Indian Childhood Cirrhosis = భారతీయ శిశు నారంగ కాలేయవ్యాధి ( గ.న )

Indirect Bilirubin = పరోక్ష బిలిరుబిన్  ( గ.న )

Induration = కణజాలపు గట్టితనము 

Infarction  = ప్రసరణరహిత మరణము ( గ.న )

Infection = సూక్ష్మజీవులదాడి (గ.న) , సూక్ష్మజీవుల  ఆక్రమణ ( దాడి ) ( గ.న )

Infestation  = ఆక్రమిత వ్యాధి ( గ.న )

Inferior Venacava = అధోబృహత్సిరర

Influenza = వ్యాపక జ్వరము ( గ.న )

Inhaler = పీల్పువు ( గ.న )

Inter Ventricular Septum = జఠరికాంతర కుడ్యము ( గ.న ) జఠరికల నడిమి గోడ ( గ.న )

Intermediate Artery = మధ్యస్థ ధమని ( గ.న )శ

Intermediate Density Lipoproteins = అల్పతర సాంద్ర లైపో ప్రోటీనులు (గ.న )

Intermittent Claudication  = సవిరామపు పోటు ( గ.న )

Intermittent Pneumatic Compression Devices = సవిరామ వాయుపీడన సాధనములు ( గ.న )

Internal Auditory Meatus =  అంతర శ్రవణరంధ్రము ( గ.న )

Internal Capsule = ఆంతర గుళిక ( గ.న )

Internal Carotid Artery = అంతర కంఠధమని (గ.న )

Internal Ileac Vein = అంతర శ్రోణిసిర ( గ.న )

Internal Mammary Artery = అంతర స్తనధమని ( గ.న )

Internal ileac Artery = అంతర శ్రోణి ధమని

Interosseous membrane = రెండు ఎముకల నడిమి పొర (గ.న)

Intertriginous Tinea Pedis = అంగుళాంతరశిలీంధ్ర వ్యాధి ( గ.న )

Intestinal metaplasia = ఆంత్ర పరిణామము ( గ.న )

Intima = రక్తనాళపు లోపొర  ( గ.న )

Intracranial Pressure = కపాలాంతర పీడనము ( గ.న )

Intraparenchymal Hemorrhage = కణజాలాంతర రక్తస్రావము  ( గ.న )

Intravenous Drugs = సిరాంతర ఔషధములు ( గ.న )

Intrinsic Factor = అంతరాంశము ( గ.న )

Invasive Procedures = ఆక్రమణ ప్రక్రియలు ( గ.న )

Ischemia = రక్తప్రసరణ లోపము ( గ.న )

Ischemic Heart Disease= హృదయ రక్తప్రసరణ లోపవ్యాధి ( గ.న )

Jaundice = పచ్చకామెర్లు , కామెర్లు , పసరికలు  

Jejunum = మధ్యాంత్రము 

Keratitis = స్వచ్ఛపటల తాపము ( గ.న )

Kerions =  శిలీంధ్ర రోమకూప వ్రణములు ( గ.న )

Kidneys = మూత్రాంగములు   ( గ.న )

Kyphosis = గూని 

Laparoscopy = ఉదరకుహర దర్శనము ( గ.న ) 

Laryngeal Edema = గొంతుకోవి పొంగు (గ.న); స్వరపేటిక పొంగు ( గ.న )

Laryngeal Spasm = స్వరపేటిక బిగుతు ( గ.న )

Lateral Plantar Artery = పార్శ్వ పాదతల ధమని( గ.న )

Lateral Sulcus = పార్శ్వగర్తము ( గ.న )

Left Anterior Descending Artery = వామ పూర్వ అవరోహణ ధమని ( గ.న )

Left Circumflex Artery = వామ పరిభ్రమణ ధమని ( గ.న )

Left Coronary Artery = వామ హృద్ధమని ( గ.న )

Left Ventricular Ejection Fraction = ఎడమ జఠరిక ( రక్త ) ప్రసరణశాతము ( గ.న )

Lesser Saphenous Vein = కనిష్ఠ దృశ్యసిర ( గ.న )

Leukocytes = తెల్లకణములు

Leukemia = శ్వేతకణ బాహుళ్యవ్యాధి ( గ.న ) ; శ్వేతకణీయము ( గ.న )

Levator Labii Superioris = అధర ఉద్ధరణ కండరము ; ఊర్ధ్వ అధరోద్ధరణ కండరము ( గ.న )

Life jacket = ప్రాణకవచము (గ.న)

Life Styles  = జీవనరీతులు ( గ.న )

Lining Cells = పూత కణములు ( గ.న )

Liver = కాలేయము 

Liver Enzymes = కాలేయ జీవోత్ప్రేరకములు ( గ.న )

Liver Function Tests = కాలేయ వ్యాపార పరీక్షలు

Liver Transplantation = పరకాలేయ దానము ( గ.న )

Living drug =సజీవౌషధము

Low Density Lipoproteins = అల్పసాంద్రపు కొలెష్టరాలు ( గ.న ) / అల్పసాంద్రపు లైపోప్రోటీనులు ( గ.న )

Lower Motor Neuron Paralysis = అధశ్చలన నాడీ పక్షవాతము ( గ.న )

Lower Motor Neurons   = అధశ్చలన నాడీకణములు ( గ.న )

Lymph Gland  / Lymph Node = రసిగ్రంథి

Lymphatic Channels = రసినాళికలు ( గ.న )

Lymphocytes = రసి కణములు ( గ.న )

Lymphocytic leukemia = రసికణ బాహుళ్యవ్యాధి ( గ.న )

Lypolysis = మద విచ్ఛిన్నము ( గ.న )

Macrocytes = పృథుకణములు

Macrocytosis = పృథు కణత్వము ( గ.న )

Macrophages = పృథు భక్షకకణములు ( గ.న )

Magnetic Resonance Angiogram = అయస్కాంత ప్రతిధ్వని ధమనీ చిత్రీకరణము ( గ.న )

Magnetic Resonance Imaging = అయస్కాంత ప్రతిధ్వని చిత్రీకరణము ( గ.న ) /  అయస్కాంత ప్రతినాద చిత్రీకరణ ( గ.న )

Magnetic Resonance Perfusion Imaging = అయస్కాంత ప్రతిధ్వని ( హృదయ ) ప్రసరణ చిత్రీకరణములు ( గ.న )

Major Depression = పెను దిగులు ( గ.న )

Malaise = నలత  ( గ.న )

Mammogram = స్తన చిత్రీకరణము ( గ.న )

Mandibular Nerve = అధోహనువు నాడి (గ.న )

Mania = ఉన్మాదపు పొంగు ( గ.న )

Manometry = పీడన పర్యవేక్షణ ; పీడన చిత్రీకరణము ( గ.న )

Masks = కప్పులు ; ఆచ్ఛాదనములు

Mastocytes / Mast cells =  స్తంభ కణములు ( గ.న )

Mastocytosis = స్తంభకణ వ్యాధి ( గ.న )

Matrix = మాతృక 

Maxillary Nerve = హనువు నాడి ( గ.న )

Maxillary sinuses = హనుకుహరములు ( గ.న )

Medial Plantar Artery = మధ్యస్థ పాదతల ధమని ( గ.న )

Medially = మధ్యస్థముగా 

Medulla = అంతర్భాగము ( గ.న )

Melena = నల్ల విరేచనములు ( జీర్ణమండలములో రక్తస్రావము జరిగి రక్తము నల్లరంగుని పొందుట వలన కలుగుతాయి ) ( గ.న )

Membrane Attack Complexes (Macs) = కణవేష్టన ఆక్రమణ వ్యవస్థలు ( గ.న )

Memory Cells = జ్ఞాపక కణములు ( గ.న )

Meningitis = నాడీమండల ( మస్తిష్క )  వేష్టన తాప వ్యాధి (గ.న )

Mental Depression =   మానసికపు క్రుంగు ; మానసికపు కుంగు ( గ.న )

Mentalis = చిబుక కండరము ( గ.న )

Metabolic Acidosis = జీవ వ్యాపార ఆమ్లీకృతము ( గ.న )

Metabolism = జీవక్రియ ; జీవ వ్యాపారము ( గ.న )

Metastasis = అవయవాంతర వ్యాప్తి ( గ.న )

Metatarsal Artery ,( Or ) Arcuate Artery = మధ్యపాద ధమని శాఖ ( గ.న )

Microbiology  = సూక్ష్మజీవుల శాస్త్రము 

Microcyte = లఘుకణము, సూక్ష్మకణము (గ.న )

Microcytosis = లఘు కణత్వము ( గ.న ), సూక్ష్మకణత్వము ( గ.న )

Middle Cerebral Artery = మధ్య మస్తిష్క ధమని ( గ.న )

Minor Depression = చిన్న కుంగు ; చిన్న దిగులు ( గ.న )

Mitral Regurgitation = ద్విపత్రకవాట తిరోగమన ప్రసరణము  ( గ.న )

Moisturizers = ఆర్ద్ర ఔషధములు ( గ.న )

Monoclonal Antibody = ఏకరూపక ప్రతిరక్షకము ( గ.న )

Monocytes = ఏక కణములు ( గ.న )

Monosaccharides = ఏక శర్కరలు ( గ.న )

Mood Disorders = మానసికస్థితి వైపరీత్యములు ( గ.న )

Motor Cortex  =. చలన వల్కలము ( గ.న )

Mucosa =  శ్లేష్మపు పొర

Multinodular Goiter  = బహుళకిణ గళగండము (గ.న )

Murmurs = మర్మర శబ్దములు ( గ.న )

Muscle Relaxants = కండర విశ్రామకములు ( గ.న )

Myocardial Infarction = గుండెపోటు / హృదయ ఘాతము ( గ.న )

Myocardial Perfusion Defects  = హృదయ కండర ప్రసరణ లోపములు ( గ.న )

Myocardial Perfusion Imaging = హృదయ ప్రసరణ  చిత్రీకరణము (గ.న )

Myocarditis = హృదయ కండర తాపము ( గ.న )

Nail Bed = నఖక్షేత్రము ( గ.న )

Nasal Decongestants = నాసికా నిస్సాంద్రకములు ( గ.న )

Nasal Sinuses = నాసికా కుహరములు ( గ.న )

Nasal Turbinates ; Nasal Conchae = నాసికాశుక్తులు ( గ.న )

Nasogastric Tube = నాసికా జఠరనాళము ( గ.న )

Nasolabial Fold = నాసికాధర వళి ( గ.న )

Nasopharynx = నాసికాగళము ( గ.న )

Nausea =  వమన (వాంతి) భావన ( గ.న ) ; డోకు

Nebulizer = శీకర యంత్రము ( గ.న )

Neoplasm = కొత్త పెరుగుదల

Nephron = మూత్రాంకము  ( గ.న )

Nephrotoxins  = మూత్రాంగ విషములు ( గ.న )

Nervous System = నాడీమండలము

Neuralgia = నాడీ వ్యథ ( గ.న )

Neuritis = నాడీతాపము ( గ.న )

Neuromuscular Junction. = నాడీతంతు కండర సంధానము ( గ..న )

Neuron = నాడీ కణము

Neurotransmitters = నాడీ ప్రసరిణులు

Neutrophils = తటస్థ కణములు ( గ.న )

Nodule = కణితి

Non Granulocytes = కణికరహిత కణములు ( గ.న )

Nonalcoholic Steatohepatitis = మద్యేతర వస కాలేయతాపము ( గ. న )

Normocytosis = సామాన్య కణత్వము ( గ.న )

Nystagmus = నేత్ర కంపనము , కనుగుడ్ల వణకు ( గ.న )

Obesity = స్థూలకాయము

Obstructive Jaundice / Post Hepatic Jaundice = అవరోధపు కామెరలు / కాలేయానంతరపు కామెరలు ( గ.న )

Obstructive Lung Disease = అవరోధక పుపుస వ్యాధి ( గ.న )

Obstructive Sleep Apnea = నిద్ర అవరోధక శ్వాసభంగము ( గ.న ) /  నిద్రావరోధక శ్వాసభంగము ( గ.న )/ నిద్రలో శ్వాసభంగములు

Occipital Lobe = ( మస్తిష్క ) పృష్ఠ భాగము ( గ.న )

Occipito-Frontalis Muscle = పృష్టశిర లలాట కండరము ( గ.న )

Occupational Therapy = వృత్తి చికిత్స  

Oligomenorrhea  =  మంద ఋతుస్రావము ( గ.న )

Opthalmic Nerve = నేత్రకుహర నాడి ( గ.న )

Orbicularis Oculi = నేత్రమండలిక కండరములు (గ.న )

Orbit = నేత్రకుహరము ( గ.న )

Organ transplantation = పర అవయవ దానము ( గ.న )

Oropharynx = వక్త్రగళము ( గ.న )

Osteitis Fibrosa Cystica = తంతు బుద్బుద అస్థివ్యాధి ( గ.న )

Osteoblasts  = అస్థినిర్మాణ కణములు ( గ.న )

Osteoclasts = అస్థిశిథిల కణములు ( గ.న )

Osteonecrosis = అస్థి నిర్జీవత ( గ.న )

Osteopenia  = ఎముకల బలహీనత (గ.న )

Osteoporosis = గుల్ల ఎముకలజబ్బు ; అస్థి సాంద్ర క్షీణత ( గ.న )

Otitis Media = మధ్య చెవి తాపము ( గ.న ) మధ్య కర్ణ తాపము ( గ.న )

Over Weight = అధిక భారము ( గ.న )

Overt Hypothyroidism = విదిత గళగ్రంథి హీనత ( గ.న )

Oxidation = ఆమ్లజనీకరణము

Oxygen Carrying Capacity = ప్రాణవాయు వాహక సామర్థ్యత ( గ.న )

Oxygen Saturation =  ప్రాణవాయు (వు) సంతృప్తత 

Oxygenation = ఆమ్లజనీకృతము ( గ.న )

Palate = తాలువు ; అంగిలి

Palliative Care = ఉపశమన చికిత్స

Palmar Aponeurosis ( Fascia ) = అరచేతి  కండర ఆచ్ఛాదనము ( గ.న )

Pancreatitis = క్లోమ తాపము ( గ.న )

Pandemic = విశ్వవ్యాపక వ్యాధి ( గ.న )

Papilloedema  = కనుబింబపు పొంగు ( గ.న )

Papules = గట్టి పొక్కులు ( గ.న ) ( వీటిలో ద్రవము ఉండదు )

Paralysis = పక్షవాతము

Paranasal Sinuses = నాసికా కుహరములు ( గ.న )

Paranoid Behavior = సంశయ ప్రవర్తన ( గ.న )

Parasite  = పరాన్నభుక్కు

Parasympathetic Nervous System = పరానుభూత నాడీ వ్యవస్థ

Parathyroid Glands  = సహగళ గ్రంథులు ( గ.న )

Parathyroid Hormone = సహగళగ్రంథి స్రావకము ( గ.న )

Parenteral Route = ఆంత్రేతర మార్గము ( గ.న )

Parietal Lobe = ( మస్తిష్క ) పార్శ్వభాగము ( గ.న )

Parotid Salivary Gland = శ్రవణమూల లాలాజలగ్రంథి ( గ.న )

Paroxysmal Nocturnal Hemoglobinuria ( Pnh ) = సంవిరామ నిశా రక్తమూత్రము ( గ.న )

Partial Gastrectomy = పాక్షిక జఠర విచ్ఛేదన ( గ.న )

Passive immunity =  అచేతన ( జడ ) రక్షణ ( గ.న )

Pathogen =  వ్యాధి కారకము , రోగ జనకము ; వ్యాధి జనకము ( గ.న )

Pathology = వ్యాధివిజ్ఞాన శాస్త్రము

Peak Bone Mass = గరిష్ఠ అస్థిరాశి ( గ.న )

Peak AirFlow = గరిష్ఠ వాయు ప్రవాహము (గ.న )

Peak Flow Meter = గరిష్ఠ ( శ్వాస ) ప్రవాహ మానిక ( గ.న )

Peau D’ Orange = నారంగ చర్మము ( గ.న )

Peptic Ulcer = జీర్ణ వ్రణము ( గ.న )

Perforator Vein = ఛిద్ర సిర ( గ.న )

Perfusion Defect = ప్రసరణ లోపము ( గ.న )

Pericardial Constriction = హృత్కోశ ఆకుంచనము ( గ.న )

Pericardial Effusion = జల హృత్కోశము ( గ.న )

Pericarditis = హృత్కోశ తాపము ( గ.న ) /  హృదయవేష్టన తాపము ( గ.న )

Peripheral Arterial Disease = దూర ధమని వ్యాధి ( గ.న )

Peripheral Nervous System = వికేంద్ర నాడీమండలము 

Peripheral Neuritis = దూరనాడుల తాపము ( గ.న )

Peripheral Vasodilation = దూర రక్తనాళ వ్యాకోచము ( గ.న )

Peristalsis = మృదుకండర చలనము ( గ.న )

Peritoneal Dialysis = ఉదర వేష్టన రక్తశుద్ధి ( గ.న )

Peritonitis = ఉదర ( ఆంత్ర ) వేష్టన తాపము  ( గ.న )

Pernicious Anaemia = ప్రమాదకర రక్తహీనత ( గ.న ); ప్రమాద పాండురోగము (గ.న)

Phagocyte = భక్షకకణము

Pharmacology = ఔషధ శాస్త్రము

Pharynx = గళము ; గొంతు ; సప్తపథ 

Physical Therapy = వ్యాయామ చికిత్స ( గ.న )

Physiology = శరీరవ్యాపార శాస్త్రము 

Pituitary Gland = పీనస గ్రంథి

Plantar Arterial Arch = పాదతల ధమనీ చాపము ( గ.న )

Plaque  = ఫలక

Plasma = రక్తద్రవము ( గ.న )

Plasma Cell = స్రావక కణము ( గ.న )

Plasma= రక్త ద్రవము ( గ.న )

Plasmapheresis = రక్తద్రవ గ్రహణము ( గ.న )

Platelets  = ( రక్త ) సూక్ష్మఫలకములు   ( గ.న )

Pleural Diseases = పుపుసవేష్టన వ్యాధులు 

Pluripotent Stem Cells = బహుళ సామర్థ్య మూలకణములు ( గ.న )

Pneumonitis  = ఊపిరితిత్తుల తాపము ( గ.న ) / పుపుస తాపము ( గ.న ) / శ్వాసకోశ తాపము ( గ.న )

Pneumothorax  = పుపుసవేష్టన వాయువు ( గ.న )

Polpliteal Artery = జాను ధమని ( గ.న )

Polycystic Kidney Disease = బహుళ బుద్బుద మూత్రాంగ వ్యాధి ( గ.న )

Polycythemia Vera  = బహుళ రక్తకణ వ్యాధి ( గ.న ) ; రక్తకణ బాహుళ్యవ్యాధి ( గ.న )

Polysaccharide = బహుళ శర్కర ; సంకీర్ణ శర్కర ( గ.న )

Polysomnogram = బహుళాంశ నిద్రలేఖనము ( గ.న )

Pons =  మస్తిష్క వారధి ( గ.న ) / నాడీసేతువు ( గ.న ) నాడీ వారధి ( గ.న )

Popliteal Vein = జాను సిర ( గ.న )

Portal Vein = ద్వారసిర ( గ.న )

Porto Hepatic Shunt =   ద్వారసిర - కాలేయసిర సంధానము ( గ.న )

Posterior Cerebral Artery = పృష్ఠ మస్తిష్క ధమని ( గ.న )

Posterior Communicating Artery = పృష్ఠ సంధాన ధమని ( గ.న )

Posterior Descending Artery = పర అవరోహణధమని ( గ.న )

Posterior Inter Ventricular Sulcus = పర జఠరికాంతర గర్తము ( గ.న )

Posterior nares = పర నాసికారంధ్రములు ( గ.న )

Posterior Tibial Vein = పృష్ఠజంఘిక సిర ( గ.న )

Posterior Tibilal Artery = పృష్ఠ జంఘిక ధమని ( గ.న )

Postural Hypotension = స్థితి సంబంధ అల్పపీడనము ; స్థితి జనిత అల్పపీడనము ( గ.న )

Primary Biliary Cirrhosis = ప్రాథమిక పైత్య నారంగవ్యాధి ( గ.న )

Primary Hemostasis  = ప్రాథమిక రక్త స్థిరత్వము ( గ.న )

Profunda Femoris Artery = నిమ్నోరు ధమని ( గ.న )

Proteinases = మాంసకృత్తు విచ్ఛేదనములు ( గ.న )

Proton Pump Inhibitors = ప్రోటాను యంత్ర అవరోధకములు ( గ.న ) ; ఆమ్లయంత్ర అవరోధకములు ( గ.న ) /  ఆమ్లయంత్ర నిరోధకములు ( గ.న )

Pseudo stratified = మిధ్యాస్తరితం (గ.న)

Psychomotor Retardation =  మానసిక చలన మాంద్యము ( గ.న )

Pulmonary Arterial Embolism = పుపుసధమని అవరోధకము ( గ.న )

Pulmonary Artery = పుపుస ధమని

Pulmonary Diseases = శ్వాసకోశ వ్యాధులు, ఊపిరితిత్తుల జబ్బులు

Pulmonary Edema = ఊపిరితిత్తుల నీటి ఉబ్బు  ( గ.న )

Pulmonary Fibrosis  = పుపుస తంతీకరణము (గ.న )

Pulmonary Function Test = శ్వాస వ్యాపార పరీక్ష (గ.న )

Pulmonary Valve = పుపుస కవాటము 

Pulmonary Vein = పుపుస సిర

Pulse Therapy = విరామ చికిత్స ( గ.న ) ; విశ్రాంత చికిత్స ( గ.న )

Pustules = చీముపొక్కులు ( గ.న )

Pyloric Stenosis = జఠర నిర్గమబంధము ( గ.న )

Pylorus = జఠర అధోద్వారము

Rabies = రభస వ్యాధి ( గ.న )

Radial Artery = ముంజేతి బహిర్ధమని ( గ.న )

Radiation = వికిరణము 

Radiation Therapy  =  వికిరణ చికిత్స ( గ.న )

Radioactive Iodine = రేడియోధార్మిక అయొడిన్ 

Rash = విస్ఫోటము

Reabsorption = పునర్గ్రహణము (గ.న )

Recall Immunity = స్ఫురణ రక్షణ ( గ.న )

Receptor Agonist = గ్రాహక ఉత్తేజకము (గ.న )

Receptor Blocker = గ్రాహక అవరోధకము ( గ.న )

Regurgitation = తిరోగమన ప్రసరణ ( గ.న )

Renal Artery = మూత్రాంగ ధమని   ( గ.న )

Renal Calculus = మూత్రాంగ శిల ( గ.న )

Renal Corpuscle = మూత్రముకుళము ( గ.న ), మూత్రాంకముకుళము (గ.న)

Renal Disorders = మూత్రాంగ వ్యాధులు ( గ.న )

Renal Pelvis = మూత్ర కుండిక ( గ.న ); మూత్ర పాళియ   ( గ.న ) 

Renal Replacement Therapy = మూత్రాంగ ప్రత్యామ్నాయ చికిత్స ( గ.న )

Renal Transplantation = పర మూత్రాంగ దానము ( గ.న )

Renal Tubule = మూత్రనాళిక  ( గ.న ), మూత్రాంకనాళిక (గ.న)

Renal Vein = మూత్రాంగ సిర ( గ.న )

Respiratory Acidosis = శ్వాస వ్యాపార ఆమ్లీకృతము ( గ.న )

Respiratory Failure = శ్వాస వైఫల్యము ( గ.న )

Restrictive Lung Disease = నిర్బంధ పుపుస వ్యాధి ( గ.న )

Reticulocyte = జాలిక కణము ( గ.న )

Revascularisation = రక్తప్రసరణ పునరుద్ధరణ ( గ.న )

Revascularization Procedures = ధమనీ పునరుద్ధరణ చికిత్సలు ( గ.న )

Rhabdomyolysis = అస్థి కండరకణ విచ్ఛేదనము ( గ.న ) / అస్థికండర కణ విధ్వంసము ( గ.న )

Right Coronary Artery = దక్షిణ హృద్ధమని ( గ.న )

Right Marginal Artery = కుడి మేర ధమని (గ.న )

Rods = కోలలు 

Sanitizer = శుద్ధి పదార్థము

Saphenous Orifice  = దృశ్యసిర రంధ్రము ( గ.న )

Saphenous Vein = దృశ్య సిర ( గ.న )

Scales = పొలుసులు

Sclera = శ్వేతపటలము 

Sclerosing Agents = తంతీకరణ రసాయనకములు ( గ.న )

Scoliosis =  పక్క గూనె ; పక్క వంకరలు 

Screening Tests = శోధన పరీక్షలు ( గ.న )

Seasonal Allergy  = ఋతు అసహనము ( గ.న )

Secondary Hemostasis  = ద్వితీయ రక్త స్థిరత్వము ( గ.న )

Sensitivity =  సూక్ష్మ గ్రహణము ( గ.న )

Sensory Cortex = జ్ఞాన వల్కలము ( గ.న )

Sensory Loss = స్పర్శ నష్టము  ( గ.న )

Sepsis  = సూక్షజీవ విషమయము ( గ.న )

Septal Branches = కుడ్య శాఖలు ( గ.న )

Septal Defects = విభాజక లోపములు ( గ.న )

Shingles , Herpes Zoster = అగ్గిచప్పి / అగ్నిసర్పి /  మేఖల విసర్పిణి ( గ.న ) ; ఒడ్డాణపు చప్పి ( గ.న )

Shock = అఘాతము 

Sickle Cell Anemia = లవిత్రకణ రక్తహీనత ( గ.న )

Sickle Cell Disease = లవిత్రకణ వ్యాధి ( గ.న )

Signs Of Inflammation = తాప లక్షణములు ( గ.న )

Sinusitis = నాసికాకుహర తాపము ( గ.న )

Smooth Muscle = మృదు కండరము (గ.న )

Squamous cells = పొలుసుల కణములు  ( గ.న )

Soft palate = మృదుతాలువు

Spasm = దుస్సంకోచము 

Speech Therapy =  వాగ్చికిత్స ( గ.న ) వాజ్ఞ్చికిత్స ( గ.న ) మాట కఱపు ( గ.న )

Specificity = నిర్దిష్టత 

Sphenoid = చీల ; కీల  ( గ.న ) / wedge

Sphenoid bone = కీలాస్థి ; చీలయెముక (గ.న) 

Sphenoid sinuses = కీలాస్థి కుహరములు ( గ.న )

Sphincter = నియంత్రణ కండరము ( గ.న )

Spinal Cord = వెన్నుపాము 

Spinal fluid = వెన్నుద్రవము

Spinal Nerves = వెన్ను నాడులు    

Spine = వెన్నెముక 

Spirals  = సర్పిలములు 

Spirometer = శ్వాస మాపకము ( గ.న )

Spleen = ప్లీహము

Splenomegaly = ఉరుప్లీహము (గ.న)

Stable Angina =  స్థిర హృద్ధమని వ్యాధి( గ.న )

Standard Deviation = ప్రమాణ వ్యత్యాసము (గ.న )

Stasis Dermatitis = నిశ్చలత చర్మతాపము ( గ.న )

Steatohepatitis = వస తాపము ( గ.న )

Stem Cells = మూల కణములు ( గ.న )

Stent = వ్యాకోచ సాధనము ( గ.న )

Sterile = వ్యాధిజనక రహితము ( గ.న )

Stratified = స్తరితము

Stricture = సంకోచము, ఇరకటము ( గ.న )

Subclinical Hypothyroidism = అగోచర గళగ్రంథి హీనత ( గ.న )

Subcutaneous Tissue = చర్మాంతర కణజాలము ( గ.న ) ; అధశ్చర్మ కణజాలము ( గ.న )

Superficial Femoral Artery = బాహ్యోరు ధమని ( గ.న )

Superficial Thrombophlebitis  = బాహ్యసిరతాప రక్తఘనీభవనము ( గ.న )

Superficial Veins = బాహ్య సిరలు ( గ.న )

Superior Salivary Gland Nucleus = ఊర్ధ్వ లాలాజల కేంద్రము ( గ.న )

Superior Venacava = ఊర్ధ్వ బృహత్సిర

Supportive Treatment = ఆలంబన చికిత్స ( గ.న )

Suppressive Immunotherapies = అసహనములను అణచు రక్షణచికిత్సలు ( గ.న )

Surgical Gowns = నిలువుటంగీలు

Sympathetic Nervous System = సహవేదన నాడీమండలము (వ్యవస్థ )

Systole = హృదయ ముకుళితము ( గ.న )

Systolic Blood Pressure = ముకుళిత రక్తపీడనము ( గ.న )

Tachycardia = హృదయాతివేగము ( గ.న )

Tachypnoea = శ్వాసాతివేగము ( గ.న )

Temporal Lobe = ( మస్తిష్క ) కర్ణ భాగము ( గ.న )

Tetanus = ధనుర్వాత వ్యాధి

Thrombus = నెత్తురుగడ్డ

Thrombi = నెత్తురుగడ్డలు ( గ.న )

Thrombocytopenia = సూక్ష్మఫలకల హీనత ( గ.న )

Thrombocytosis = సూక్ష్మఫలకల బాహుళ్యము ( గ.న )

Thrombolytic Therapy =  నెత్తురుగడ్డల విచ్ఛేదన చికిత్స ( గ.న )

Thrombolytics = రక్తఖండ విచ్ఛేదనములు ( గ.న ) నెత్తురుగడ్డల విచ్ఛేదనములు ( గ.న ) 

Thymus = ఉరోగ్రంథి (గ.న); వక్షగ్రంథి (గ.న)

T lymphocytes = ఉరోగ్రంథి రసికణములు (గ.న)

Thyroid = గళగ్రంథి

Thyroid Function Tests = గళగ్రంథి వ్యాపార పరీక్షలు ( గ.న )

Thyroid Isthmus = గళగ్రంథి కర్ణికా సంధానము ( గ.న )

Thyroid Lobes = గళగ్రంథి  కర్ణికలు ( గ.న )

Thyroid Stimulating Hormone ; Thyrotropin  = గళగ్రంథి ప్రేరేపకము ( గ.న )

Thyroid Storm = గళగ్రంథి సంక్షోభము ( గ.న )

Thyrotropin Releasing Hormone = గళగ్రంథి ప్రేరేపక విమోచిని ( గ.న )

Tinea Barbae  = గడ్డపు తామర ( గ.న )

Tinea Capitis = తల తామర ; శిరస్సు శిలీంధ్ర వ్యాధి ( గ.న )

Tinea Carporis = ఒంటి తామర ( గ.న )

Tinea Cruris = తొడమూలపు తామర ( గ.న )

Tinea Pedis = పాదశిలీంధ్ర వ్యాధి ( గ.న )

Tinea Unguium ; Onychomycosis = గోటి తామర ; నఖ శిలీంధ్రవ్యాధి ( గ.న )

Tinea Versicolor = సోబి ; సుబ్బెము ( Pityriasis Versicolor )

Tinnitus = చెవిగీ ( గ.న ) , చెవి మ్రోత 

Tonsils = గళ రసిగుళికలు ( గ.న )

Toxin =  జీవ విషము

Trachea = శ్వాసనాళము

Transplant = పర అవయవ దానము ( గ.న )

Treadmill = నడక యంత్రము (గ.న )

Tricuspid Valve = త్రిపత్ర కవాటము 

Trigeminal Nerve = త్రిశాఖ నాడి

TSH Receptors  = గళగ్రంథి ప్రేరేపక గ్రాహకములు ( గ.న )

Tunica Externa Or Adventitia = రక్తనాళపు గోడలో బయటపొర ( గ.న )

Tunica Media =  రక్తనాళపు మధ్యపొర  ( గ.న )

Ultrasonography = శ్రవణాతీత ధ్వని చిత్రీకరణము ( గ.న ) / శ్రవణాతీత శబ్ద చిత్రీకరణము ( గ.న )

Ultraviolet Light = అతినీలలోహిత దీపము ( గ.న )

Ultraviolet Rays = అతినీలలోహిత కిరణములు ( గ.న )

Under Weight = భార హీనత ( గ.న )

Upper airway = ఊర్ధ్వ శ్వాసపథము ( గ.న )

Unstable Angina  = అస్థిర హృద్ధమని వ్యాధి ( అస్థిరపు గుండెనొప్పి )( గ.న )

Upper Motor Neuron Paralysis = ఊర్ధ్వ చలననాడీ పక్షవాతము ( గ.న )

Upper Motor Neuron = ఊర్ధ్వ చలన నాడీకణము ( గ.న )

Ureteric Calculi = మూత్రనాళ శిలలు ( గ.న )

Ureter = మూత్ర నాళము

Urethra = మూత్ర ద్వారము 

Urinary Bladder = మూత్రాశయము 

Urinary Bladder Stone = మూత్రాశయ శిల ( గ.న )

Urticaria = దద్దుర్లు 

Uveitis = కృష్ణపటల తాపము  ( గ.న )

Vaccine = టీకా

Valvular Stenosis = కవాట సంకోచము ( గ.న )

Varicose Veins = ఉబ్బు సిరలు ( గ.న )

Varicose Venous Ulcer = ఉబ్బుసిర వ్రణము ( గ.న )

Vasa Recta = సరళ ధమని ( గ.న )

Vasodilators = రక్తనాళ వ్యాకోచకములు ( గ.న )

Vein = సిర

Ventilation Defect = శ్వాస లోపము ( గ.న )

Ventilator = శ్వాసయంత్రము (గ.న)

Ventricle = జఠరిక

Ventricular Assist Devices = జఠరిక సహాయ పరికరము ( గ.న )

Ventricular Fibrillation = జఠరికా ప్రకంపనము ( గ.న )

Ventricular Filling Pressure = జఠరిక పూరక పీడనము ( గ.న )

Ventricular Septal Defect  = జఠరికాంతర కుడ్య రంధ్రము ( గ.న )

Ventricular Tachycardia  = జఠరికాతివేగము ( గ.న ) / జఠరిక అతివేగము ( గ.న )

Vertebral Artery = వెన్ను ధమని ( గ.న )

Vertigo = కళ్ళు తిరుగుట , తల తిరుగుట

Very Low Density Lipoproteins = అల్పతమ సాంద్ర లైపో ప్రోటీనులు ( గ.న )

Vesicles = నీటి పొక్కులు

Vesicovaginal fistula = యోని మూత్రాశయ సంధినాళము (గ.న), మూత్రాశయ యోని సంధినాళము ( గ.న )

Viruse  ( from Latin vīrus“slime, poison”; akin to Sanskrit viṣá- विष, ) = విషజీవాంశము ( గ.న ) 

Viscera = ఉదరాంతర అవయవములు ( గ.న )

Visual Cortex = దృష్టి వల్కలము ( గ.న )

Vital Signs  = జీవ లక్షణములు ( గ.న )

Voluntary Muscles = ఇచ్ఛా కండరములు

Water Solubility = జల ద్రావణీయత ( గ.న )

Wilson’S Disease ( Of Liver )= తామ్ర కాలేయవ్యాధి ( గ.న )

Xerosis =  ( చర్మ / నేత్ర ) శుష్క వ్యాధి ( గ.న ) ; పొడినలత (గ.న)

Yeast ; Candida = మధు శిలీంద్రము 

Zoonosis = జంతువులనుంచి సంక్రమించు వ్యాధులు ; జంతు జనిత వ్యాధులు ( గ.న )


( గ.న = డాక్టరు. గన్నవరపు వరాహ నరసింహమూర్తి చే కూర్చబడిన పదములు )

విషయసూచిక

  1. ఆరోగ్యము ; వైద్యము https://gvnmurty.blogspot.com/2019/06/blog-post_2.html 2. మధుమేహవ్యాధి ( Diabetes mellitus ) https://gvnmurty.blogsp...