Rabies ప్రశ్న కోసం ఔచిత్యం ద్వారా క్రమీకరించిన పోస్ట్‌లను చూపిస్తోంది. తేదీ ద్వారా క్రమీకరించు అన్ని పోస్ట్‌లను చూపించు
Rabies ప్రశ్న కోసం ఔచిత్యం ద్వారా క్రమీకరించిన పోస్ట్‌లను చూపిస్తోంది. తేదీ ద్వారా క్రమీకరించు అన్ని పోస్ట్‌లను చూపించు

16, జనవరి 2022, ఆదివారం

రభస వ్యాధి ( Rabies )





 ( తెలుగు తల్లి కెనడా వారి సౌజన్యముతో )

                               రభస వ్యాధి ( Rabies )



                                                                      డాక్టరు. గన్నవరపు నరసింహమూర్తి.

     రభస వ్యాధి ( Rabies ) ; లాటిన్ లో rabere ( to rave ప్రలాపించు ) సంస్కృతములో  రభస తో సంబంధము కలిగి కోపమును , ఉద్వేగమును సూచిస్తుంది. మనుజులలోను, ఇతర క్షీరదములలోను ( mammals ) లిస్సా సమూహమునకు చెందిన రేబ్డోవైరిడే ( Rhabdoviridae ) కుటుంబమునకు చెందిన ఒంటి పోగు ఆర్. ఏన్.ఎ విషజీవాంశముల ( RNA viruses ) వలన కలుగుతుంది. ఈ విషజీవాంశములు ( viruses ;from Latin vīrus“slime, poison”; akin to Sanskrit viṣá-,विष ) వ్యాధి గల జంతువుల లాలాజలము నుంచి కాట్ల గుండా కాని, కన్ను, ముక్కు, నోరు శ్లేష్మపుపొరల ద్వారా గాని శరీరములోనికి చొరబడి మెదడుకు చేరితే రభసవ్యాధి ( Rabies )  కలుగుతుంది. 


రభస వ్యాధి వన్యమృగములు నక్కలు , గబ్బిలాలు, రాకూనులు ( racoons ), స్కంకులలో( skunks ) కలుగుతుంటుంది. కుక్కలకు, పిల్లులకు ఈ వ్యాధి వ్యాధి గల ఇతర జంతువుల నుంచి గాని, వన్యమృగాల నుంచి గాని సంక్రమిస్తుంటుంది. మనుజులకు కుక్కల నుంచి ఎక్కువగాను, అమెరికా వంటి దేశాలలో గబ్బిలాల నుంచి కాటుల వలన సోకుతుంటుంది. జంతువులు కఱచిన తరువాత, వ్యాధిలక్షణములు పొడచూపక ముందు టీకాలు వేసి వ్యాధిని పూర్తిగా నివారించవచ్చును. 

టీకాలు ( vaccines ) లభ్యమగుట వలన, పెంపుడు కుక్కలకు, పిల్లులకు టీకాలు తప్పనిసరిగా వేయించుట వలన, సమాజములలో జంతువుల తిరుగుళ్ళను నియంత్రించుట వలన, వన్యమృగముల కాట్లకు, టీకాలు వేయబడని కుక్కల, పిల్లుల కాట్లకు గురి అయి రభసవ్యాధి కలిగే అవకాశములు గల మనుజులకు టీకాలు వేయుట వలన రభస వ్యాధిని ( Rabies ) పూర్తిగా నిర్మూలించవచ్చును.

    లక్షణములు పొడచూపిన పిమ్మట రభస వ్యాధి సర్వసాధారణముగా (100%) మరణమునకు దారితీస్తుంది. 


రభస విషజీవాంశములు ( Rabies Viruses )

     రభస వ్యాధి కలిగించు జీవాంశములు లిస్సావైరస్ ( Lyssa Viruses ) సమూహములో రాబ్డోవైరిడే ( Rhabdoviridae ) కుటుంబానికి చెందిన కణుపులు లేని ( non segmented ) ఒంటిపోగు ఆర్ఎన్ఎ విషజీవాంశములు. జన్యుపదార్థము ఒక కోశములో ఉంటుంది. ఈ విషజీవాంశములు తుపాకి గుండు ఆకారములో ఉంటాయి.

రభస వ్యాధి కలిగించు జంతువులు 


     రభసవ్యాధి సోకిన కుక్కలు, నక్కలు, గబ్బిలాలు, స్కంకులు,  రాకూనులు, పిల్లుల నుంచి మనుజులకు రభస వ్యాధి సంక్రమించగలదు. రభసవ్యాధి బారి పడిన జంతువులలో వ్యాధి లక్షణములు ఏమీ కనిపించకపోవచ్చును. నలతగా ఉండుట, మింగుట కష్టముగా ఉండుట , నురుగుతో చొంగ ఎక్కువగా కార్చుట, కనిపించిన వాటిని ప్రేరణ లేకుండా కఱచుచుండుట, ఏవైనా శరీరభాగములు చలనము లేక వాతము స్థితిలో ఉండుట, ఊరికే కలియబడి దాడిచేయుట, లేక మఱీ మెతకగా పడిఉండుట, వ్యాధిని సూచిస్తాయి. నేలపై పడిన గబ్బిలాలు కూడా రభస వ్యాధిని సూచిస్తాయి.

   భారతదేశములో 62000,000 ల ఊరకుక్కలు ఉన్నాయని అంచనా. ఏటా 17600,000 మంది కుక్కకాట్లకు గుఱి అవుతారని రభసవ్యాధి నియంత్రణ సంఘము వారి అంచనా. వీరికి వైద్యము ఖర్చుతో కూడిన పని.

పెంపుడు జంతువుల రక్షణ 

      పెంపుడు జంతువులకు రభస వ్యాధి నుంచి రక్షణ కల్పిస్తే మనుష్యులకు కూడా రక్షణ చేకూరుతుంది. పెంపుడు కుక్కలకు, పిల్లులకు రభస వ్యాధి టీకాలు వేయించుట తప్పనిసరి చెయ్యాలి.పెంపుడు జంతువులను వన్యమృగముల బారి నుంచి, ఇతర జంతువుల బారి నుంచి కాపాడుకోవాలి. పెంపుడు జంతువులను విచ్చలవిడిగా అదుపులో లేకుండా బయట తిరగనీయకూడదు. వాటిని మనుష్యులను ఇతర జంతువులను కఱవనీయకుండా యజమానులు వారి ఇంటి లేక పొలము ప్రాంగణాలలో అదుపులోఉంచుకోవాలి. పెంపుడు జంతువుల వృషణములు , అండములు తొలగించో వాటికి కుటుంబనియంత్రణ శస్త్రచికిత్సలు చేయించో వాటి సంఖ్య వృద్ధిపొందకుండా చూసుకోవాలి. యజమానులు లేని వీధి కుక్కలను, పిల్లులను బాధ్యత తీసుకొని పోషించుటకు, వాటికి రభసవ్యాధి ( Rabies ) టీకాలను వేయిస్తూ తమ అదుపులో ఉంచుకొనుటకు ఎవరూ దొఱకనప్పుడు వాటిని వీధులనుంచి  తొలగించి జంతుశాలలలోనో, జంతు పరిరక్షణశాలలలోనో ఆశ్రయము కల్పించుట, వాటికి రభసవ్యాధి టీకాలు వేయించి పోషణ చేకూర్చుట, కుటుంబనియంత్రణ శస్త్రచికిత్సలు చేయించుట అందఱికీ ఆమోదకరము కావాలి. ప్రభుత్వ సంస్థలు, ప్రజాహిత సంస్థలు జీవకారుణ్యసంస్థలు ఆ బాధ్యత తీసుకోవాలి. కుక్కల సగటు జీవనప్రమాణము 11 సంవత్సరములు కాబట్టి పై సూచనలను అమలుపరుస్తే ఒక దశాబ్దములో వీధి కుక్కల సంఖ్య బాగా తగ్గిపోవాలి. చాలా దేశాలలో వన్యమృగాలకు కూడా ఆహారము ద్వారా నీరసింపజేసిన రభసవ్యాధి ( attenuated Rabies virus ) విషజీవాంశములను టీకాలుగా ఇచ్చి వాటికి చైతన్యరక్షణ ( active immunity ) సమకూర్చుతున్నారు. 

               భారతదేశములో జీవకారుణ్యసంఘము వారి అభ్యర్ధన మేరకు , అత్యున్నతన్యాయస్థానము వారు ఊర కుక్కలను పిల్లులను చంపరాదని తీర్పు ఇచ్చారు. అందువలన పురపాలక సంఘాలు వాటిని అదుపులో ఉంచుటకు శ్రద్ధ చూపుట లేదు. అందుచే మనుష్యులలో కుక్కకాట్లు, రభసవ్యాధులు , వాటి వలన మరణాలు పెరిగాయి. ఆ తీర్పును గౌరవిస్తూనే శునక శాలలు, పిల్లుల ఆశ్రమాలు నడుపుకొంటూ వాటిని పట్టణ వీధులలోంచి తొలగించి వాటికి, ప్రజలకు రక్షణ చేకూర్చుటకు ప్రభుత్వాలు, ప్రజాసంఘాలు, ప్రజలు సమిష్టిగా కృషి చెయ్యాలి. 

   
     రభసవ్యాధి వలన భారతదేశములో సంవత్సరానికి సుమారు 20,000 మంది మరణిస్తున్నారు. వీరిలో పెక్కుమంది పిల్లలు. అమెరికాలో ఒకరో ఇద్దఱో గబ్బిలాల కాట్ల వలన వచ్చిన రభసవ్యాధితో మరణిస్తున్నారు. కుక్కకాట్ల వలన ఎవరికీ రభసవ్యాధి రావడము లేదు. అభివృద్ధి చెందిన చాలా దేశాలు రభసవ్యాధిని ( Rabies ) పూర్తిగా నివారించ గలుగుతున్నాయి.

రభస వ్యాధి వ్యాప్తి 


      రభసవ్యాధి ( Rabies ) సోకిన జంతువుల నుంచి ఇతర జంతువులకు, మనుజులకు రభసవ్యాధి ( Rabies ) సంక్రమించగలదు.సామాన్యముగా ఆ జంతువులు కఱచుట వలన వ్యాధి బారి పడుతారు. రేబీస్ గల జంతువుల లాలాజలము గాయములు, ఒరిపిడులు , ఱక్కుళ్ళపై పడినప్పుడు కూడా విషజీవాంశములు శరీరములోనికి ప్రవేశించి రభసవ్యాధిని కలిగించగలవు. రభస విషజీవాంశములు ఆ జంతువుల మెదడులోను, నాడీకణజాలములోను కూడా ఉంటాయి. ఆ కణజాలములు గాయములపై చేరినా వ్యాధి రాగల అవకాశము ఉంటుంది. వ్యాధిగ్రస్థ జంతువుల రక్తము, మలమూత్రముల ద్వారా వ్యాధి సంక్రమించదు. వ్యాధిగ్రస్థ జంతువులను తాకుట వలన, తట్టుట వలన వ్యాధి రాదు. వ్యాధిగ్రస్థుల అవయవ పరదానాలు ( organ transplantation ) వలన వ్యాధి వ్యాపించిన సంఘటనలు ఉన్నా అవి చాలా అఱుదు. రభసవ్యాధి ( Rabies ) సోకిన మనుజులు కఱచుట చేత, వారి లాలాజలము వలన వారి వ్యాధి ఇతరులకు సంక్రమించే అవకాశము ఉన్నా అట్టి సంఘటనలు నమోదు కాలేదు. రభస విషజీవాంశములు సూర్యరశ్మి సోకినపుడు, ఆర్ద్రత కోల్పోయినపుడు నిర్వీర్యము అవుతాయి. 

రభసవ్యాధి లక్షణములు 

     రభసవ్యాధి ( Rabies ) విషజీవాంశములు శరీరములో ప్రవేశించిన తర్వాత అవి మెదడుకు చేరేవఱకు ఎట్టి లక్షణములు కనిపించవు. అవి మెదడుకు చేరిన పిదప రోగలక్షణములు కలుగుతాయి. ఈ అగోచరస్థితి / మఱుగుపాటు సమయము ( incubation period ) సాధారణముగా కొద్ది వారములు నుంచి కొద్ది నెలలపాటు ఉంటుంది. అగోచరస్థితి కాలము కాటుబడిన తావుకు మెదడుకు కల మధ్య దూరము పైన, విషజీవాంశముల పైన, శరీర రక్షణ వ్యవస్థ పైన ఆధారపడి ఉంటుంది.
    తొలి లక్షణములు వ్యాపకజ్వరము ( Flu ) లక్షణములను పోలి ఉంటాయి. జ్వరము, తలనొప్పి, నీరసము, ఒంట్లో నలత, ఒళ్ళునొప్పులు, గొంతునొప్పి, ఆకలి లేకపోవుట, వమన భావన, వాంతులు, పొడిదగ్గు ఉంటాయి. కాటు స్థలము వద్ద తిమ్మిరి, సూదులు గుచ్చినట్లు నొప్పి, కండరాలలో జలదరింపులు కలుగవచ్చును. ఈ లక్షణములు 1-4 దినములు ఉంటాయి.
     విషజీవాంశములు మెదడుకు చేరి మెదడువాపు ( encephalitis ) కలిగించేటపుడు ఆ మెదడువాపు ( encephalitis )  లక్షణములు కనిపిస్తాయి. గందరగోళము, ఆందోళన, ఉద్వేగము, కలియబడుదనము, నిద్రపట్టకపోవుట, మతిభ్రంశము, భ్రాంతులు, కలుగుతాయి. కండరములలో ప్రకంపనములు, దుస్సంకోచములు ( spasms ), మూర్ఛలు, కొన్ని కండరములలో వాతము కలిగి చలన నష్టము ( paralysis) కలుగవచ్చును. కన్నీళ్ళు ఎక్కువగా కారుట, లాలాజలము ఎక్కువగా స్రవించుట, ఎక్కువ చెమటపట్టుట, స్థితి సంబంధ అల్పరక్తపీడనము ( postural hypotension ) వీరిలో కనిపిస్తాయి. 
    ఆపై మస్తిష్కమూల ( brain stem ) విలక్షణములు కనిపిస్తాయి. ద్విదృష్టి (ఒక వస్తువు రెండుగా కనిపించుట / diplopia ), ముఖకండర పక్షపాతములు ( facial palsy ), నేత్రనాడిలో వాపు ( optic neuritis ), మింగుటలో కష్టము, పదార్థములు మింగుటకు యత్నించునపుడు మింగు కండరములలోను ( muscles of deglutition ), స్వరపేటిక కండరములలోను, శ్వాసకండరములలోను, ఉదరవితానములోను దుస్సంకోచములు, నొప్పులు కలుగుట కలుగుతాయి. 



   రభస వ్యాధి ( Rabies ) విశ్రుత లక్షణము జలభయము ( hydrophobia). వీరు నీటిని, ద్రవపదార్థములను చూసేటపుడు, మింగుటకు యత్నించునపుడు మింగు కండరములు పనిచేయక, వాటిలో నొప్పి కలిగించు దుస్సంకోచములు ( spasms ) కలిగి ఆ కండరములు బిగుసుకుపోతాయి. అందువలన వీరు నీటిని చూసి భయపడుతారు. పదార్థములు మింగలేకపోవుట, లాలాజలము ఎక్కువగా స్రవించుట, నురుగుతో చొంగలు కారుట వీరిలో కనిపిస్తాయి.

 లక్షణములు పొడచూపిన రెండు నుంచి పది దినములలో రభస వ్యాధిగ్రస్థులు సర్వసాధారణంగా మరణిస్తారు. 

       రభస వ్యాధి సోకిన జంతువులలో కూడా ఇటువంటి లక్షణములే కనిపిస్తాయి. ప్రేరణ లేకుండా దాడి చేసి కఱచుట, పెంపుడు జంతువుల ప్రవర్తనలో మార్పులు, చైతన్యము పోయి మూల పడిఉండుట వ్యాధిని సూచించగలవు.

రోగ నిర్ణయము 


     మనుజులలో రభస వ్యాధిని మరణమునకు ముందు నిర్ణయించుటకు పలు పరీక్షలు అవసరము. లాలజలము నుంచి విషజీవాంశములను వేర్పఱచ వచ్చును. RT-PCR పరీక్షతో (reverse transcription followed by polymerase chain reaction) విషజీవాంశములను గుర్తించే అవకాశము గలదు. రక్తద్రవము ( serum ), వెన్నుద్రవములలో ( spinal fluid ) రభస విషజీవాంశములకు ప్రతిరక్షకములను ( antibodies ) గుర్తించవచ్చును. చర్మకణపరీక్షలతో కేశకూపముల క్రింద చర్మనాడులలో విషజీవాంశ ప్రతిజనకములను ( antigens ) గుర్తించే అవకాశము గలదు. విషజీవాంశ ప్రతిజనకములను ( antigens ) ప్రత్యక్ష ప్రతిదీప్త ప్రతిరక్షక పరీక్షతో ( Direct Fluorescent Antibody test ) గుర్తిస్తారు.
     కఱచిన జంతువులు వన్యమృగములయి అవి పట్టుబడినప్పుడు, కుక్కలు, పిల్లులు, పెంపుడు జంతువులయి అవి వ్యాధి లక్షణములు కలిగి ఉన్నపుడు వాటిని బాధ లేకుండా మానవతా దృష్టితో చంపి వాటి మెదడును ( ముఖ్యముగా చిన్నమెదడు, మస్తిష్క మూలములను ) ప్రత్యక్ష ప్రతిదీప్త ప్రతిరక్షక పరీక్షలతో ( Direct Fluorescent Antibody test ) విషజీవాంశములకై పరిశోధించాలి. మస్తిష్క కణపరీక్షలలో నెగ్రీబాడీస్ ( Negri bodies ) కనిపించినా వ్యాధిని నిరూపించవచ్చును. 

వ్యాధి నివారణ 

    జంతువులు కఱచినపుడు, లేక ఱక్కినపుడు, వాటి లాలాజలము ఱక్కులపైన, గాయములపైన చేరినపుడు ఆ జంతువులు వన్యమృగములైతే వాటిని బాధ లేకుండా చంపి వాటి మెదడులను రభస వ్యాధి పరీక్షలకు పంపాలి. మెదడులు రభసవ్యాధిని సూచిస్తే టీకాల చికిత్స ( vaccination ) అవసరము. ఆ జంతువులు దొఱకక పారిపోయినా టీకాల చికిత్సలు అవసరము.
   ఆ జంతువులు ఊరకుక్కలు, పిల్లులు అయినా, పెంపుడు జంతువులు అయినా వాటిని పది దినములు నిర్బంధించి వాటిలో రోగ లక్షణములు కనిపిస్తే వాటిని బాధ లేకుండా చంపి వాటి మెదడులను రభసవ్యాధి పరిశోధనలకు పంపాలి. రభసవ్యాధి నిరూపితమయితే టీకా చికిత్సలు 
( vaccines ) అవసరము. పది దినముల తరువాత కూడా అవి ఆరోగ్యముగా ఉంటే రభస వ్యాధి టీకాల అవసరము లేదు. వీధి జంతువులు దొఱకక పారిపోతే టీకాలు అవసరము.
     జంతువులు కఱచినపుడు, ఱక్కినపుడు గాయములను సబ్బునీళ్ళతోను, వినీల పొవిడోన్ ఐయొడిన్ తోను శుభ్రపఱచాలి. ధనుర్వాతము ( tetanus ) రక్షణకు పది సంవత్సరములలో టీకాలు తీసుకొనని వారికి ధనుర్వాతపు టీకాలు వేయాలి. అవసరమయిన సూక్షాంగజీవ నాశకములు ( antibiotics ) వాడాలి. గాయములకు తగిన చికిత్స కొనసాగించాలి.
     రభస వ్యాధి సంక్రమించు అవకాశాల బారి పడినవారికి వ్యాధి నివారణ చికిత్స అవసరము ( Post exposure prophylaxis ). 
     వీరికి  మనుజుల రభస వ్యాధి ప్రతిరక్షకములను ( Human Rabies Immune Globulin - HRIG ) 20 units / Kg శరీర బరువు మోతాదును వీలయినంత కఱచిన గాయములోనికి , గాయము చుట్టూ ఇచ్చి మిగిలినది కండరములో సూదిమందుగా వెంటనే ఇయ్యాలి. దీని వలన వెంటనే అచేతన రక్షణ ( పరదాన రక్షణ / passive immunity ) కలుగుతుంది. HRIG ని కాటుకు 7 దినముల తర్వాత ఈయకూడదు.
    రభస వ్యాధి టీకా ( Rabies vaccine ) 1 మి.లీ ను 0, 3, 7, 14 దినములలో మొత్తము నాలుగు మోతాదులు భుజ కండరములలో ( అధిస్కంధ స్నాయువు / Deltoid muscle ) సూదిమందుగా ఇయ్యాలి. రక్షణ వ్యవస్థ లోపములు ఉన్నవారిలో ఐదవ మోతాదు కూడా  28 వ దినమున ఇయ్యాలి. టీకాల వలన చైతన్య రక్షణ ( శరీర రక్షణ వ్యవస్థ చేకూర్చు స్వీయరక్షణ / active immunity ) చేకూరుతుంది.
       అది వఱకు టీకాలు తీసుకొని రక్షణ పొందిన వారు రభస వ్యాధి కలిగే అవకాశాలకు గుఱి అయినపుడు ( Post exposure, previously immunized persons ) రెండు మోతాదుల టీకాను 0, 3 దినములలో తీసుకుంటే సరి పోతుంది. వీరికి HRIG అవసరము లేదు.
       పశువుల వైద్యులు, జంతువులతోను, వన్యమృగములతో పనిచేసేవారు, రభసవ్యాధి పరిశోధకులు, రభసవ్యాధి కలిగే అవకాశములకు ముందుగానే ( Pre exposure prophylaxis ) 0, 7, 21 ( లేక 28 ) దినములలో రభస వ్యాధి టీకాలు మూడు మోతాదులలో తీసుకోవాలి

    రభస వ్యాధి లక్షణములు కలవారు సాధారణముగా మరణము పాలవుతారు. వారికి ఆలంబన చికిత్సలు ( supportive treatment ), ఉపశమన చికిత్సలే అందుబాటులో ఉన్నాయి. అందువలన రభసవ్యాధిని నివారించు చర్యలు తప్పక తీసుకోవాలి.


        సెప్టెంబరు 28 ప్రపంచ రభసవ్యాధి దినముగా ( World Rabies Day ) గా పరిగణించి ప్రజలకు రభసవ్యాధి గుఱించి దాని నివారణ గుఱించి సమాచారమును వ్యాపింప చేస్తారు.
   
( వైద్య విషయములను తెలుగులో చెప్పుట నా వ్యాసముల లక్ష్యము . వ్యాధిగ్రస్థులు, వ్యాధుల అవకాశములకు గుఱి అయినవారు మీ మీ వైద్యులను సంప్రదించ ప్రార్థన . నా వ్యాసములు స్వేచ్ఛగా పంచుకొనవచ్చును. )

24, ఏప్రిల్ 2024, బుధవారం

విషయసూచిక

 


1. ఆరోగ్యము ; వైద్యము

https://gvnmurty.blogspot.com/2019/06/blog-post_2.html


2. మధుమేహవ్యాధి ( Diabetes mellitus )
https://gvnmurty.blogspot.com/2019/06/diabetes-mellites.html

3. అధిక రక్తపీడనము ( Hypertension )
https://gvnmurty.blogspot.com/2019/06/hypertension.html

4. కొవ్వులు ; కొలెష్టరాలు ( Fats & Cholesterol )
https://gvnmurty.blogspot.com/2019/06/fats-cholesterol.html
5. గళగ్రంథి హీనత ( Hypothyroidism )
https://gvnmurty.blogspot.com/2020/03/hypothyroidism.html
6. గళగ్రంథి ఆధిక్యత ( Hyperthyroidism )
https://gvnmurty.blogspot.com/2020/03/hyperthyroidism.html

7. ఎక్కువ బరువు ( Overweight ) ; స్థూలకాయము ( Obesity )
https://gvnmurty.blogspot.com/2019/06/overweight-obesity.html

8. పొగాకు ; ధూమపానము ( Tobacco smoking )
https://gvnmurty.blogspot.com/2019/07/blog-post_7.html

9.  హృదయ రక్తప్రసరణ లోపము ( Ischemic heart disease )
https://gvnmurty.blogspot.com/2020/10/ischemic-heart-disease.html

10.  సత్వర హృద్ధమని వ్యాధులు ( Acute Coronary Syndrome)https://gvnmurty.blogspot.com/2021/02/
11.  హృదయ వైఫల్యము ( Congestive heart failure )

https://gvnmurty.blogspot.com/2019/06/congestive-heart-failure.html

12.  దూర ధమని వ్యాధి ( Peripheral arterial disease ) 
https://gvnmurty.blogspot.com/2020/04/peripheral-arterial-disease.html

13. ఉబ్బు సిరలు ( Varicose veins )
https://gvnmurty.blogspot.com/2020/03/varicose-veins.html

14. నిమ్నసిర రక్తఘనీభవనము ( Deep Vein Thrombosis ) ; పుపుస ధమని అవరోధకము ( Pulmonary Embolism )
https://gvnmurty.blogspot.com/2020/08/deep-vein-thrombosis-pulmonary-
embolism.html
15. ఊర్ధ్వశ్వాసపథము ( Upper airway )
https://gvnmurty.blogspot.com/2022/02/blog-post.html?m=1


16.  నిద్రలో అవరోధ శ్వాసభంగములు ( Obstructive Sleep Apnea )
https://gvnmurty.blogspot.com/2022/03/obstructive-sleep-apnea.html?m=1

17. ఉబ్బస ( Bronchial Asthma )
https://gvnmurty.blogspot.com/2020/03/bronchial-asthma.html

18. దీర్ఘకాలిక శ్వాసావరోధ వ్యాధి ( Chronic Obstructive Pulmonary Disease )
https://gvnmurty.blogspot.com/2020/03/blog-post.html

19. జఠర అన్ననాళ ఆమ్ల తిరోగమన వ్యాధి ( Gastro Esophageal Reflux Disease )
https://gvnmurty.blogspot.com2021/08/gastro-esophageal-reflux-disease.html

20. అన్ననాళంలో అతుకు మచ్చ
https://gvnmurty.blogspot.com/2023/07/inlet-patch-of-esophagus.html
21.  జీర్ణ వ్రణములు ( Peptic Ulcers )
https://gvnmurty.blogspot.com/2020/03/peptic-ulcers.html

22.  నారంగకాలేయ వ్యాధి ( Cirrhosis of liver )
https://gvnmurty.blogspot.com/2020/09/cirrhosis-of-liver_16.html

23.  పచ్చకామెరలు ( Jaundice )
https://gvnmurty.blogspot.com/2019/06/jaundice.html

24. మద్యపాన వ్యసనము ( Alcoholism )
https://gvnmurty.blogspot.com/2020/07/alcoholism_16.html

25.  మూత్రాంగములు ( Kidneys )
https://gvnmurty.blogspot.com/2020/03/kidneys.html

26. సత్వర మూత్రాంగ విఘాతము ( Acute kidney injury )
https://gvnmurty.blogspot.com/2020/04/acute-kidney-injury.html

27. దీర్ఘకాల మూత్రాంగవ్యాధి ( Chronic Kidney Disease )
https://gvnmurty.blogspot.com/2020/05/chronic-kidney-disease_17.html

28. మస్తిష్క రక్తనాళ విఘాతములు ( Cerebro Vascular Accidents )
https://gvnmurty.blogspot.com/2019/06/cerebro-vascular-accidents.html

29. ముఖ పక్షవాతము ( Facial Palsy )
https://gvnmurty.blogspot.com/2019/06/facial-palsy.html

30. మానసికస్థితి వైపరీత్యములు ( Mood disorders )
https://gvnmurty.blogspot.com/2020/08/mood-disorders.html

31. కర్కట వ్రణములు ( Cancers )
https://gvnmurty.blogspot.com/2019/06/cancers.html

32. పాండు రోగము ( Anemia )
https://gvnmurty.blogspot.com/2020/04/anemia.html

33.  గుల్ల ఎముకలవ్యాధి ( Osteoporosis )
https://gvnmurty.blogspot.com/2020/08/osteoporosis.html

34. ఉష్ణ సంబంధ రుగ్మతలు ( Heat related illnesses )
https://gvnmurty.blogspot.com/2019/06/heat-related-illnesses_18.html

35. శరీర రక్షణ వ్యవస్థ ( Immune System )
https://gvnmurty.blogspot.com/2019/09/immune-system.html

36. అసహన నాసికా తాపము ( Allergic Rhinitis )
https://gvnmurty.blogspot.com/2019/10/allergic-rhinitis.html

37 . రక్షణ వికటత్వము  ( Anaphylaxis  )
https://gvnmurty.blogspot.com/2019/08/

38.  ఆటాలమ్మ ( Chicken pox ) ; అగ్గిచప్పి / అగ్నిసర్పి / ఒడ్డాణపు చప్పి / మేఖల విసర్పిణి ( Shingles /Herpes Zoster )
https://gvnmurty.blogspot.com/2019/06/chicken-pox-shingles-hepes-zoster.html

39. జలుబు ( Common cold )
https://gvnmurty.blogspot.com/2020/04/common-cold.html

40. వ్యాపక జ్వరము ( Influenza )
https://gvnmurty.blogspot.com/2020/03/influenza.html

41. రభసవ్యాధి ( Rabies )
https://gvnmurty.blogspot.com/search?q=Rabies

42. సూక్ష్మజీవులు కలిగించు కొన్ని చర్మవ్యాధులు ( Some Bacterial skin diseases )
https://gvnmurty.blogspot.com/2019/11/some-bacterial-skin-diseases.html

43. కణ తాపము ( Cellulitis )
https://gvnmurty.blogspot.com/2019/12/cellulitis.html
44.  శిలీంధ్ర చర్మవ్యాధులు ( Fungal skin diseases - 1 )

https://gvnmurty.blogspot.com/2020/01/blog-post.html

45.  శిలీంధ్ర చర్మవ్యాధులు -2 ( Fungal skin diseases-2 )
https://gvnmurty.blogspot.com/2020/02/2-fungal-skin-diseases-2.html

46. అంటురోగముల నివారణ ( Controlling contagious diseases )

https://gvnmurty.blogspot.com/2020/06/controlling-contagious-diseases.html
47. అంతర్దర్శనము (Endoscopy)

https://gvnmurty.blogspot.com/2024/04/blog-post.html

48. వైద్యపదకోశము
https://gvnmurty.blogspot.com/2021/07/blog-post.html

49. వైద్యపదకోశము ( Alphabetically )
https://gvnmurty.blogspot.com/2021/08/alphabetically.html

50. త్రొక్కిసలాట మరణాలు ( Stampede deaths )
https://gvnmurty.blogspot.com/2021/04/stampede-deaths.html

51. నీటిప్రమాదాలు

https://gvnmurty.blogspot.com/2024/02/blog-post.html

52. తెలుగు లిపిలో ముద్రణ 
https://gvnmurty.blogspot.com/2019/11/blog-post_25.html


53. హలో డాక్టర్ పుస్తకము  
https://drive.google.com/file/d/1Qm2fZO9Xxe3toyrbCiO8uw3Tb0i628pc/view


54. చర్మవ్యాధులు- ఒక పరిచయము  / డాక్టరు. గండికోట రఘురామారావు, ఎం.డి. ( చర్మవ్యాధి నిపుణులు )

https://drive.google.com/file/d/10T0SgL-TrJtCwGdTCLRKoDvWNPr3s5Q6/view?usp=drivesdk


55. శతాధిక కాఫీ పద్యాలు 
https://gvnmurty.blogspot.com/2022/05/blog-post_6.html


56. శతాధిక కాఫీ పద్యాలు పుస్తకము
https://drive.google.com/file/d/1vm6mmgSwsoCSX7C00Yu-TaBufa2yXAzi/view?usp=drivesdk

57. బొమ్మలకు పద్యాలు
https://gvnmurty.blogspot.com/2022/12/blog-post.html

58 డాలస్లో మంచు
https://gvnmurty.blogspot.com/2023/10/blog-post.html

5, ఆగస్టు 2021, గురువారం

వైద్యపదకోశము ( Alphabetically )

 


 


Abdominal Aorta = ఉదర బృహద్ధమని ( గ.న )

Abdominal Aortic Aneurysms = . ఉదర బృహద్ధమని బుద్బుదము ( బుడగ ) ( గ.న )

Abdominal Cavity = ఉదరకుహరము 

Abscess = చీముతిత్తి ( గ.న )

Acid Reflux = ఆమ్ల తిరోగమనము ( గ.న )

Acidophils , Eosinophils = ఆమ్లాకర్షణ కణములు ( గ.న )

Acidosis = ఆమ్లీకృతము

Active immunity = చైతన్య రక్షణ ( గ.న )

Acute Coronary Syndrome = సత్వర హృద్ధమని వ్యాధులు ( గ.న )

Acute Kidney Injury  = సత్వర మూత్రాంగ విఘాతము ( గ.న )

Afferent Arteriole = ప్రవేశ ధమనిక  ( గ.న )

Airborne = వాయు వాహనులు ( గ.న )

Air- Conditioner = వాయు నియంత్రణులు (గ.న ) 

Alcohol Withdrawal = మద్య పరిత్యజనము ; మద్య వర్జనము ( గ.న )

Alcoholic Hepatitis = సుర కాలేయ తాపము ( గ.న )

Alcoholic Steatosis = సుర కాలేయ వసవ్యాధి ( గ.న )

Allergens = అసహన పదార్థములు ( గ.న )

Allergy = అసహనము ( గ.న )

Alopecia = బట్టతల మచ్చలు ( గ.న )

Alveolar Ducts = పుపుస గోళనాళికలు ( గ.న )

Alveolus  = ఊపిరి బుడగ ( గ.న ) ; పుపుస గోళము ( గ.న ) ; వాయు గోళము

Anaphylaxis  = రక్షణ వికటత్వము ( గ.న )

Anastomotic Ulcers = సంధాన వ్రణములు ( గ.న )

Anatomy  = దేహనిర్మాణ శాస్త్రము

Anemia = పాండురోగము 

Aneurysm = ధమని బుడగ ; ధమనీ బుద్బుదము ( గ.న )

Angina Pectoris = గుండెనొప్పి

Angioplasty  = ధమనీ వ్యాకోచ చికిత్స ( గ.న )

Angiotensin Receptor Blockers = ఏంజియోటెన్సిన్ గ్రాహక అవరోధకములు ( గ.న )

Ankle Brachial Index Abi Index = చీలమండ రక్తపీడనము / బాహు రక్తపీడనము ( గ.న )

Antacids = ఆమ్ల విరోధములు ; ఆమ్ల హరములు

Anterior Cerebral Artery = పురోమస్తిష్క ధమని ( గ.న )

Anterior Communicating Artery = పురో సంధాన ధమని (గ.న )

Anterior Inter Ventricular Sulcus = పూర్వ జఠరికాంతర గర్తము ( గ.న )

Anterior nares = పూర్వ నాసికారంధ్రములు ( గ.న )

Anterior Nerve Root = పూర్వ నాడీమూలము ( గ.న )

Anterior Tibial Artery = పూర్వ జంఘిక ధమని ( గ.న )

Anterior Tibial Vein = పూర్వజంఘిక సిర ( గ.న )

Anti Inflammatory Agents = తాపక నివారణులు ( గ.న ); తాప హర (ణ )ములు ( గ.న )

Antibiotics = సూక్ష్మజీవ సంహారకములు  /  సూక్ష్మజీవ నాశకములు

Antibody = ప్రతిరక్షకము

Anticoagulants = రక్తఘనీభవన అవరోధకములు ( గ.న )

Anticonvulsants = మూర్ఛ నివారిణులు ( గ.న )

Antifungals = శిలీంధ్ర నాశకములు ( గ.న )

Antigens  = ప్రతి ( రక్షక ) జనకములు

Antihistamines = హిష్టమిన్ అవరోధకములు ; హిష్టమిన్ గ్రాహక అవరోధకములు ( గ.న )

Antiseptics = సూక్ష్మజీవి సంహారకములు

Antivirals  =  విషజీవాంశ నాశకములు ( గ.న )

Antrum = అంతిమ కుహరము 

Aorta = బృహద్ధమని

Aortic Dissection = బృహద్ధమని విదళనము / బృహద్ధమని చీలిక

Aortic Stenosis = బృహద్ధమని కవాట సంకీర్ణత ( సంకోచము ) ( గ.న )

Aortic Valve = బృహద్ధమని కవాటము ( గ.న )

Aphasia = మాట పోవుట  ; వాజ్ఞ్నష్టము ; ( గ.న ) వాగ్నష్టము ( గ.న )

Apoptosis =  కణజాల సహజమృతి ( గ.న )

Arrhythmias = అసాధారణ లయలు ( గ.న )

Arterial Blood Gas Studies = ధమనీరక్త వాయుపరీక్షలు ( గ.న )

Arterial Blood Gases = ధమనీ రక్త వాయువులు ( గ.న )

Arterial Bypass Surgery =  ధమనీ అవరోధ అధిగమన శస్త్రచికిత్స ( గ.న )

Arterial circle of Willis = మస్తిష్క ధమనీ చక్రము ( గ.న )

Arterial Malformations = ధమనీ వైకల్యములు ( గ.న )

Arteries = ధమనులు

Arteriosclerosis = ధమనీ కాఠిన్యము

Arteriovenous Fistulas = ధమనీ సిర సంధానములు (గ.న )

Ascending Loop =ఎగు మెలిక (గ.న )

Ascites = జలోదరము 

Ataxia = శరీర అస్థిరత ; దేహ అస్థిరత ( గ.న ) / అస్థిర గమనము ( గ.న )

Atheromas = ధమనీ ఫలకములు ( గ.న )

Atherosclerosis = ధమనీ కాఠిన్యము

Atherosclerotic Plaques = ధమనీ కాఠిన్య ఫలకలు ( గ.న )

Atopic Dermatitis =  అసహన చర్మతాపము ( గ.న )

Atria = కర్ణికలు 

Atrial Fibrillation = ( హృదయ ) కర్ణికా ప్రకంపనము ( గ.న )

Atrium  = కర్ణిక

Attenuated = దుర్బలపఱచిన , నీరసింపబడిన ( గ.న )

Auditory Cortex = శ్రవణ వల్కలము ( గ.న )

Auto Antibodies = స్వయంప్రహరణ ప్రతిరక్షకములు ( గ.న )

Autoimmune Disease = స్వయంప్రహరణ ( ప్రతిరక్షిత ) వ్యాధి( గ.న )

Autoimmune Disorder = స్వయంప్రహరణ ( పరిరక్షణ ) వ్యాధి ( గ.న )

Autoimmune Thyroiditis = స్వయంప్రహరణ గళగ్రంథి తాపము ( గ.న )

Axons = అక్షతంతులు 

Bacteria = సూక్షాంగజీవులు ; సూక్ష్మజీవులు 

Bacterial Cultures = సూక్ష్మజీవుల పెంపకము ( గ.న )

Baker’S Cyst Of Gastrocnemio- Semimebranosus Bursa  = జానుభస్త్రిక బుద్బుదము ( గ.న )

Basal Metabolic Rate  =  విరామ జీవవ్యాపార ప్రమాణము ( గ.న ) ; 

విశ్రాంత జీవవ్యాపార ప్రమాణము ( డా. అడుసుమిల్లి చంద్రప్రసాద్ గారి సూచన )

Basement Membrane = మూలాధారపు పొర ( గ.న )

Basophils = క్షారాకర్షణ కణములు ( గ.న )

Benign tumors = బోళాగడ్డలు (గ.న); బేలగడ్డలు (గ.న)

Beta Adrenergic Receptor Agonists = బీటా ఎడ్రినెర్జిక్ గ్రాహక ఉత్తేజకములు ( గ.న )

Beta Adrenergic Receptor Blockers = బీటా ( ఎడ్రినెర్జిక్ ) గ్రాహక అవరోధకములు ( గ.న )

Bicuspid Valve = ద్విపత్ర కవాటము 

Bile = పైత్య రసము

Bile Ducts = పైత్య నాళములు

Biochemistry = జీవరసాయన శాస్త్రము 

Biopsy  = కణ పరీక్ష ( గ.న )

Bipolar Disorder = ద్విధ్రువ వ్యాధి ( గ.న )

Blood Transfusion = పర రక్తదానము ( గ.న )

Body Mass Index  Bmi = భార సూచిక ( గ.న )

Bone Formation  = ఎముకల నిర్మాణ ప్రక్రియ ( గ.న )

Bone Marrow  = ఎముకల మజ్జ

Bone Mineral Densitometry = అస్థిసాంద్రత చిత్రీకరణము ( గ.న )

Bone Resorption = ఎముకల శిథిలత ( గ.న )

Bradycardia = హృదయ మాంద్యము ( గ.న )

Brain Stem = మస్తిష్క మూలము

Bronchi  = పుపుస నాళములు ( గ.న )

Bronchiole = పుపుస నాళిక

Bronchitis =  శ్వాసనాళికల తాపము 

Bronchodilator Treatment  = శ్వాస నాళికా వ్యాకోచ చికిత్స ( గ.న )

Bronchodilators = శ్వాస నాళికా వ్యాకోచకములు ( గ.న )

Buccinator = బుగ్గ కండరము ; కపోలిక ( గ.న )

Bulla = బొబ్బ ( గ.న ) 

Bypass Surgeries = అధిగమన శస్త్రచికిత్సలు ( గ.న )

Cancers = పుట్టకురుపులు ; కర్కట వ్రణములు ( గ.న )

Capillaries =సూక్ష్మరక్తనాళికలు ; కేశ ( రక్త) నాళికలు

Caput Medusa = ఉదరకుడ్యములో ఉబ్బు సిరలు ( గ.న )

Carbuncle = రాచకురుపు

Carcinogens = కర్కట వ్రణ జనకములు ( గ.న)

Cardiac Arrhythmias = అసాధారణ హృదయ లయలు ( గ.న )

Cardiac Markers = హృదయ సూచకములు ( గ.న )

Cardiac Output = హృదయ ప్రసరణ ( రక్త ) ప్రమాణము ( గ.న )

Cardiac Pacemaker = హృదయ విద్యుత్ప్రేరకము, హృత్ప్రేరకము  ( గ.న )

Cardiogenic Shock = హృదయ జనిత ఘాతము / హృదయ జనిత ఉపద్రవము ( గ.న )

Cardioverter-Defifrillator = హృదయ లయ సవరణి ( గ.న )

Carotid Artery Stenosis = కంఠ ధమని సంకుచితము ( గ.న )

Casts = మూసలు

Catheter = కృత్రిమ నాళము ( గ.న )( శరీరములోనికి దూర్చు నాళము )

Cation Exchange Resins = ఋణపరమాణు వినిమయ ఔషధములు ( గ.న )

Cell Membrane = కణ వేష్టనము ( గ.న ) ; కణ పటలము

Cell Wall = కణ కవచము ; కణ కుడ్యము ( గ.న )

Cellulitis = కణ తాపము ( గ.న )

Central Nervous System = కేంద్ర నాడీమండలము 

Central Sulcus = మధ్య గర్తము ( గ.న )

Central Veins = కేంద్ర సిరలు ( గ.న )

Centrifuge = వికేంద్రీకర యంత్రము ( గ.న )

Cerebellum  = చిన్నమెదడు 

Cerebral Angiogram = మస్తిష్క ధమనీ చిత్రీకరణ ( గ.న )

Cerebro Vascular Accidents  = మస్తిష్క  (రక్తనాళ ) విఘాతములు ( గ.న )

Cerebrum  = పెద్దమెదడు  

Chemotherapy = రసాయన ( ఔషధ ) చికిత్స

Chicken Pox, Varicella = ఆటాలమ్మ 

Chronic Carriers = దీర్ఘకాల వాహకులు ( గ.న )

Chronic Obstructive Pulmonary Disease = దీర్ఘకాల శ్వాస అవరోధక వ్యాధి ( గ.న )

Chronic Renal Failure = దీర్ఘకాల మూత్రాంగ వైఫల్యము ( గ.న )

Cilia = కదలాడే సూక్ష్మకేశములు  ( గ.న )

Circulating Blood Volume = దేహ ప్రసరణ రక్తప్రమాణము (గ.న )

Cirrhosis = నారంగ కాలేయవ్యాధి ( గ.న )

Cirrhosis Of Liver = నారంగ కాలేయవ్యాధి ( గ.న )

Clotting Factors  = రక్త ఘనీభవన అంశములు ( గ.న )

Clubbing Of Fingers = డోలుకఱ్ఱల వేళ్ళు  ( గ.న )

Cocci  = గోళ సూక్ష్మజీవులు ( గ.న )

Cognitive Behavioral Therapy = స్మృతివర్తన చికిత్స ( గ.న )

Collagen = పీచుకణజాలము ( గ.న )

Collateral Circulation = ప్రత్యామ్నాయ ప్రసరణ ( గ.న )

Collecting Ducts = సమీకరణ నాళములు  ( గ.న ) 

Colonoscope = ఆంత్రాంతర దర్శిని ( గ.న ) / బృహదాంత్ర దర్శిని (గ.న)

Colonoscopy = ఆంత్రాంతర దర్శనము ( గ.న ) / బృహదాంత్ర ( పెద్దప్రేవుల ) దర్శనము (గ.న )

Common Ileac Vein  = శ్రోణి సిర ( గ.న )

Complement = సంపూరకము

Compression Fractures = సంపీడన అస్థి భంగములు ( గ.న )

Computerized Axial Tomography = గణనయంత్ర త్రిదిశ చిత్రీకరణము ( గ.న ) / గణనయంత్ర త్రిమితీయ చిత్రీకరణము ( గ.న )

Conduction = వహనము 

Congenital Diseases = జన్మ వ్యాధులు (గ.న ) ; పుట్టు వ్యాధులు

Congestive Heart Failure = హృదయ వైఫల్యము 

Conjugated Bilirubin = సంయోగపు బిలిరుబిన్ ( గ.న )

Connective Tissue = సంధాన కణజాలము 

Connective Tissue Disorders = సంధాన కణజాల వ్యాధులు ( గ.న )

Connective Tissue Protein = సంధానపు మాంసకృత్తి ( గ.న )

Contractility = ముకుళింపు ; సంకోచము

Contrast Materials =  వ్యత్యాస పదార్థములు 

Convection = సంవహనము

Core Body Temperature = శరీరాంతర ఉష్ణోగ్రత ( గ.న )

Coronary Angiography  = హృద్ధమనుల చిత్రీకరణము ( గ.న )

Coronary Arteries = హృద్ధమనులు ; హృదయ ధమనులు

Coronary Artery Bypass Surgery = హృద్ధమని అవరోధ అధిగమన శస్త్రచికిత్స ( గ.న ) 

Coronary Artery Disease = హృద్ధమనుల వ్యాధులు ; హృద్ధమనీ వ్యాధులు 

Coronary Veins = హృత్సిరలు ( గ.న )

Corrugator Supecilli = భృకుటి కండరము ( గ.న )

Cortex = బాహ్య భాగము  ( గ.న )

Costochondrtis = పార్శ్వాస్థి - మృదులాస్థి తాపము ( గ.న )

Cranial Nerves  = కపాల నాడులు 

Cricoid cartilage = అంగుళీయకాస్థి , ముద్రికా మృదులాస్థి ( గ.న )

Crico pharyngeal sphincter = ముద్రికా గళ నియంత్రణ కండరము ( గ.న )

Cryoprobes  = శీతల శలాకలు

C T Angiogram  = గణనయంత్ర త్రిదిశ ధమనీ చిత్రీకరణము ( గ.న ) / గణనయంత్ర త్రిమితీయ ధమనీ చిత్రీకరణము ( గ.న )

Deep Fascia = కండర ఆచ్ఛాదనము ( గ.న )

Deep Plantar Artery Of Dorslis Pedis Artery = నిమ్నపాద ధమని ( గ.న )

Deep Vein Thrombosis = నిమ్నసిర రక్తఘనీభవనము ( గ.న )

Deep Veins = నిమ్న సిరలు ( గ.న )

Defibrillator = ప్రకంపన నివారణి ( గ.న )

Degenerative Diseases = శిథిల వ్యాధులు 

Dehydration = ఆర్ద్ర క్షీణత ( గ.న ) / శోషణము

Delerium = సన్నిపాతం, సంధి, మతిభ్రంశము ; స్మృతిభ్రంశము 

Depression = మానసికపు దిగులు

Deprressor Anguli  Oris = వక్త్రకోణ నిమ్న కండరము ( గ.న )

Dermatome = నాడీపాలిత చర్మవిభాగము ( గ.న )

Dermatophytes = చర్మాంకురములు ( గ.న )

Descending Loop = దిగు మెలిక (  గ.న )

Detoxification = విషహరణము

Diabetes = మధుమేహ వ్యాధి 

Diagonal Branches = వక్ర శాఖలు ( గ.న )

Dialysis = రక్తశుద్ధి 

Diastole = హృదయ వికాసము ( గ.న )

Diastolic Pressure = వికాస పీడనము ( గ.న )

Diffuse Toxic Goiter =  స్రావకోద్రేక సమగళగండము ( గ.న )

Digital Arteries  = అంగుళిక ధమనులు ( గ.న )

Digital Vein  = అంగుళిక సిర ( గ.న )

Dimorphic  = ద్విరూపి 

Diplopia = ద్విదృష్టి ( గ.న )

Direct Bilirubin = పత్యక్ష  బిలిరుబిన్ ( గ.న )

Direct Fluorescent Antibody test = ప్రత్యక్ష ప్రతిదీప్త ప్రతిరక్షక పరీక్ష ( గ.న )

Disease Sensitivity = వ్యాధి గ్రహణత ( గ.న )

Disease Specificity = వ్యాధి నిర్దిష్టత ( గ.న )

Disinfectants = వ్యాధిజనక విధ్వంసకములు ( గ.న )

Dissecting Aortic Aneurysm = బృహద్ధమని విదళన బుద్బుదము ( గ.న )

Dissecting Aortic Aneurysm = బృహద్ధమని విదళన వ్యాకోచము ( గ.న ) ;   బృహద్ధమని విదళన బుద్బుదము ( గ.న ) / విచ్ఛేదన బృహద్ధమని బుద్బుదము ( గ.న )

Disseminated Intravascular Coagulation = విస్తృత రక్తనాళాంతర రక్తఘనీభవనము ( గ.న )

Distillation = బట్టీపట్టుట

Diuretics  = మూత్ర ప్రేరకములు ( గ.న ) ; మూత్రకారకములు

Dorsal Arterial Plantar Arch = ఊర్ధ్వపాద ధమనీ  చాపము ( గ.న )

Dorsal Venous Arch Of Foot = ఊర్ధ్వపాద సిరచాపము  ( గ.న )

Dorsalis Pedis Artery = ఊర్ధ్వపాద ధమని ( గ.న )

Duodenum = ప్రథమాంత్రము 

Dysarthria = పలుకు తొట్రుపాటు ( గ.న )

Dyslipidemias =   వస ( కొవ్వు పదార్థ ) విపరీతములు ( గ.న )

Dysphagia = కష్ట కబళనము ( గ.న )

Dysplasia = ప్రమాదకర కణ పరిణామము  / ప్రమాదకర కణ వృద్ధి ( గ.న )

Echocardiography = హృదయ ప్రతిధ్వని చిత్రీకరణము ( గ.న )

Echogenicity = ప్రతిధ్వనిత్వము ( గ.న )

Ecthyma  = కోప వ్రణములు ( గ.న )

Edema = నీటి ఉబ్బు ; నీటి వాపు ( గ.న )

Efferent Arteriole = నిష్క్రమణ ధమనిక  ( గ.న )

Ejection Fraction = ప్రసరణ శాతము ( గ.న )

Elastic Tissue = సాగు కణజాలము ( గ.న )

Electro Cauterization = విద్యుద్దహన చికిత్స ( గ.న )

Electro Convulsive Therapy = విద్యుత్ ప్రేరణ మూర్ఛ చికిత్స ( గ.న )

Electrocardiography = హృదయ విద్యుల్లేఖనము ; విద్యుత్ హృల్లేఖ

Electroencephalogram = మస్తిష్క విద్యల్లేఖనము ; విద్యుత్ మస్తిష్కలేఖనము ( గ.న )

Electrolytes = విద్యుద్వాహక లవణములు

Electromyography = విద్యుత్ కండరలేఖనము ( గ.న )

Emboli = రక్తప్రసరణ అవరోధకములు ( గ.న ) ; ప్రసరణ అవరోధకములు ; ప్రవాహ అవరోధకములు ( గ.న )

Emphysema = ఊపిరితిత్తుల వ్యాకోచ వ్యాధి ; ఊపిరితిత్తుల ఉబ్బు ( గ.న )

Encephalitis = మెదడువాపు

End Diastolic Volume = వికాసాంతర ( రక్త ) ప్రమాణము ( గ.న )

Endocarditis  = హృదయాంతర తాపము ( గ.న )

Endocrine Disorders = వినాళగ్రంథి వ్యాధులు 

Endoscope = అంతర్దర్శిని ( గ.న )

Endoscopic Examinations = అంతర్దర్శన పరీక్షలు ( గ.న )

Endoscopy = అంతర్దర్శనము ( గ.న )

Endotoxins = అంతర జీవవిషములు ( గ.న )

Endotracheal Tube = శ్వాసనాళాంతర ( కృత్రిమ ) నాళము ( గ.న ); ఊపిరిగొట్టము (గ.న)

Endovenous Ablation  = సిరాంతర విధ్వంసము ( గ.న )

Energy Rich Foods = శక్తిసాంద్ర ఆహారములు ( గ.న )

Envelope = కోశము

Enzyme =  జీవోత్ప్రేరకము ( గ.న )  ( జీవ + ఉత్ప్రేరకము ( Catalyst ) ( గ.న )

Eosinophilic esophagitis = ఆమ్లాకర్షణ కణ అన్ననాళ తాపము ( గ.న )

Eosinophils = ఆమ్లాకర్షణ కణములు ( గ.న )

Epidemic = బహుళ వ్యాపక వ్యాధి

Epiglottis = స్వరపేటిక మూత ( గ.న )

Erythropoietin = రక్తోత్పాదిని ( గ.న )

Esophageal hiatus = అన్ననాళ రంధ్రము ( ఉదారవితానములో ) ( గ.న )

Esophageal Varices = అన్నవాహిక ఉబ్బుసిరలు ( గ.న ) ; అన్ననాళపు ఉబ్బుసిరలు ( గ.న )

Esophagitis  = అన్నవాహిక తాపము ( గ.న )

Esophago Gastroduodenoscopy =  అన్ననాళ జఠరాంత్ర దర్శనము ( గ.న )

Ethmoidal sinuses = చాలన కుహరములు (గ.న ) ; జల్లెడ గుహలు ( గ.న )

Eustachian tubes = శ్రవణగళ నాళికలు ( గ.న )

Exercise Electrocardiography = వ్యాయామ  హృదయ విద్యుల్లేఖనము ( గ.న )

Exercise Stress Testing  = వ్యాయామపు ఒత్తిడి పరీక్ష గ.న )

Exophthalmos = వెలిగుడ్లు ( గ.న ) 

External Carotid Artery = బాహ్య కంఠ ధమని ( గ.న )

External Ileac Artery = బాహ్య శ్రోణిధమని 

External Ileac Vein = బాహ్య శ్రోణిసిర ( గ.న )

Extrinsic Factor = బాహ్యాంశము ( విటమిన్ B12 ) ( గ.న )

Eye Patch = కనుకప్పు ( గ.న )

Facial ( Nerve ) Canal = ముఖనాడి అస్థినాళము ( గ.న )

Facial Muscles = ముఖ కండరములు

Facial Nerve = ముఖ నాడి

Facial Paralysis = ముఖ పక్షవాతము ( గ.న )

False Positive Results = తప్పుడు అనుకూల ఫలితములు ( గ.న )

Fascia = కండరాచ్ఛాదనము ( గ.న )

Fatty Acids = వసామ్లములు ; కొవ్వు ఆమ్లములు

Fatty Liver Disease = కాలేయపు కొవ్వు ( వస ) వ్యాధి ( గ.న )

Fecal-Oral Route = పురీష వదన మార్గము ( గ.న )

Feed Back = ప్రతివర్తమానము ( గ.న )

Femoral Artery =  ఊరు ధమని ( గ.న )(ఊరువు = తొడ )

Femoral Vein  = ఊరు సిర 

Fibrin = తాంతవము 

Fibrinogen = తాంతవజని 

Fibroblasts = తంతుకణములు ; పీచుకణములు ( గ.న )

Fibrosis = తంతీకరణము

Fibrous Tissue = పీచుకణజాలము ( గ.న ) , తంతుకణజాలము

Fistula = వ్రణ నాళము , కుహరాంతర నాళము ( గ.న ), సంధి నాళము ( గ.న)

Flexible endoscope = నమన అంతర్దర్శిని (గ.న)

Fluid Overload = ద్రవ భారము ( గ.న )

Foam Cells = ఫేన కణములు (గ.న )

Forced Expiration = సత్వర సుదీర్ఘ నిశ్వాసము (గ.న )

Forced Expiratory Volume- 1= బలనిశ్వాస వాయుపరిమాణము-1 ( మొదటి సెకండులో బలముగా వదల గలిగే గాలి పరిమాణము - గ.న )

Forced Inspiration = సుదీర్ఘ సంపూర్ణ ఉచ్ఛ్వాసము ( గ.న )

Forced Vital Capacity = ( సంపూర్ణ ) శ్వాస ప్రమాణము ( గ.న )

Fractures Of Bones = అస్థి భంగములు 

Frontal Lobe = ( మస్తిష్క ) లలాట భాగము ( గ.న )

Frontal sinuses = లలాట కుహరములు ( గ.న )

Fungal Infections = శిలీంధ్ర వ్యాధులు 

Fungal Spores = శిలీంధ్ర బీజములు

Fungi = శిలీంధ్రములు 

Furuncle = సెగగడ్డ

Gastrectomy = జఠర ఖండనము ( గ.న )

Gastric Atrophy = జఠర క్షయము ( గ.న )

Gastric Balloon = కడుపు బుడగ ( గ.న ) ; జఠర బుద్బుదము ( గ.న )

Gastric Banding = జఠర బంధన చికిత్స  ( గ.న )

Gastric Resection = జఠర ఛేదనము ( గ.న )

Gastritis = జఠర తాపము , జీర్ణాశయ తాపము (గ.న )

Gastro Jejunal Anastomoses / Gastro-Jejunostomy = జఠరాంత్ర సంధానము ( గ.న )

Gastrointestinal Disorders = జీర్ణమండల వ్యాధులు 

Gastroscope = జఠరాంతర దర్శిని ( గ.న )

Gastroscopy = జఠరాంతర దర్శనము, ( గ.న )

Genes = జన్యువులు 

Genetic Disorders  = జన్యు సంబంధ వ్యాధులు

Genetic Mutation  = జన్యువుల మార్పు ; జన్యు పరివర్తనము ( గ.న )

Genome = జన్యు పదార్థము ( గ.న )

Gestational Diabetes = గర్భిణీ మధుమేహము  

Glomerular Diseases =  ( మూత్రాంగ ) కేశనాళికా గుచ్ఛవ్యాధులు ( గ.న )

Glomerular Filtration Rate =  కేశనాళికా గుచ్ఛముల వడపోత ప్రమాణము ( గ.న )

Glomerulonephritis = కేశనాళికా గుచ్ఛతాపము ( గ.న )

Glomerulus =  మూత్రాంక కేశనాళికా గుచ్ఛము ( గ.న )

Gloves = చేదొడుగులు

Gluconeogenesis = శర్కర నవజాతము (గ.న )

Glucose Intolerance = శర్కర అసహనము ( గ.న )

Glycemic Index = (రక్తపు) చక్కెర సూచిక ; శర్కర సూచిక ( గ.న )

Glycogenesis = మధుజని జాతము (గ.న )

Glycogenolysis = మధుజని విచ్ఛిన్నము (గ.న )

Glycoproteins = శర్కర మాంసకృత్తులు ( గ.న )

Goitre = గలగండము

Granules =  కణికలు ; రేణువులు

Granulocytes = కణికల కణములు ( గ.న ) ; రేణుకణములు ( గ.న )

Granulocytic leukemia = రేణుశ్వేతకణ బాహుళ్యవ్యాధి ( గ.న )- ( సత్వర ( acute ) & దీర్ఘకాలిక ( chronic )

Great Saphenous Vein  = గరిష్ఠ దృశ్యసిర ( గ.న )

Growth Hormone  = ప్రవర్ధన స్రావకము ( గ.న )

Hair Follicles = రోమ కూపములు

Heart Attack  ( Myocardial Infarction ) =  హృదయ ఘాతము ( గ.న ) ;  గుండెపోటు

Heat Edema = వడ పొంగు ( గ.న )

Heat Exhaustion = వడ బడలిక ( గ.న )

Heat Rash = చెమట కాయలు ; చెమట పొక్కులు ; ఉష్ణ విస్ఫోటనము ( గ.న )

Heat Stroke = ఉష్ణ ఘాతము ( గ.న ) ; వడదెబ్బ

Heat Syncope =  వడ సొమ్మ ( గ.న )

Hematemesis = రక్త వమనము 

Hematocrit =  రక్త (కణ ) సాంద్రత ( గ.న )

Hematoma = కణజాలములో రక్తపుగడ్డ ( గ.న )

Hematopoietic Disorders = రక్తోత్పాదన వ్యాధులు ( గ.న )

Hemianopsia = అర్ధాంధత్వము ( గ.న ) ; సగం చూపు ; సగం చీఁకు ( గ.న )

Hemochromatosis =  అయ ( ఇనుము ) వర్ణకవ్యాధి ( గ.న )

Hemodialysis = రక్తశుద్ధి

Hemolysis = రక్తకణ విచ్ఛేదనము ( గ.న )

Hemolytic /Prehepatic Jaundice = రక్తకణ విచ్ఛేదనపు / కాలేయ పూర్వపు కామెరలు ( గ.న )

Hemolytic Anaemias = రక్తవిచ్ఛేదన రక్తహీనము ( గ.న )

Hemoptysis  = రక్తశ్లేష్మము (గ.న);  రక్త కఫము ( గ.న )

Hemorrhage = రక్తస్రావము 

Hemostasis = రక్తస్రావ నివారణము ( గ.న ) ; రక్త స్థిరత్వము ( గ.న )

Hepatic / Hepatocellular Jaundice = కాలేయపు కామెరలు ( గ.న )

Hepatic Elastography = కాలేయ స్థితిస్థాపకత చిత్రీకరణ ( గ.న )

Hepatic Encephalopathy = కాలేయ మతిభ్రంశము ( గ.న )

Hepatic Vein = కాలేయ సిర 

Hepatitis = కాలేయ తాపము ( గ.న )

Hepatorenal Syndrome  = కాలేయ మూత్రాంగవైఫల్యము ( గ.న )

Hereditary Spherocytosis = వంశపారంపర్య గోళకణ వ్యాధి ( గ.న ) ; వంశపారంపర్య గోళాకార కణ వ్యాధి ( గ.న )

Hernia = అవయవ భ్రంశము ; అవయవ గళనము ( గ.న )

Herpes Zoster = అగ్గిచప్పి / అగ్నిసర్పి / ఒడ్డాణపు చప్పి ( గ.న ) / మేఖల విసర్పణి (గ.న ) 

Hiatal hernia = రంధ్ర ( అవయవ ) గళనము ( గ.న )

High Density Lipoproteins = అధికసాంద్రపు లైపోప్రోటీనులు ( గ.న )

High Output  Failure  = అధిక ప్రసరణ వైఫల్యము ( గ.న )

Hips = తుంటి ఎముకలు

Histamine -2 Receptor Blockers = హిస్టమిన్ - 2 గ్రాహక అవరోధకములు ( గ.న ) /  హిష్టమిన్ గ్రాహక అవరోధకములు ( గ.న )

Hormones = నిర్నాళ రసములు ; వినాళ స్రావకములు 

Humidifier = ఆర్ద్ర సాధనము ( గ.న )

Humoral Immunity = స్రావక రక్షణ ( గ.న )

Hydrocephalus = జలశీర్షము , జలశిరస్సు ( గ.న )

Hydrochloric Acid = ఉదజహరికామ్లము 

Hydrolysis =  జల విచ్ఛేదన 

Hydronephrosis = జల మూత్రాంగము ( గ.న )

Hydrophilic = జలాపేక్షక 

Hydrophobia = జలభయము ; కుక్కకాటు వెఱ్ఱి

Hydrophobic = జలవికర్షణ 

Hyoid bone = కంఠికాస్థి

Hyper Coagulability =  అధిక ( శీఘ్ర ) రక్త ఘనీభవన లక్షణము ( గ.న )

Hyperparathyroidism = సహగళగ్రంథి ఆధిక్యత ( గ.న )

Hypersplenism  = ప్లీహ ఉద్రేకము ( ప్లీహోద్రేకము ) ; ప్లీహాతిశయము ( గ.న )

Hypertension = అధిక రక్తపీడనము ; అధిక రక్తపు పోటు 

Hypertensive Crisis = అధిక రక్తపీడన సంక్షోభము ( గ.న )

Hyperthermia = తీవ్ర జ్వరము ( గ.న )

Hyperthyroidism = గళగ్రంథి ఆధిక్యత ( గ.న )

Hypertrophic Cardiomyopathy  = హృదయకండర అతివృద్ధివ్యాధి  ( గ.న )

Hyperventilation = అధిక శ్వాసలు

Hyphae = శిలీంధ్రపు పోగులు 

Hypoglycemia = శర్కర హీనత ( గ.న )

Hypogonadism = బీజగ్రంథుల హీనత 

Hypopharynx = అధోగళము ( గ.న )

Hypopigmentation = వర్ణ హీనత ( గ.న )

Hypotension = రక్తపీడన హీనత ( గ.న ) ; అల్ప రక్తపీడనము ( గ.న )

Hypothyroidism = గళగ్రంథి హీనత ( గ.న )

Hypovolemia = ద్రవపరిమాణ హీనత ( గ.న ) /  రక్తప్రమాణ హీనత ( గ.న )

Hypoxia = ప్రాణవాయువు హీనత; ఆమ్లజని హీనత (గ.న)

Iatrogenic = చికిత్సా జనితము ( గ.న )

Icosahedron = వింశతిఫలకము

Ileac Arteries = శ్రోణి ధమనులు

Ileum = శేషాంత్రము 

Immune System =  దేహ రక్షణ వ్యవస్థ ( గ.న )

Immunoglobulins = రక్షక మాంసకృత్తులు ( గ.న )

Immunological System = శరీర రక్షణ వ్యవస్థ ( గ.న )

Immunotherapy = ప్రతిరక్షిత చికిత్స ( గ.న )

Impetigo = అంటు పెచ్చులు ( గ.న )

Incubation Period = అంతర్గతస్థితి కాలము, అగోచరస్థితి,  మఱుగుపాటు కాలము ( గ.న )

Indian Childhood Cirrhosis = భారతీయ శిశు నారంగ కాలేయవ్యాధి ( గ.న )

Indirect Bilirubin = పరోక్ష బిలిరుబిన్  ( గ.న )

Induration = గట్టితనము 

Infarction  = ప్రసరణరహిత మరణము ( గ.న )

Infection = సూక్ష్మజీవులదాడి (గ.న) సూక్ష్మజీవుల  ఆక్రమణ ( దాడి ) ( గ.న )

Infestation  = ఆక్రమిత వ్యాధి ( గ.న )

Inferior Venacava = అధోబృహత్సిర

Influenza = వ్యాపక జ్వరము ( గ.న )

Inhaler = పీల్పువు ( గ.న )

Inter Ventricular Septum = జఠరికాంతర కుడ్యము ( గ.న ) జఠరికల నడిమి గోడ ( గ.న )

Intermediate Artery = మధ్యస్థ ధమని ( గ.న )శ

Intermediate Density Lipoproteins = అల్పతర సాంద్ర లైపో ప్రోటీనులు (గ.న )

Intermittent Claudication  = సవిరామపు పోటు ( గ.న )

Intermittent Pneumatic Compression Devices = సవిరామ వాయుపీడన సాధనములు ( గ.న )

Internal Auditory Meatus =  అంతర శ్రవణరంధ్రము ( గ.న )

Internal Capsule = ఆంతర గుళిక ( గ.న )

Internal Carotid Artery = అంతర కంఠ ధమని (గ.న )

Internal Ileac Vein = అంతర శ్రోణిసిర ( గ.న )

Internal Mammary Artery = అంతర స్తన ధమని ( గ.న )

Internalileac Artery = అంతర శ్రోణి ధమని

Intertriginous Tinea Pedis = అంగుళాంతరశిలీంధ్ర వ్యాధి ( గ.న )

Intestinal metaplasia = ఆంత్ర పరిణామము ( గ.న )

Intima = రక్తనాళపు లోపొర  ( గ.న )

Intracranial Pressure = కపాలాంతర పీడనము ( గ.న )

Intraparenchymal Hemorrhage = ( మస్తిష్క ) కణజాలాంతర రక్తస్రావము  ( గ.న )

Intravenous Drugs = సిరాంతర ఔషధములు ( గ.న )

Intrinsic Factor = అంతరాంశము ( గ.న )

Invasive Procedures = ఆక్రమణ ప్రక్రియలు ( గ.న )

Ischemia = రక్తప్రసరణ లోపము ( గ.న )

Ischemic Heart Disease= హృదయ రక్తప్రసరణ లోపవ్యాధి ( గ.న )

Jaundice = పచ్చకామెర్లు , కామెర్లు , పసరికలు  

Jejunum = మధ్యాంత్రము 

Keratitis = స్వచ్ఛపటల తాపము ( గ.న )

Kerions =  శిలీంధ్ర రోమకూప వ్రణములు ( గ.న )

Kidneys = మూత్రాంగములు   ( గ.న )

Kyphosis = గూని 

Laparoscopy = ఉదర దర్శనము ( గ.న ) / ఉదరాంతర దర్శనము ( గ.న )

Laryngeal Edema = గొంతుకోవి పొంగు (గ.న); స్వరపేటికలో పొంగు ( గ.న )

Laryngeal Spasm = స్వరపేటిక బిగుతు ( గ.న )

Lateral Plantar Artery = పార్శ్వ పాదతల ధమని( గ.న )

Lateral Sulcus = పార్శ్వగర్తము ( గ.న )

Left Anterior Descending Artery = వామ పూర్వ అవరోహణ ధమని ( గ.న )

Left Circumflex Artery = వామ పరిభ్రమణ ధమని ( గ.న )

Left Coronary Artery = వామ హృద్ధమని ( గ.న )

Left Ventricular Ejection Fraction = ఎడమ జఠరిక ( రక్త ) ప్రసరణశాతము ( గ.న )

Lesser Saphenous Vein = కనిష్ఠ దృశ్యసిర ( గ.న )

Leukocytes = తెల్లకణములు 

Leukemia = శ్వేతకణ బాహుళ్యవ్యాధి ( గ.న ) ; శ్వేతకణీయము ( గ.న )

Levator Labii Superioris = అధర ఉద్ధరణ కండరము ; ఊర్ధ్వ అధరోద్ధరణ కండరము ( గ.న )

Life jacket = ప్రాణకవచము (గ.న)

Life Styles  = జీవనరీతులు ( గ.న )

Lining Cells = పూత కణములు ( గ.న )

Liver = కాలేయము 

Liver Enzymes = కాలేయ జీవోత్ప్రేరకములు ( గ.న )

Liver Function Tests = కాలేయ వ్యాపార పరీక్షలు

Liver Transplantation = పరకాలేయ దానము ( గ.న )

Low Density Lipoproteins = అల్పసాంద్రపు కొలెష్టరాలు ( గ.న ) / అల్పసాంద్రపు లైపోప్రోటీనులు ( గ.న )

Lower Motor Neuron Paralysis = అధశ్చలన నాడీ పక్షవాతము ( గ.న )

Lower Motor Neurons   = అధశ్చలన నాడీకణములు ( గ.న )

Lymph Glands  / Lymph Nodes = రసిగ్రంథులు

Lymphatic Channels = రసినాళికలు ( గ.న )

Lymphocytes = రసి కణములు ( గ.న )

Lymphocytic leukemia = రసికణ బాహుళ్యవ్యాధి ( గ.న )

Lypolysis = మద విచ్ఛిన్నము ( గ.న )

Macrocytes = పృథుకణములు

Macrocytosis = పృథు కణత్వము ( గ.న )

Macrophages = పృథు భక్షక కణములు ( గ.న )

Magnetic Resonance Angiogram = అయస్కాంత ప్రతిధ్వని రక్తనాళ చిత్రీకరణము ( గ.న ) /  అయస్కాంత ప్రతిధ్వని ధమనీ చిత్రీకరణము ( గ.న )

Magnetic Resonance Imaging = అయస్కాంత ప్రతిధ్వని చిత్రీకరణము ( గ.న ) /  అయస్కాంత ప్రతినాద చిత్రీకరణ ( గ.న )

Magnetic Resonance Perfusion Imaging = అయస్కాంత ప్రతిధ్వని ( హృదయ ) ప్రసరణ చిత్రీకరణములు ( గ.న )

Major Depression = పెను దిగులు ( గ.న )

Malaise = నలత  ( గ.న )

Mammogram = స్తన చిత్రీకరణము ( గ.న )

Mandibular Nerve = అధోహనువు నాడి (గ.న )

Mania = ఉన్మాదపు పొంగు ( గ.న )

Manometry = పీడన పర్యవేక్షణ ; పీడన చిత్రీకరణము ( గ.న )

Masks = కప్పులు ; ఆచ్ఛాదనములు

Mastocytes / Mast cells =  స్తంభ కణములు ( గ.న )

Mastocytosis = స్తంభకణ వ్యాధి ( గ.న )

Matrix = మాతృక 

Maxillary Nerve = హనువు నాడి ( గ.న )

Maxillary sinuses = హనుకుహరములు ( గ.న )

Medial Plantar Artery = మధ్యస్థ పాదతల ధమని ( గ.న )

Medially = మధ్యస్థముగా 

Medulla = అంతర్భాగము ( గ.న )

Melena = నల్ల విరేచనములు ( జీర్ణమండలములో రక్తస్రావము జరిగి రక్తము నల్లరంగుని పొందుట వలన కలుగుతాయి ) ( గ.న )

Membrane Attack Complexes (Macs) = కణవేష్టన ఆక్రమణ వ్యవస్థలు ( గ.న )

Memory Cells = జ్ఞాపక కణములు ( గ.న )

Meningitis = నాడీమండల ( మస్తిష్క )  వేష్టన తాప వ్యాధి (గ.న )

Mental Depression =   మానసికపు క్రుంగు ; మానసికపు కుంగు ( గ.న )

Mentalis = చిబుక కండరము ( గ.న )

Metabolic Acidosis = జీవ వ్యాపార ఆమ్లీకృతము ( గ.న )

Metabolism = జీవ వ్యాపార క్రియ ( గ.న ) / శరీర వ్యాపకము ; జీవ వ్యాపారము ( గ.న )

Metastasis = అవయవాంతర వ్యాప్తి ( గ.న )

Metatarsal Artery ,( Or ) Arcuate Artery = మధ్యపాద ధమని శాఖ ( గ.న )

Microbiology  = సూక్ష్మజీవుల శాస్త్రము 

Microcyte = లఘుకణము, సూక్ష్మకణము (గ.న )

Microcytosis = లఘు కణత్వము ( గ.న ), సూక్ష్మకణత్వము ( గ.న )

Middle Cerebral Artery = మధ్య మస్తిష్క ధమని ( గ.న )

Minor Depression = చిన్న కుంగు ; చిన్న దిగులు ( గ.న )

Mitral Regurgitation = ద్విపత్రకవాట తిరోగమన రక్తప్రసరణము  ( గ.న )

Moisturizers = ఆర్ద్ర ఔషధములు ( గ.న )

Monoclonal Antibody = ఏకరూపక ప్రతిరక్షకము ( గ.న )

Monocytes = ఏక కణములు ( గ.న )

Monosaccharides = ఏక శర్కరలు ( గ.న )

Mood Disorders = మానసికస్థితి వైపరీత్యములు ( గ.న )

Motor Cortex  =. చలన వల్కలము ( గ.న )

Mucosa =  శ్లేష్మపు పొర

Multinodular Goiter  = బహుళకిణ గళగండము (గ.న )

Murmurs = మర్మర శబ్దములు ( గ.న )

Muscle Relaxants = కండర విశ్రామకములు ( గ.న )

Myocardial Infarction = గుండెపోటు / హృదయ ఘాతము ( గ.న )

Myocardial Perfusion Defects  = హృదయ కండర రక్తప్రసరణ లోపములు ( గ.న )

Myocardial Perfusion Imaging = హృదయ ప్రసరణ  చిత్రీకరణము (గ.న )

Myocarditis = హృదయ కండర తాపము ( గ.న )

Nail Bed = నఖ క్షేత్రము ( గ.న )

Nasal Decongestants = నాసికా నిస్సాంద్రకములు ( గ.న )

Nasal Sinuses = నాసికా కుహరములు ( గ.న )

Nasal Turbinates ; Nasal Conchae = నాసికా శుక్తులు ( గ.న )

Nasogastric Tube = నాసికా జఠర నాళము ( గ.న )

Nasolabial Fold = నాసికాధర వళి ( గ.న )

Nasopharynx = నాసికాగళము ( గ.న )

Nausea =  వమన (వాంతి) భావన ( గ.న ) ; డోకు

Nebulizer = శీకర యంత్రము ( గ.న )

Neoplasms = కొత్త పెరుగుదలలు 

Nephrons = మూత్రాంకములు  ( గ.న )

Nephrotoxins  = మూత్రాంగ విషములు ( గ.న )

Nervous System = నాడీమండలము

Neuralgia = నాడీ వ్యథ ( గ.న )

Neuritis = నాడి వాపు ( గ.న )

Neuromuscular Junction. = నాడీతంతు కండర సంధానము ( గ..న )

Neurons = నాడీ కణములు

Neurotransmitters = నాడీ ప్రసరిణులు

Neutrophils = తటస్థ కణములు ( గ.న )

Nodules = కణుతులు 

Non Granulocytes = కణికరహిత కణములు ( గ.న )

Nonalcoholic Steatohepatitis = మద్యేతర వస కాలేయతాపము ( గ. న )

Normocytosis = సామాన్య కణత్వము ( గ.న )

Nystagmus = నేత్ర కంపనము , కనుగుడ్డు వణకు ( గ.న )

Obesity = స్థూలకాయము

Obstructive Jaundice / Post Hepatic Jaundice = అవరోధపు కామెరలు / కాలేయానంతరపు కామెరలు ( గ.న )

Obstructive Lung Diseases = అవరోధక పుపుస వ్యాధులు ( గ.న )

Obstructive Sleep Apnea = నిద్ర అవరోధక శ్వాసభంగము ( గ.న ) /  నిద్రావరోధక శ్వాసభంగము ( గ.న )/ నిద్రలో శ్వాసభంగములు

Occipital Lobe = ( మస్తిష్క ) పృష్ఠ భాగము ( గ.న )

Occipito-Frontalis Muscle = పృష్టశిర లలాట కండరము ( గ.న )

Occupational Therapy = వృత్తి చికిత్స  

Oligomenorrhea  =  మంద ఋతుస్రావము ( గ.న )

Opthalmic Nerve = నేత్రకుహర నాడి ( గ.న )

Orbicularis Oculi = నేత్రమండలిక కండరములు (గ.న )

Orbits = నేత్రకుహరములు ( గ.న )

Organ transplantation = పర అవయవ దానము ( గ.న )

Oropharynx = వక్త్రగళము ( గ.న )

Osteitis Fibrosa Cystica = తంతుకణజాల బుద్బుద అస్థి వ్యాధి ( గ.న )

Osteoblasts  = అస్థినిర్మాణ కణములు ( గ.న )

Osteoclasts = అస్థిశిథిల కణములు ( గ.న )

Osteonecrosis = అస్థి నిర్జీవత ( గ.న )

Osteopenia  = ఎముకల బలహీనత (గ.న )

Osteoporosis = గుల్ల ఎముకలవ్యాధి ; అస్థి సాంద్ర క్షీణత ( గ.న )

Otitis Media = మధ్య చెవి తాపము ( గ.న ) మధ్య కర్ణ తాపము ( గ.న )

Over Weight = అధిక భారము ( గ.న )

Overt Hypothyroidism = విదిత గళగ్రంథి హీనత ( గ.న )

Oxidation = ఆమ్లజనీకరణము

Oxygen Carrying Capacity = ప్రాణవాయువు వాహక సామర్థ్యత ( గ.న )

Oxygen Saturation =  ప్రాణవాయు (వు) సంతృప్తత 

Oxygenation = ఆమ్లజనీకృతము ( గ.న )

Palate = తాలువు ; అంగిలి

Palliative Care = ఉపశమన చికిత్స

Palmar Aponeurosis ( Fascia ) = అరచేతి  కండర ఆచ్ఛాదనము ( గ.న )

Pancreatitis = క్లోమ తాపము ( గ.న )

Pandemics = విశ్వవ్యాపక వ్యాధులు ( గ.న )

Papilloedema  = కనుబింబపు పొంగు ( గ.న )

Papules = గట్టి పొక్కులు ( గ.న ) ( వీటిలో ద్రవము ఉండదు )

Paralysis = పక్షవాతము

Paranasal Sinuses = నాసికా కుహరములు ( గ.న )

Paranoid Behavior = సంశయ ప్రవర్తన ( గ.న )

Parasites  = పరాన్నభుక్తులు 

Parasympathetic Nervous System = పరానుభూత నాడీ వ్యవస్థ

Parathyroid Glands  = సహగళ గ్రంథులు ( గ.న )

Parathyroid Hormone = సహగళగ్రంథి స్రావకము ( గ.న )

Parenteral Routes = ఆంత్రేతర మార్గములు ( గ.న )

Parietal Lobe = ( మస్తిష్క ) పార్శ్వభాగము ( గ.న )

Parotid Salivary Gland = శ్రవణమూల లాలాజలగ్రంథి ( గ.న )

Paroxysmal Nocturnal Hemoglobinuria ( Pnh ) = సంవిరామ నిశా రక్త ( వర్ణక ) మూత్రము ( గ.న )

Partial Gastrectomy = పాక్షిక జఠర విచ్ఛేదన ( గ.న )

Passive immunity =  అచేతన ( జడ ) రక్షణ ( గ.న )

Pathogens =  వ్యాధి కారకములు , రోగ జనకములు ; వ్యాధి జనకములు ( గ.న )

Pathology = వ్యాధివిజ్ఞాన శాస్త్రము

Peak Bone Mass = గరిష్ఠ అస్థిరాశి ( గ.న )

Peak Flow = గరిష్ఠ వాయు ప్రవాహము (గ.న )

Peak Flow Meter = గరిష్ఠ ( శ్వాస ) ప్రవాహ మానిక ( గ.న )

Peau D’ Orange = నారంగ చర్మము ( గ.న )

Peptic Ulcer = జీర్ణ వ్రణము ( గ.న )

Perforator Veins = ఛిద్ర సిరలు ( గ.న )

Perfusion Defects = ప్రసరణ లోపములు ( గ.న )

Pericardial Constriction = హృత్కోశ ఆకుంచనము ( గ.న )

Pericardial Effusion = జల హృత్కోశము ( గ.న )

Pericarditis = హృత్కోశ తాపము ( గ.న ) /  హృదయవేష్టన తాపము ( గ.న )

Peripheral Arterial Disease = దూర ధమని వ్యాధి ( గ.న )

Peripheral Nervous System = వికేంద్ర నాడీమండలము 

Peripheral Neuritis = దూరనాడుల తాపము ( గ.న )

Peripheral Vasodilation = దూర రక్తనాళ వ్యాకోచము ( గ.న )

Peristalsis = మృదుకండర చలనము ( గ.న )

Peritoneal Dialysis = ఉదర వేష్టన రక్తశుద్ధి ( గ.న )

Peritonitis = ఉదర ( ఆంత్ర ) వేష్టన తాపము  ( గ.న )

Pernicious Anaemia = ప్రమాదకర రక్తహీనత ( గ.న )

Phagocytes = భక్షక కణములు

Pharmacology = ఔషధ శాస్త్రము

Pharynx = గళము ; గొంతు ; సప్తపథ 

Physical Therapy = వ్యాయామ చికిత్స ( గ.న )

Physiology = శరీరవ్యాపార శాస్త్రము 

Pituitary Gland = పీనస గ్రంథి

Plantar Arterial Arch = పాదతల ధమనీ చాపము ( గ.న )

Plaques  = ఫలకలు

Plasma = రక్తద్రవము ( గ.న )

Plasma Cells = స్రావక కణములు ( గ.న )

Plasma= రక్త ద్రవము ( గ.న )

Plasmapheresis = రక్తద్రవ గ్రహణము ( గ.న )

Platelets  = ( రక్త ) సూక్ష్మఫలకములు   ( గ.న )

Pleural Diseases = పుపుసవేష్టన వ్యాధులు 

Pluripotent Stem Cells = బహుళ సామర్థ్య మూలకణములు ( గ.న )

Pneumonitis  = ఊపిరితిత్తుల తాపము ( గ.న ) / పుపుస తాపము ( గ.న ) / శ్వాసకోశ తాపము ( గ.న )

Pneumothorax  = పుపుసవేష్టన వాయువు ( గ.న )

Polpliteal Artery = జాను ధమని ( గ.న )

Polycystic Kidney Disease = బహుళ బుద్బుద మూత్రాంగ వ్యాధి ( గ.న )

Polycythemia Vera  = బహుళ రక్తకణ వ్యాధి ( గ.న ) ; రక్తకణ బాహుళ్యవ్యాధి ( గ.న )

Polysaccharides = బహుళ శర్కరలు ; సంకీర్ణ శర్కరలు ( గ.న )

Polysomnogram = బహుళాంశ నిద్రలేఖనము ( గ.న )

Pons =  మస్తిష్క వారధి ( గ.న ) / నాడీసేతువు ( గ.న ) నాడీ వారధి ( గ.న )

Popliteal Vein = జాను సిర ( గ.న )

Portal Vein = ద్వారసిర ( గ.న )

Porto Hepatic Shunt =   ద్వారసిర - కాలేయసిరల సంధానము ( గ.న )

Posterior Cerebral Artery = పృష్ఠ మస్తిష్క ధమని ( గ.న )

Posterior Communicating Artery = పృష్ఠ సంధాన ధమని ( గ.న )

Posterior Descending Artery = పర అవరోహణధమని ( గ.న )

Posterior Inter Ventricular Sulcus = పర జఠరికాంతర గర్తము ( గ.న )

Posterior nares = పర నాసికారంధ్రములు ( గ.న )

Posterior Tibial Vein = పృష్ఠజంఘిక సిర ( గ.న )

Posterior Tibilal Artery = పృష్ఠ జంఘిక ధమని ( గ.న )

Postural Hypotension = స్థితి సంబంధ అల్ప ( రక్త ) పీడనము ; స్థితి జనిత అల్పరక్తపీడనము ( గ.న )

Primary Biliary Cirrhosis = ప్రాథమిక పైత్య నారంగవ్యాధి ( గ.న )

Primary Hemostasis  = ప్రాథమిక రక్త స్థిరత్వము ( గ.న )

Profunda Femoris Artery = నిమ్నోరు ధమని ( గ.న )

Proteinases = మాంసకృత్తు విచ్ఛేదనములు ( గ.న )

Proton Pump Inhibitors = ప్రోటాను యంత్ర అవరోధకములు ( గ.న ) ; ఆమ్లయంత్ర అవరోధకములు ( గ.న ) /  ఆమ్లయంత్ర నిరోధకములు ( గ.న )

Psychomotor Retardation =  మానసిక చలన మాంద్యము ( గ.న )

Pulmonary Arterial Embolism = పుపుసధమని  ( రక్తప్రసరణ ) అవరోధకము ( గ.న )

Pulmonary Artery = పుపుస ధమని

Pulmonary Diseases = శ్వాసకోశ వ్యాధులు 

Pulmonary Edema = ఊపిరితిత్తుల నీటి ఉబ్బు  ( గ.న )

Pulmonary Fibrosis  = పుపుస తంతీకరణము (గ.న )

Pulmonary Function Tests = శ్వాస వ్యాపార పరీక్షలు (గ.న )

Pulmonary Valve = పుపుస కవాటము 

Pulmonary Vein = పుపుస సిర

Pulse Therapy = విరామ చికిత్స ( గ.న ) ; విశ్రాంత చికిత్స ( గ.న )

Pustules = చీము పొక్కులు ( గ.న )

Pyloric Stenosis = జఠర నిర్గమ బంధము ( గ.న )

Pylorus = జఠర అధో ద్వారము

Rabies = రభస వ్యాధి ( గ.న )

Radial Artery = ముంజేతి బహిర్ధమని ( గ.న )

Radiation = వికిరణము 

Radiation Therapy  =  వికిరణ చికిత్స ( గ.న )

Radioactive Iodine = రేడియోధార్మిక అయొడిన్ 

Rash = విస్ఫోటము

Reabsorption = పునర్గ్రహణము (గ.న )

Recall Immunity = స్ఫురణ రక్షణ ( గ.న )

Receptor Agonists = గ్రాహక ఉత్తేజకములు (గ.న )

Receptor Blockers = గ్రాహక అవరోధకములు ( గ.న )

Regurgitation = తిరోగమన ప్రసరణ ( గ.న )

Renal Arteries = మూత్రాంగ ధమనులు   ( గ.న )

Renal Calculus = మూత్రాంగ శిల ( గ.న )

Renal Corpuscles = మూత్ర ముకుళములు ( గ.న )

Renal Disorders = మూత్రాంగ వ్యాధులు ( గ.న )

Renal Pelvis = మూత్ర కుండిక ( గ.న ); మూత్ర పాళియ   ( గ.న ) 

Renal Replacement Therapy = మూత్రాంగ ప్రత్యామ్నాయ చికిత్స ( గ.న )

Renal Transplantation = పర మూత్రాంగ దానము ( గ.న )

Renal Tubules = మూత్ర నాళికలు  ( గ.న )

Renal Veins = మూత్రాంగ సిరలు Renal Veins ( గ.న )

Respiratory Acidosis = శ్వాస వ్యాపార ఆమ్లీకృతము ( గ.న )

Respiratory Failure = శ్వాస వైఫల్యము ( గ.న )

Restrictive Lung Disease = నిర్బంధ పుపుస వ్యాధి ( గ.న )

Reticulocytes = జాలిక కణములు ( గ.న )

Revascularisation = రక్తప్రసరణ పునరుద్ధరణ ( గ.న )

Revascularization Procedures = ధమనీ పునరుద్ధరణ చికిత్సలు ( గ.న )

Rhabdomyolysis = అస్థి కండరకణ విచ్ఛేదనము ( గ.న ) / అస్థికండర కణ విధ్వంసము ( గ.న )

Right Coronary Artery = దక్షిణ హృద్ధమని ( గ.న )

Right Marginal Artery = కుడి మేర ధమని (గ.న )

Rods = కోలలు 

Sanitizer = శుద్ధి పదార్థములు 

Saphenous Orifice  = దృశ్యసిర రంధ్రము ( గ.న )

Saphenous Vein = దృశ్య సిర ( గ.న )

Scales = పొలుసులు

Sclera = శ్వేతపటలము 

Sclerosing Agents = తంతీకరణ రసాయనకములు ( గ.న )

Scoliosis =  పక్క గూనె ; పక్క వంకరలు 

Screening Tests = శోధన పరీక్షలు ( గ.న )

Seasonal Allergy  = ఋతు అసహనములు ( గ.న )

Secondary Hemostasis  = ద్వితీయ రక్త స్థిరత్వము ( గ.న )

Sensitivity =  సూక్ష్మ గ్రహణము ( గ.న )

Sensory Cortex = జ్ఞాన వల్కలము ( గ.న )

Sensory Loss = స్పర్శ నష్టము  ( గ.న )

Sepsis  = సూక్షజీవ విషమయము ( గ.న )

Septal Branches = కుడ్య శాఖలు ( గ.న )

Septal Defects = విభాజక లోపములు ( గ.న )

Shingles , Herpes Zoster = అగ్గిచప్పి / అగ్నిసర్పి /  మేఖల విసర్పిణి ( గ.న ) ; ఒడ్డాణపు చప్పి ( గ.న )

Shock = అఘాతము 

Sickle Cell Anemia = లవిత్రకణ రక్తహీనత ( గ.న )

Sickle Cell Disease = లవిత్రకణ వ్యాధి ( గ.న )

Signs Of Inflammation = తాప లక్షణములు ( గ.న )

Sinusitis = నాసికాకుహర తాపము ( గ.న )

Smooth Muscle = మృదు కండరము (గ.న )

Squamous cells = పొలుసుల కణములు  ( గ.న )

Soft palate = మృదుతాలువు

Spasm = దుస్సంకోచము 

Speech Therapy =  వాగ్చికిత్స ( గ.న ) వాజ్ఞ్చికిత్స ( గ.న ) మాట కఱపు ( గ.న )

Specificity = నిర్దిష్టత 

Sphenoid = చీల ; కీల  ( గ.న ) / wedge

Sphenoid bone = కీలాస్థి ; చీల యెముక ( గ.న ) 

Sphenoid sinuses = కీలాస్థి కుహరములు ( గ.న )

Sphincter = నియంత్రణ కండరము ( గ.న )

Spinal Cord = వెన్నుపాము 

Spinal fluid = వెన్నుద్రవము

Spinal Nerves = వెన్ను నాడులు    

Spine = వెన్నెముక 

Spirals  = సర్పిలములు 

Spirometer = శ్వాస మాపకము ( గ.న )

Spleen = ప్లీహము

Splenomegaly = ఉరుప్లీహము ( గ.న )

Stable Angina =  స్థిర హృద్ధమని వ్యాధి ( స్థిరపు గుండెనొప్పి )( గ.న )

Standard Deviation = ప్రమాణ వ్యత్యాసము (గ.న )

Stasis Dermatitis = నిశ్చలత చర్మతాపము ( గ.న )

Steatohepatitis = వస తాపము ( గ.న )

Stem Cells = మూల కణములు ( గ.న )

Stent = వ్యాకోచ సాధనము ( గ.న )

Sterile = వ్యాధిజనక రహితము ( గ.న )

Stricture = సంకోచము, ఇరకటము ( గ.న )

Subclinical Hypothyroidism = అగోచర గళగ్రంథి హీనత ( గ.న )

Subcutaneous Tissue = చర్మాంతర కణజాలము ( గ.న ) ; అధశ్చర్మ కణజాలము ( గ.న )

Superficial Femoral Artery = బాహ్యోరు ధమని ( గ.న )

Superficial Thrombophlebitis  = బాహ్యసిరతాప రక్తఘనీభవనము ( గ.న )

Superficial Veins = బాహ్య సిరలు ( గ.న )

Superior Salivary Gland Nucleus = ఊర్ధ్వ లాలాజల కేంద్రము ( గ.న )

Superior Venacava = ఊర్ధ్వ బృహత్సిర

Supportive Treatment = ఆలంబన చికిత్స ( గ.న )

Suppressive Immunotherapies = అసహనములను అణచు రక్షణచికిత్సలు ( గ.న )

Surgical Gowns = నిలువుటంగీలు

Sympathetic Nervous System = సహవేదన నాడీమండలము (వ్యవస్థ )

Systole = హృదయ ముకుళితము ( గ.న )

Systolic Blood Pressure = ముకుళిత రక్తపీడనము ( గ.న )

Tachycardia = హృదయాతివేగము ( గ.న )

Tachypnoea = శ్వాసాతివేగము ( గ.న )

Temporal Lobe = ( మస్తిష్క ) కర్ణ భాగము ( గ.న )

Tetanus = ధనుర్వాత వ్యాధి

Thrombi = రక్తపుగడ్డలు ( గ.న )

Thrombocytopenia = సూక్ష్మఫలకల హీనత ( గ.న )

Thrombocytosis = సూక్ష్మఫలకల బాహుళ్యము ( గ.న )

Thrombolytic Therapy = రక్తపు ( నెత్తురు ) గడ్డల విచ్ఛేదన చికిత్స ( గ.న )

Thrombolytics = రక్తఖండ విచ్ఛేదనములు ( గ.న ) నెత్తురుగడ్డల విచ్ఛేదనములు ( గ.న ) 

Thyroid = గళగ్రంథి

Thyroid Function Tests = గళగ్రంథి వ్యాపార పరీక్షలు ( గ.న )

Thyroid Isthmus = గళగ్రంథి కర్ణికా సంధానము ( గ.న )

Thyroid Lobes = గళగ్రంథి  కర్ణికలు ( గ.న )

Thyroid Stimulating Hormone ; Thyrotropin  = గళగ్రంథి ప్రేరేపకము ( గ.న )

Thyroid Storm = గళగ్రంథి సంక్షోభము ( గ.న )

Thyrotropin Releasing Hormone = గళగ్రంథి ప్రేరేపక విమోచిని ( గ.న )

Tinea Barbae  = గడ్డపు తామర ( గ.న )

Tinea Capitis = తల తామర ; శిరస్సు శిలీంధ్ర వ్యాధి ( గ.న )

Tinea Carporis = ఒంటి తామర ( గ.న )

Tinea Cruris = తొడమూలపు తామర ( గ.న )

Tinea Pedis = పాదశిలీంధ్ర వ్యాధి ( గ.న )

Tinea Unguium ; Onychomycosis = గోటి తామర ; నఖ శిలీంధ్రవ్యాధి ( గ.న )

Tinea Versicolor = సోబి ; సుబ్బెము ( Pityriasis Versicolor )

Tinnitus = చెవిలో గీ ( గ.న ) , చెవి మ్రోత 

Tonsils = గళ రసిగుళికలు ( గ.న )

Toxins =  జీవ విషములు 

Trachea = శ్వాస నాళము

Transplant = పర అవయవ దానము ( గ.న )

Treadmill = నడక యంత్రము (గ.న )

Tricuspid Valve = త్రిపత్ర కవాటము 

Trigeminal Nerve = త్రిశాఖ నాడి

TSH Receptors  = గళగ్రంథి ప్రేరేపక గ్రాహకములు ( గ.న )

Tunica Externa Or Adventitia = రక్తనాళపు గోడలో బయటపొర ( గ.న )

Tunica Media =  రక్తనాళపు మధ్యపొర  ( గ.న )

Ultrasonography = శ్రవణాతీత ధ్వని చిత్రీకరణము ( గ.న ) / శ్రవణాతీత శబ్ద చిత్రీకరణము ( గ.న )

Ultraviolet Light = అతినీలలోహిత దీపము ( గ.న )

Ultraviolet Rays = అతినీలలోహిత కిరణములు ( గ.న )

Under Weight = భార హీనత ( గ.న )

Upper airway = ఊర్ధ్వ శ్వాసపథము ( గ.న )

Unstable Angina  = అస్థిర హృద్ధమని వ్యాధి ( అస్థిరపు గుండెనొప్పి )( గ.న )

Upper Motor Neuron Paralysis = ఊర్ధ్వ చలననాడీ పక్షవాతము ( గ.న )

Upper Motor Neurons = ఊర్ధ్వ చలన నాడీకణములు ( గ.న )

Ureteric Calculi = మూత్రనాళ శిలలు ( గ.న )

Ureters = మూత్ర నాళములు 

Urethra = మూత్ర ద్వారము 

Urinary Bladder = మూత్రాశయము 

Urinary Bladder Stones = మూత్రాశయ శిలలు ( గ.న )

Urticaria = దద్దుర్లు 

Uveitis = కృష్ణపటల తాపము  ( గ.న )

Vaccine = టీకా

Valvular Stenosis = కవాట సంకోచము ( గ.న )

Varicose Veins = ఉబ్బు సిరలు ( గ.న )

Varicose Venous Ulcers = ఉబ్బుసిర వ్రణములు ( గ.న )

Vasa Recta = సరళ ధమని ( గ.న )

Vasodilators = రక్తనాళ వ్యాకోచకములు ( గ.న )

Veins = సిరలు

Ventilation Defects = శ్వాస లోపములు ( గ.న )

Ventilator = శ్వాసయంత్రము (గ.న)

Ventricles = జఠరికలు

Ventricular Assist Devices = జఠరిక సహాయ పరికరము ( గ.న )

Ventricular Fibrillation = జఠరికా ప్రకంపనము ( గ.న )

Ventricular Filling Pressure = జఠరిక పూరక పీడనము ( గ.న )

Ventricular Septal Defect  = జఠరికాంతర కుడ్య రంధ్రము ( గ.న )

Ventricular Tachycardia  = జఠరికాతివేగము ( గ.న ) / జఠరిక అతివేగము ( గ.న )

Vertebral Arteries = వెన్ను ధమనులు ( గ.న )

Vertigo = కళ్ళు తిరుగుట , తల తిరుగుట

Very Low Density Lipoproteins = అల్పతమ సాంద్ర లైపో ప్రోటీనులు ( గ.న )

Vesicles = నీటి పొక్కులు

Vesicovaginal fistula = యోని మూత్రాశయ సంధినాళము (గ.న), మూత్రాశయ యోని సంధినాళము ( గ.న )

Viruses  ( from Latin vīrus“slime, poison”; akin to Sanskrit viṣá- विष, ) = విషజీవాంశములు ( గ.న ) 

Viscera = ఉదరాంతర అవయవములు ( గ.న )

Visual Cortex = దృష్టి వల్కలము ( గ.న )

Vital Signs  = జీవ లక్షణములు ( గ.న )

Voluntary Muscles = ఇచ్ఛా కండరములు

Water Solubility = జల ద్రావణీయత ( గ.న )

Wilson’S Disease ( Of Liver )= తామ్ర కాలేయవ్యాధి ( గ.న )

Xerosis =  ( చర్మ / నేత్ర ) శుష్క వ్యాధి ( గ.న ) 

Yeast ; Candida = మధు శిలీంద్రము 

Zoonosis = జంతువులనుంచి సంక్రమించు వ్యాధులు ; జంతు జనిత వ్యాధులు ( గ.న )


( గ.న = డాక్టరు. గన్నవరపు వరాహ నరసింహమూర్తి చే కూర్చబడిన పదములు )

విషయసూచిక

  1. ఆరోగ్యము ; వైద్యము https://gvnmurty.blogspot.com/2019/06/blog-post_2.html 2. మధుమేహవ్యాధి ( Diabetes mellitus ) https://gvnmurty.blogsp...